»   » కోపంతో శ్రీను వైట్లనే గిల్లాడంటున్నారు

కోపంతో శ్రీను వైట్లనే గిల్లాడంటున్నారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : "కొంతమంది సొంతపనిని పక్కనపెట్టి పక్కవాళ్ళ మీద ఎక్కువ ఫోకస్ పెడుతుంటారు... త్వరగా అవుట్ ఫోకస్ అయ్యిపోయెది కూడా వీళ్ళే !!" అంటూ ప్రముఖ సిని రచయిత కోన వెంకట్ ట్విట్టర్ ద్వారా వేసిన కౌంటర్ ఇప్పుడు అంతటా చర్చనీయాంశంగా మారింది. ఆగడు టీజర్ రిలీజైన నేపధ్యంలో ఈ ట్వీట్ మీడియావారు సైతం హైలెట్ చేస్తున్నారు. శ్రీను వైట్లను ఉద్దేశించి ఈ ట్వీట్ చేసాడంటున్నారు. ఆగడు టీజర్ లో పంచ్ డైలాగులుపై మహేష్ వేసిన పంచ్ ...కోనకే తగిలింది అంటున్నారు. దర్శక,రచయిత కోన వెంకట్ కి, శ్రీను వైట్ల కి గత కొంత కాలంగా పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న నేపధ్యంలో ఈ ట్వీట్ ఎంతవరకూ వెళ్తుందో చూడాలి.

పంచ్‌ డైలాగు లేకపోతే.. టీజర్‌, ట్రైలర్‌ పూర్తవడం లేదు. ఆఖరి పంచ్‌ హీరోదైతే ఆ కిక్కే వేరుగా ఉంటుందని సినీ జనాలకు అర్థమయ్యింది. అందుకే పంచ్‌లు పేలుతున్నాయి. అయితే మహేష్‌బాబు మాత్రం పంచ్‌లపైనే పంచ్‌ వేసేశాడు. 'ఆగడు' టీజర్‌లో. మహేష్‌బాబు, శ్రీనువైట్ల కలయికలో రూపుదిద్దుకొంటున్న చిత్రం 'ఆగడు'. తమన్నా కథానాయిక. 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనిల్‌ సుంకర నిర్మిస్తున్నారు.

 Kona Venkat tweet on Sreenu Vaitla

కృష్ణ పుట్టినరోజు సందర్భంగా శనివారం 'ఆగడు' టీజర్‌ని విడుదల చేశారు. ఇందులో మహేష్‌ పలికిన సంభాషణలు అభిమానుల్లో కొత్త ఉత్సాహం నింపాయి. ''సినిమాల ప్రభావం జనాలమీద ఎంతుందో తెలియదుగానీ, పంచ్‌ డైలాగుల ప్రభావం గట్టిగా ఉంది..'' అంటూ పంచ్‌లపై ఓ పంచ్‌ వేశారు. ''ప్రతివోడూ పులులు, సింహాలు, ఏనుగులు, ఎలుకలంటూ ఎదవ కంపేరిజన్‌లు, ఒళ్లు వులపరం వచ్చేస్తోంది..'' అంటూ ఇంకోటి. మొత్తానికి టీజర్‌ మొత్తం హుషారుగా సాగిపోయింది.

ఇటీవల లడఖ్‌లో చిత్రీకరణ పూర్తిచేశారు. ఈనెల 5 నుంచి 21 వరకూ ముంబైలో మరో షెడ్యూల్‌ జరగనుంది. సెప్టెంబరులో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. ''మహేష్‌ కెరీర్‌లో నెంబర్‌ వన్‌గా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నాం. మహేష్‌ పలికే ప్రతి సంభాషణ ఆకట్టుకొంటుంది. ఆయన కామెడీ టైమింగ్‌ అందరికీ నచ్చుతుంద''ని చిత్రబృందం చెబుతోంది. తమన్‌ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

English summary
Kona has made sharp comments on director srinu vytla at that time and he has once again taken a dig at the director indirectly. He has posted a tweet which translates to "Some people focus on others, instead of minding their own business. They are the people who gets out of focus soon".
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu