»   »  తమన్నా కన్నా...కాజలే బెస్ట్

తమన్నా కన్నా...కాజలే బెస్ట్

Posted By:
Subscribe to Filmibeat Telugu
Kajal
మొన్నటికి మొన్న బిగ్ సి భ్రాండ్ అంబాసిడర్ ఆఫర్ ని ఛార్మి నుండి అలవోకగా అందుకున్న కాజల్ ఇప్పుడు తమన్నా కి ట్విస్టు ఇచ్చింది. ఆర్య సీక్వెల్ లో ఎంపికైన తమన్నా ప్లేసులోకి కాజల్ వచ్చింది. భోగవల్లి ప్రసాద్, ఆదిత్యబాబు సంయుక్తంగా నిర్మించనున్న చిత్రం 'ఆర్య' సీక్వెల్ . సుకుమార్ డైరెక్ట్ చేయనున్నఈ సినిమా జూలైలో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనున్నది. ఒరిజినల్లోని బన్నీ, అనూరాధా మెహతా, శివబాలాజీ చేసిన ఆర్య, గీత, అజయ్ పాత్రలు సీక్వెల్‌లోనూ కొనసాగనున్నాయి. అయితే సీక్వెల్‌లో హీరో పాత్రను అల్లు అర్జున్ చేస్తుండగా, మిగతా రెండు పాత్రలకు తారలు మారుతున్నారు. గీత పాత్రని కాజల్, అజయ్ పాత్రని నవదీప్ చేయబోతున్నారు. వాస్తవానికి గీత పాత్రకు మొదట తమన్నాని ఎంపిక చేశారు. యేం జరిగిందో యోమో గానీ ఆ పాత్రకు తమన్నా కంటే కాజల్ మరింత చక్కగా సరిపోతుందని భావించి ఆమెను ఎంపికచేశామంటున్నారు.

నిజానికి ఇప్పుడు తెలుగులో లక్కీ హీరోయిన్ ఎవరెంటే కాజల్ అగర్వాల్ మాత్రమే. లక్ష్మీ కళ్యాణంతో పరిచయమైన ఈ ముద్దుగుమ్మ చందమామతో అందరి దృష్టిలో పడింది. అంతే అప్పటి నుంచి వరుసగా ఒక్కో క్రేజీ ప్రాజెక్టునే సంపాదిస్తూ క్రమక్రమంగా టాప్ హీరోయిన్ల లిస్టుకి చేరువవుతోంది. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న సినిమాలో రాంచరణ్ తేజ సరసన నటిస్తున్న ఆమె తాజాగా అల్లు అర్జున్ సరసన నాయికగా ఎంపికవటం పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది. దీంతో కాజల్ ఇంకా మరింతమంది హీరోయిన్ల అవకాశాలు తన్నుకుపోతుందో వేచి చూడాలంటున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X