»   » ‘ శంకరాభరణం’ : కోన వెంకట్-నిఖిల్ కాంబినేషన్ లో...

‘ శంకరాభరణం’ : కోన వెంకట్-నిఖిల్ కాంబినేషన్ లో...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ప్రముఖ తెలుగు సినీ రచయిత కోన వెంకట్ ఓ చిత్రాన్ని నిర్మించటానికి రెడీ అవుతునున్నారు. ఈ సారి ఆయన హీరో నిఖిల్ తో ముందుకు వెళ్తున్నారు.‘శంకరాభరణం' టైటిల్ తో ఈ చిత్రం రూపొందనుందని సమాచారం. ఇది బీహార్ నేపధ్యంలో క్రైమ్ ప్రధానంగా సాగే థ్రిల్లర్. ఈ విషయాన్ని ఆయనే తన సోషల్ నెట్ వర్కింగ్ పేజీ ద్వారా ఖరారు చేసి తెలిపారు.

ఈ చిత్రం ద్వారా ఉదయ్ నందనవనం అనే అతను దర్శకుడుగా పరిచయం అవ్వనున్నారు. అలాగే ప్రవీణ్ లక్కిరాజు ఈ చిత్రానికి సంగీతం అందిస్తారు. ఇంతకుముందు కోన వెంకట్..అంజలి ప్రధాన పాత్రలో గీతాంజలి అనే హర్రర్ కామెడీని నిర్మించి హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం కూడా అన్ని రకాల ఎలిమెంట్ లతో డిఫెరెంట్ గా సాగుతుందని చెప్తున్నారు.

Kona Venkat to produce Nikhil’s next

ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో సక్సెస్ ఫుల్ రైటర్ గా కెరీర్ సాగిస్తున్న రచయితల్లో కోన వెంకట్ ఒకరు. ఆయన ఏ సినిమాకు పని చేసినా.....ఆ సినిమా బాగా ఆడుతుందనే పేరు ఉంది. ఆయన రాసే డైలాగ్స్, స్క్రీన్ ప్లే కోసం పలువురు దర్శకులు, హీరోలు ఎదురు చస్తారంటే ఆయనకున్న డిమాండ్ ఏమిటో అర్థం చేసుకోవచ్చు. నిఖిల్ కోసం కథను ప్రస్తుతం తయారు చేసినట్లు తెలుస్తోంది.

నిఖిల్ బాడీ లాంగ్వేజికి తగిన విధంగా కోన వెంకట్ కథ తయారు చేసారని అంటున్నారు. పూర్తి వినోదాత్మకంగా సాగే కమర్షియల్ ఎంటర్టెనర్ గా ఉంటూనేై క్రైమ్ ఎలిమెంట్ ఈ చిత్రంలో ఉండనుంది. సినిమాలో బ్రహ్మానందం కీలక పాత్రలో నటిస్తానరి తెలుస్తోంది. ఆయన కోసం కోన వెంకట్ స్పెషల్ క్యారెక్టర్ క్రియేుట్ చేసినట్లు తెలుస్తోంది. కధల ఎంపికలో నిఖిల్ చాలా జాగ్రత్తలు వహిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.

'కార్తికేయ' సినిమా విజయంతో మంచి డిమాండులోకి వచ్చిన నిఖిల్ ప్రస్తుతం 'సూర్య వెర్సస్ సూర్య' అనే సినిమాలో నటించాడు. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా రూపొందిన‘సూర్య వర్సెస్ సూర్య' భాక్సాఫీస్ వద్ద అనుకున్న విధంగా వర్కవుట్ కాలేదు. గతంలో పలు చిత్రాలకు కెమెరామెన్ గా పనిచేసిన కార్తీక్ ఘట్టమనేని డైరెక్టర్ గా పరిచయం అయ్యారు.

English summary
Kona Venkat, is all set to produce a flick with Nikhil soon. The movie is titled ‘Shankara Bharanam’ which will be on the lines of a crime back drop set in Bihar.
Please Wait while comments are loading...