»   » నిజమే... పవన్ కళ్యాణ్‍‌కి తిక్కుంది: ‘కాటమరాయుడు’పై షాకింగ్ నిర్ణయం!

నిజమే... పవన్ కళ్యాణ్‍‌కి తిక్కుంది: ‘కాటమరాయుడు’పై షాకింగ్ నిర్ణయం!

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం కాటమరాయుడు సినిమా షూటింగులో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు తన రాజకీయ పరమైన వ్యవహారాల్లో పాల్గొంటూనే మరో వైపు షూటింగులో పాల్గొంటున్నారు. మార్చి 24న సినిమా రిలీజ్ చేయాని ప్లాన్లో ఉన్న పవన్ వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు.

సినిమాకు సంబంధించిన షూటింగ్ దాదాపుగా పూర్తయింది. రెండు సాంగుల చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉంది. అయితే పవన్ కళ్యాణ్ తాజాగా తీసుకున్న నిర్ణయం చిత్ర యూనిట్ ను షాక్ కు గురి చేసిందట.

ఇటీవలే యూఎస్ఏ టూర్ నుండి తిరిగి వచ్చిన పవన్ కళ్యాణ్.... సినిమాకు సంబంధించి ఫస్ట్ కాపీ చూసి చాలా అసంతృప్తికి గురయ్యారట. కొన్ని సీన్లు అస్సలు బాగా రాలేదని, వాటిని రీ షూట్ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇందుకోసం రెండు రోజులు షూటింగ్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

rn

నిర్మాత కష్టాలు

పవన్ రీ షూట్ చేయాలనుకున్న సీన్లు చేయాలంటే హీరోయిన్ శృతి హాసన్ తో పాటు అందులో ఉన్న ఇతర నటులతో కూడా షూటింగ్ ఏర్పాట్లు చేయాలి. ఇతర షూటింగుల్లో బిజీగా ఉన్న వారిని రెండు రోజుల షూటింగుకు రప్పించడం నిర్మాతకు కష్టంగా మారిందని, పవన్ మాత్రం రీ షూట్ చేయాల్సిందే అని గట్టిగా కూర్చున్నాడని టాక్.

పవన్ కి తిక్కుంది, దానికో లెక్కుంది

పవన్ కి తిక్కుంది, దానికో లెక్కుంది

గబ్బర్ సింగ్ సినిమాలో పవన్ చెప్పినట్లు...నిజంగానే పవన్ కళ్యాణ్ కి నిజ జీవితంలోనూ కాస్త తిక్కుంది, అయితే దానికో లెక్కుంది అని స్పష్టమవుతోంది. బలమైన కారణం లేకుండా పవన్ కళ్యాణ్ ఏ పని చేయడు... మూవీస్ పరంగా ఆయన ఏం చేసినా సినిమా మంచి కోసమే చేస్తారు, రాజకీయ పరంగా అయితే ప్రజల మంచి కోసం చేస్తారు అని అంటున్నారంతా.

పవన్ కళ్యాణ్ ఒక భయంకరమైన క్యారెక్టర్: నాగబాబు చెప్పిన సంచలనాలు ఇవే....

పవన్ కళ్యాణ్ ఒక భయంకరమైన క్యారెక్టర్: నాగబాబు చెప్పిన సంచలనాలు ఇవే....

జనసేన పార్టీ అధినేతగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వేగంగా ఎదుగుతున్న పవన్ కళ్యాణ్ గురించి ఆయన సోదరుడు నాగబాబు.... పవన్ కళ్యాణ్ మీద నా దృష్టికోణం పేరుతో చాలా విషయాలు బయట పెట్టారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

యూఎస్ఏ టూర్ తర్వాత ‘కాటమరాయుడు’ సెట్లో పవన్ ఇలా... (ఫోటోస్)

యూఎస్ఏ టూర్ తర్వాత ‘కాటమరాయుడు’ సెట్లో పవన్ ఇలా... (ఫోటోస్)

హార్వర్డ్ యూనివర్శిటీలో జరిగిన సదస్సులో పాల్గొని తిరిగి హైదరాబాద్ వచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘కాటమరాయుడు' షూటింగులో బిజీ అయ్యారు...ఫోటోస్ కోసం క్లిక్ చేయండి.

నిహారిక ఏం చేసిందో తెలుసా? మెగా వారసుల కంటే ఫాస్ట్‌గా ఉందే!

నిహారిక ఏం చేసిందో తెలుసా? మెగా వారసుల కంటే ఫాస్ట్‌గా ఉందే!

మెగా డాటర్ కొణిదెల నిహారిక చిరంజీవి ఫ్యామిలీ నుండి వెండితెరకు పరిచయమైన తొలి హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నిహారిక మెగా హీరోలకంటే ఫాస్ట్ గా ఉంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

English summary
After watching the first copy of Katamarayudu iPawan felt that few scenes haven't turn out as good as expected. So Pawan Kaluyan wants to reshoot those scenes now and organised 2 days of shoot.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu