»   » 'కిక్ 2' ఖరారు...పూర్తి డిటేల్స్

'కిక్ 2' ఖరారు...పూర్తి డిటేల్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :రవితేజ, ఇలియానా కాంబినేషన్లో సురేంద్రరెడ్డి రూపొందించిన కిక్ చిత్రం మంచి హిట్ ని సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడా ఆ చిత్రానికి సీక్వెల్ రెడీ అవుతోందని సమాచారం. ఈ సీక్వెల్ లోనూ రవితేజ హీరోగా చేస్తున్నారు. మరో హీరో కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై ఈ చిత్రం రూపొందుతుంది. 2014 మే నెలలో ఈ చిత్రం ప్రారంభం కానుందని సమాచారం. ఈ మేరకు ఎగ్రిమెంట్ జరిగిందని ఫిల్మ్ సర్కిల్స్ లో చెప్తున్నారు.

సీక్వెల్ లో కేవలం క్యారెక్టరైజేషన్ కంటిన్యూ అవుతుందని అంటున్నారు. అందులో హీరో పోలీస్ ఆఫీసర్ అయిన తర్వాత కిక్ సినిమా ముగుస్తుంది. కాబట్టి సీక్వెల్ లో పోలీస్ పాత్ర ఉంటుందని తెలుస్తోంది. ఇక హీరోయిన్ గా అనూష్క ని ఎంపిక చేసే అవకాశాలన్నాయి. అలాగే బ్రహ్మానందం హల్వా రాజ్ పాత్ర కొత్త మెలికతో అదరకొడుతుందని అంటున్నారు. అయితే ఈ కథలో మంచి లవ్ స్టోరి ఉండేలా తయారు చేస్తున్నారని సమాచారం.

'Kick 2' to kick start in mid 2014!

ప్రస్తుతం సురేంద్రరెడ్డి రేసుగుర్రం హడావిడిలో ఉన్నారు.''కుటుంబ అనుబంధాల నేపథ్యంలో సాగే కథ ఇది. వినోదానికి ప్రాధాన్యముంది. అల్లు అర్జున్‌లో హుషారంతా ఈ సినిమాలో కనిపిస్తుంది. ఫిబ్రవరిలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాము'' అని దర్శకుడు సురేంద్ర రెడ్డి అన్నారు. అలాగే పరుగు పందెంలో గెలవడం రేసుగుర్రం విధి. జీవితమనే పరుగు పందెంలో గెలవడం మనిషి విధి. అయితే... ఈ రేసులో అడపాదడపా గెలిచేవారు కొందరైతే... గెలుపుని ఇంటిపేరుగా మార్చుకున్నవాళ్లు కొందరు. ఆ కొందరిలో ఒకడి కథే... 'రేసుగుర్రం. బాధ్యతాయుతమైన ఓ యువకుని కథాంశంతో సురేందర్‌రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ శక్తిమంతమైన పాత్ర పోషిస్తున్నారు

చిత్రం గురించి అల్లు అర్జున్ మాట్లాడుతూ... పోటీకి సిద్ధమైన కుర్రాడు ఎలా ఉంటాడు... చీకట్లను చీల్చుకుంటూ, ప్రత్యర్థుల కళ్లలో భయాన్ని పెంచుతూ, కదన రంగంలోకి దిగుతున్న సైనికుడిలా ఉంటాడు. ఇంకా చెప్పాలంటే మా సినిమాలో హీరోలా ఉంటాడు అంటున్నారు ‌. నల్లమలుపు శ్రీనివాస్‌ (బుజ్జి), కె.వెంకటేశ్వరరావు నిర్మాతలు. యాక్షన్‌, ప్రేమ, వినోదాల్ని మేళవించిన ఈ చిత్రాన్ని ఫిబ్రవరిలో విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. తమన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు.

English summary

 Now, four years later the sequel of Kick is on cards. If sources are to be believed this film will go on floors mid 2014. Ravi Teja and Surender Reddy will team up again for this film. Kick 2 will be produced by Kalyan Ram’s production house, popularly known as NTR Arts. It’s interesting to know that Ravi Teja starrer film will be produced by Kalyan Ram.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu