»   » ఇలియానానే కావాలని పట్టుపడుతున్న సురేంద్రరెడ్డి...

ఇలియానానే కావాలని పట్టుపడుతున్న సురేంద్రరెడ్డి...

Posted By:
Subscribe to Filmibeat Telugu

లీడర్ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన రాణా తన తదుపరి చిత్రాన్ని సురేంద్రరెడ్డితో చేసే అవకాశముంది.నల్లమలపు బుజ్జి నిర్మించే ఈ చిత్రం గురించి ఈ మేరకు గత కొద్ది రోజులుగా డిస్కషన్స్ జరుగుతున్నాయి. అయితే ఈ కథ ఇంతకుముందు స్రవంతి రవికిషోర్ కంపెనీలో ఓకే అయి బడ్జెట్ ఇబ్బందులు మేరకు ఆగిపోయిందని సమాచారం. ఇప్పుడా కథ రాణాకి నచ్చటంతో సురేష్ బాబు దీన్ని ముందుకు తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఈ సమయంలో రాణా ప్రక్కన హీరోయిన్ గా కనిపించే ఎవరున్నారు అని అనుకుంటే ఇలియానా కరెక్టుగా సూటవుతుందని సురేంద్రరెడ్డి ప్రపోజ్ చేసారుట. కిక్ సినిమాలో చేసిన ఈమెను సురేంద్రరెడ్డి మళ్లీ తీసుకోవాలనే ఆలోచనతో ఉన్నారుట. మొదట ఇలియానా, రామ్ కాంబినేషన్ అనే ఈ చిత్రం కథ చెప్పారు. అయితే ఇలియానా కోటికి తగ్గననటం, జెనీలియాతో రామ్ చేసిన రెడీ హిట్ ఉండటంతో తప్పనిసరి స్ధితిలో జెనీలియా వచ్చి చేరింది. అయితే ఆ ప్రాజెక్టు కాన్సెల్ కావటంతో ఇలియానాకి కలిసి వచ్చినట్లేనని అంటున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu