»   » నెగిటివ్ ఫీడ్ బ్యాక్, ఆలోచనలో చిరు, నచ్చలేదంటూ ఫ్యాన్స్

నెగిటివ్ ఫీడ్ బ్యాక్, ఆలోచనలో చిరు, నచ్చలేదంటూ ఫ్యాన్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :చిరంజీవి హీరోగా నటించనున్న 150వ సినిమా హంగామా మొదలుకాబోతుంది. ఈ నెలాఖరులోగానీ, మే మొదటి వారంలో కానీ సినిమాని మొదలు పెట్టనున్నట్టు చిరంజీవి స్వయంగా అభిమానులతో చెప్పిన విషయం తెలిసిందే. 'కత్తి'కి రీమేక్‌గా తెరకెక్కనున్న ఆ సినిమాకి 'కత్తిలాంటోడు' అనే పేరుని నిర్ణయించే ఆలోచన ఉందని చిరంజీవి అభిమానులతో చెప్పారు.

అయితే అందుతున్న సమచారాన్ని బట్టి చిరంజీవి అభిమానులు చాలా మంది ఈ టైటిల్ బాగాలేదని చెప్పినట్లు సమాచారం. టైటిల్ ఫీడబ్యాక్ కోసమే కావాలనే చిరంజీవి...ముందే అభిమానుల వద్ద రివీల్ చేసారు. అయితే అభిమానుల్లో చాలా మంది కత్తి టైటిలే బాగుంది కానీ ...కత్తిలాంటోడు టైటిల్ మరీ కుర్రతనంగా ఉందని వ్యాఖ్యానించారట. దాంతో చిరంజీవి పునరాలోచనలో పడ్డారట.

అలాగని కత్తి టైటిల్ తోనే ముందుకు వెళ్దామంటే ఆల్రెడీ కత్తి టైటిల్ ని వేరొకరు రిజస్టర్ చేసారు. దానికి తోడు గతంలో వచ్చిన కళ్యాణ్ రామ్ ..కత్తి సినిమా సైతం భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది. సెంటిమెంట్ గానూ ఆ టైటిల్ వద్దనుకున్నారట. మరి ఇప్పుడేమో కత్తిలాంటోడు టైటిల్ ..రామ్ చరణ్, సాయిధరమ్ తేజ, అల్లు అర్జున్ వంటి హీరోల సినిమాలకు పెట్టాలి కానీ చిరంజీవి లాంటి మెగా స్టార్ ఇమేజ్ ఉన్న హీరో సినిమాకు పెట్టడమేంటి అంటున్నారట.

 Kathilantodu receives negative feedback


రామ్‌చరణ్‌ నిర్మాతగా వి.వి.వినాయక్‌ దర్శకత్వంలో ఆ చిత్రం తెరకెక్కబోతోంది. రామ్‌చరణ్‌ పుట్టినరోజు సందర్భంగా ఇటీవల అభిమానులు పలు ప్రాంతాల్లో రక్తదాన శిబిరాల్ని నిర్వహించి 76వేల యూనిట్ల రక్తాన్ని సేకరించారు.

ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ హోటెల్‌లో అభిమానులతో చిరంజీవి, రామ్‌చరణ్‌ సమావేశమయ్యారు. చిరంజీవి మాట్లాడుతూ ''రక్తం అందక ఎవరూ చనిపోకూడదనే లక్ష్యంతోనే బ్లడ్‌ బ్యాంక్‌ ఏర్పాటు చేశా.

ఆ లక్ష్యం కోసం పాటు పడుతున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. తక్కువ వ్యవధిలో ఎవరూ వూహించని రీతిలో 76వేల యూనిట్ల రక్తాన్ని సేకరించారు అభిమానులు. దీనివల్ల ఎంతోమందికి మేలు జరుగుతుంది'' అన్నారు. ఆ సందర్భంలోనే చిరంజీవి తన 150వ సినిమాకు సంబంధించిన విషయాల్ని అభిమానులతో పంచుకొన్నట్టు తెలుస్తోంది.

English summary
Chiranjeevi’s fans are not impressed with Kathilantodu title. They are of the opinion that the title does not have the impact of 'Kaththi'.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu