Don't Miss!
- Sports
INDvsAUS : భారత్తో టెస్టు సిరీస్ ముందు.. బెంగళూరులో ఆస్ట్రేలియా జట్టు ప్రాక్టీస్ సెషన్స్
- News
హైదరాబాద్లో మరో దిగ్గజ సంస్థ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్: 1800 మందికి ఉపాధి
- Technology
ఆపిల్ నుంచి ఫోల్డబుల్ ఐఫోన్ లాంచ్ వివరాలు! కొత్త ఫీచర్లు!
- Lifestyle
ఈ రాశుల వారు భగ్నప్రేమికులు, అలా పడిపోతారు ఇలా విడిపోతారు
- Finance
Adani Enterprises FPO: అనుకున్నది సాధించిన అదానీ.. మూడో రోజు మ్యాజిక్.. ఏమైందంటే..
- Automobiles
అమరేంద్ర బాహుబలి ప్రభాస్ కాస్ట్లీ కారులో కనిపించిన డైరెక్టర్ మారుతి.. వీడియో వైరల్
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్లోని ఈ సరస్సులు!
తెలుగు డైరెక్టర్స్ పై ధనుష్ ఫోకస్.. మరో యువ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్?
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇటీవల కాలంలో ఎక్కువ స్థాయిలో దర్శకులకు మంచి గుర్తింపు లభిస్తోంది. పక్క ఇండస్ట్రీలో నుంచి కూడా స్టార్ హీరోలు తెలుగు దర్శకులతో సినిమాలు చేసేందుకు ఎక్కువ స్థాయిలో ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా తమిళ ఇండస్ట్రీలోని టాలెంటెడ్ హీరో ధనుష్ అయితే రాబోయే ప్రాజెక్టుల కోసం ఎక్కువగా తెలుగు దర్శకులు సెలెక్ట్ చేసుకోవడం విశేషం. ప్రస్తుతం అయితే తొలిప్రేమ మిస్టర్ మజ్ను సినిమాల దర్శకుడు వెంకీ అట్లూరితో సార్ అనే సినిమాను విడుదలకు రెడీ చేస్తున్నాడు.
ఈ సినిమాపై ఓవర్గం ప్రేక్షకుల్లో అంచనాలు గట్టిగానే ఉన్నాయి. ఇప్పటికే షూటింగ్ కూడా పూర్తయింది. ఇక ఫిబ్రవరిలో ఈ సినిమాను విడుదల చేయడానికి రెడీ అవుతున్నారు. అలాగే టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కూడా సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ సినిమాను ఏషియన్ సినిమాస్ పాన్ ఇండియా మూవీగా తెరపైకి తీసుకురాతొంది. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో రాబోతున్న ఆ సినిమాపై అంచనాలు గట్టిగానే ఉన్నాయి. ఇప్పటికే పూర్తి స్థాయిలో కదను కూడా రెడీ చేశారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలు కాబోతోంది.

అయితే రీసెంట్ గా ధనుష్ మరో తెలుగు డైరెక్టర్ కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా ఒక టాక్ వినిపిస్తోంది. ఆ దర్శకుడు మరెవరో కాదు. శ్రీకారం సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న బి.కిషోర్ అని తెలుస్తోంది. శర్వానంద్ తో గతంలో శ్రీకారం అనే సినిమాను తెరపైకి తీసుకువచ్చిన ఈ దర్శకుడు బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయాడు.
కానీ ఆ సినిమాను చూసినవారు చాలా పాజిటివ్ గా స్పందించారు. అయితే ధనుష్ ఇటీవల ఆ దర్శకుడు చెప్పిన కథపై చాలా ఆసక్తి చూపించినట్లు తెలుస్తోంది. ఇక ఆ ప్రాజెక్ట్ ను ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించే అవకాశం ఉందట. ఇప్పటికే దిల్ రాజు ధనుష్ తో కూడా మాట్లాడి ఒక ప్రణాళిక కూడా రెడీ చేసినట్లుగా తెలుస్తోంది. కమర్షియల్ గా దర్శకుడు పెద్దగా సక్సెస్ అందుకోకపోయినప్పటికీ కూడా అతనిపై చాలా నమ్మకంతో ఈ ప్రాజెక్టును దిల్ రాజు తీసుకురాబోతున్నాడు. ఇక ధనుష్ అయితే మరో ఇద్దరు తెలుగు దర్శకులతో కూడా సినిమాలు చేసే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది.