For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  చిరంజీవి చెల్లెలిగా యంగ్ స్టార్ హీరోయిన్: రజినీకాంత్ తర్వాత మెగాస్టార్‌ కోసం ఇలా!

  |

  సుదీర్ఘ విరామం తర్వాత 'ఖైదీ నెంబర్ 150'తో సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు టాలీవుడ్ టాప్ హీరో మెగాస్టార్ చిరంజీవి. ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ అవడంతో పాటు ఆయనలో ఏమాత్రం గ్రేస్, పవర్ తగ్గలేదని నిరూపించింది. ఈ మూవీ రిజల్ట్ ఇచ్చిన ఉత్సాహంతో చిరు మరింత జోష్‌తో సినిమాలు చేస్తూ వస్తున్నారు. ఇప్పటికే సురేందర్ రెడ్డితో 'సైరా: నరసింహారెడ్డి' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈయన.. ప్రస్తుతం సక్సెస్‌ఫుల్ డైరెక్టర్‌గా పేరొందిన కొరటాల శివతో కలసి 'ఆచార్య' అనే సినిమాలో నటిస్తున్నారు. ఇందులో రామ్ చరణ్ కూడా కీలక పాత్రను చేస్తున్నాడు.

  Evaru Meelo Koteeswarulu: సీఎం అవడం కంటే అదే ముఖ్యం.. ఆ అమ్మాయితో ఎన్టీఆర్ సూపర్ మెసేజ్

  ఇది షూటింగ్ జరుకుంటూ ఉండగానే మెగాస్టార్ చిరంజీవి కొన్ని ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకున్నారు. వీటికి సంబంధించిన దర్శకుల పేర్లను కూడా గతంలోనే ప్రకటించారాయన. ఇక, ఈ స్టార్ హీరో చేయబోయే చిత్రాల్లో తమిళ సూపర్ హిట్ మూవీ 'వేదాళం' రీమేక్ కూడా ఉంది. ఈ చిత్రం ద్వారా తెలుగు సినీ ఇండస్ట్రీలో ఫ్లాప్ దర్శకుడిగా ముద్ర పడిన మెహర్ రమేశ్ సుదీర్ఘ గ్యాప్ తర్వాత రీఎంట్రీ ఇస్తున్నాడు. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా పూర్తైంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు గురించి ఓ ఆసక్తికరమైన వార్త ఫిలిం నగర్‌లో తెగ వైరల్ అవుతోంది.

   Keerthi Suresh to play Chiranjeevi Sister Role in Vedalam Remake

  మాస్ డైరెక్టర్‌గా పేరొందిన శిరుత్తి శివ తెరకెక్కించిన 'వేదాళం' మూవీలో అజిత్ హీరోగా నటించగా.. అతడి చెల్లెలి పాత్రలో లక్ష్మీ మీనన్ నటించింది. వీళ్లిద్దరి మధ్య వచ్చే సెంటిమెంట్ సీన్స్ సినిమాకు హైలైట్‌గా నిలిచాయి. ఇక, ఇప్పుడు చిరంజీవి చేయబోయే వేదాళం రీమేక్ మూవీలో అతడి చెల్లెలి పాత్రకు మహానటి కీర్తి సురేష్‌ను తీసుకున్నారని తెలుస్తోంది. ఎంతో ప్రాధాన్యత ఉన్న ఈ పాత్ర కోసం చిత్ర యూనిట్ ఆమెను సంప్రదించగానే.. వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని తెలిసింది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రాబోతుందని టాక్ ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. కీర్తీ సురేష్ ప్రస్తుతం రజినీకాంత్ నటిస్తోన్న 'అన్నత్తే' మూవీలోనూ ఆయనకు సోదరిగా నటిస్తోంది.

  ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న ఈ సినిమా వచ్చే ఆక్టోబర్‌లో కానీ, నవంబర్‌లో కానీ ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ సినిమా కోసం మెగాస్టార్ చిరంజీవిని మెప్పించేందుకు దర్శకుడు మెహర్ రమేశ్ గత ఏడాది కోల్‌కతా వెళ్లి మరీ కొన్ని శాంపిల్ షాట్స్‌ను తెరకెక్కించినట్లు తాజాగా తెలిసింది. దసరా సమయంలో అక్కడ కుంభమేళా జరుగుతుంది. అందుకే అక్కడ ఈ సన్నివేశాలు చిత్రీకరించాడట. ఇందుకోసం ఈ దర్శకుడు ఏకంగా రూ. 30 లక్షలు కూడా ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఇవన్నీ చిరంజీవికి బాగా నచ్చాయని కూడా తెలుస్తోంది.

  సింగర్ సునీత పర్సనల్ ఫొటోలు: హీరోయిన్లకు ఏమాత్రం తగ్గకుండా.. ఆమెను మీరెప్పుడూ ఇలా చూసుండరు!

  ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ సెంటిమెంట్‌తో తెరకెక్కున్న ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి గుండుతో కనిపించబోతున్నారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. అందుకోసమే ఆయన ఆ మధ్య లుక్ టెస్ట్ కూడా చేసుకున్నారనే టాక్ వినిపించింది. అలాగే, ఈ సినిమాలో బిగ్ బాస్ బ్యూటీ దివి వాద్యా పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటింబోతుంది. ఈ విషయాన్ని మెగాస్టారే స్వయంగా వెల్లడించారు.

  English summary
  Megastar Chiranjeevi Announced Few Films At a Time. In This List Vedalam Remake Also Placed. This Film will be Directed by Meher Ramesh. Keerthi Suresh to play Chiranjeevi Sister Role in This Movie.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X