Just In
- 9 hrs ago
చార్ కదమ్ అంటూ చిరు రచ్చ.. మెగా ఫ్రేమ్‌లో నలుగురు దర్శకులు!
- 10 hrs ago
అది ఒత్తిడితో కూడుకున్న పని.. వారి వల్లే సాధ్యమైంది.. దూసుకెళ్తోన్న శివజ్యోతి
- 11 hrs ago
నాగ్‌తో అలా చిరుతో ఇలా.. ప్లానింగ్ మామూలుగా లేదు.. మెగా ఇంట్లో సోహెల్ రచ్చ
- 12 hrs ago
నితిన్ ‘చెక్’ అప్డేట్.. థియేటర్లోకి వచ్చేది ఎప్పుడంటే?
Don't Miss!
- Lifestyle
శనివారం దినఫలాలు : వృశ్చిక రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా అదృష్టం కలిసి వస్తుంది...!
- News
మూడ్ ఆఫ్ ది నేషన్ 2021: రైతుల ఆందోళనను మోడీ సర్కారు బాగా నియంత్రించింది
- Finance
భారీగా పడిపోయిన బంగారం, వెండి ధరలు: వెండి రూ.1,000కి పైగా డౌన్
- Sports
భారత్ చారిత్రక విజయం వెనుక ఆ ముగ్గురిది కీలక పాత్ర: ఇంజమామ్ ఉల్ హక్
- Automobiles
అలెర్ట్.. ఇక రోడ్డుపై అలా వెళ్తే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
పవన్ కల్యాణ్‌తో బాలీవుడ్ హాట్ భామ.. లైన్లో పెడుతున్న హరీష్ శంకర్
గబ్బర్ సింగ్ తర్వాత పవర్ స్టార్ పవన్ కల్యాణ్, దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్‌లో మైత్రీ మూవీస్ బ్యానర్‌లో మరో సినిమా ప్రకటించగానే వీర లెవెల్లో అంచనాలు పెరిగాయి. గబ్బర్ సింగ్‌ను మించిన మూవీ వస్తుందని అభిమానులు ఫిక్స్ అవుతున్నారు. ఈ క్రమంలో పవన్ కల్యాణ్‌ను మైత్రీ మూవీస్ నిర్మాతలు, దర్శకుడు హరీష్ శంకర్ ఇటీవల కలవడం మరింత ప్రాధాన్యతను సంతరించుకొన్నది. ఆ వివరాల్లోకి వెళితే..

లాక్‌డౌన్ కారణంగా జాప్యం
లాక్‌డౌన్ పరిస్థితులు రాకపోతే ఇప్పటికే పవన్, హారీష్ శంకర్ సినిమా పూర్తయి ఉండేదేమో అనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తున్నది. కరోనా వైరస్ కారణంగా పవన్ నటించే మూడు, నాలుగు సినిమాలు వాయిదా పడ్డాయి. లాక్‌డౌన్ ఎత్తివేత తర్వాత షూటింగులు జరుగుతుండటంతో హరీష్ శంకర్ తన సినిమాను పట్టాలెక్కించే ప్రయత్నం చేస్తున్నారు.

న్యూ ఇయర్ రోజున పవన్‌తో
కొత్త సంవత్సరం రోజున పవన్ కల్యాణ్‌ను హరీష్ శంకర్, మైత్రీ మూవీస్ అధినేతలు కలవడంపై దేవీ శ్రీ ప్రసాద్ ట్వీట్ చేస్తూ.. ఇప్పటికే నీవు చెప్పిన సీన్లు నాకు రోమాలు నిక్కబొడిచాయి. ఎప్పుడెప్పుడూ ఆ సీన్లను తెరపైన చూడాలా వెయిట్ చేస్తున్నాను అని దేవీ శ్రీ ప్రసాద్ అన్నారు.
మాళవిక మోహనన్ బ్యూటిఫుల్ ఫోటో గ్యాలరీ.. క్లీవేజ్ షోతో పిచ్చెక్కిస్తున్న బ్యూటీ

కియారా అద్వానీతో సంప్రదింపులు
అయితే పవన్ కల్యాణ్‌తో ప్రారంభించే సినిమా కోసం నటీనటుల ఎంపికపై కసరత్తు జరుగుతున్నది. ఈ క్రమంలో హీరోయిన్ ఎంపికపై హరీష్ శంకర్ దృష్టిపెట్టిన్నట్టు సమాచారం. ఈ క్రమంలో బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీతో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తున్నది. దాదాపు కియారా ఎంపిక కన్ఫర్మ్ అయినప్పటికీ.. అధికారికంగా ప్రకటించడానికి కొన్ని విషయాలు అడ్డువచ్చినట్టు సమాచారం.

హిందీలో బిజీ కావడంతో
తెలుగులో మహేష్ బాబుతో భరత్ అనే నేను, రాంచరణ్‌తో వినయ విధేయ రామ చిత్రంలో కియారా అద్వానీ నటించి మెప్పించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత హిందీలో భారీ ప్రాజెక్టులు ముందుకు రావడంతో హిందీలో బిజీగా మారిపోయారు. దాంతో తెలుగు సినిమాకు దూరం అయ్యారు.

ప్రియుడితో మాల్దీవుల్లో కియారా
ప్రస్తుతం కియారా అద్వానీ తన ప్రియుడు సిద్దార్థ్ మల్హోత్రాతో కలిసి కొత్త సంవత్సరం వేడుకలను మాల్దీవుల్లో ఘనంగా జరుపుకొన్నారు. మాల్దీవుల్లో కియారా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. బికినీలో కియారా అందాలకు అభిమానులు ఫిదా అవుతున్నారు.