రాముడు, కర్ణుడిగా రికార్డులు.. మరో పౌరాణిక పాత్రలో ప్రభాస్? ఆ స్టార్ డైరెక్టర్ ప్లానింగ్?

ప్రస్తుతం భారతీయ చిత్ర పరిశ్రమలో క్రేజ్, మార్కెట్ పరంగా ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నారు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్. ఏడాదికి ఖచ్చితంగా ఒక్క సినిమా అయినా సరే రిలీజ్ చేయాలనే పట్టుదలతో ఉన్నారు ప్రభాస్. ఈ ఏడాది కన్నప్ప సినిమాలో గెస్ట్ రోల్‌తో అభిమానులను పలకరించారు డార్లింగ్. ఇక ఏడాది చివరిలో ది రాజా సాబ్ అంటూ అలరించనున్నారు. యాక్షన్, మాస్ మసాలా సినిమాలతో ఊపు మీదున్న ప్రభాస్.. కొంచెం గ్యాప్ ఇచ్చి ఫ్యామిలీ, హార్రర్, కామెడీ జోనర్‌తో కుటుంబ ప్రేక్షకులకు దగ్గరవ్వాలనే ఉద్దేశంతో ది రాజా సాబ్ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

ప్రభాస్ డైరీ ఫుల్
ప్రభాస్ డైరీ రెండు మూడేళ్ల వరకు ఖాళీ లేదంటే అతిశయోక్తి కాదు.. మారుతి దర్శకత్వంలో రాజా సాబ్‌ని వేగంగా పూర్తి చేస్తున్నారు డార్లింగ్. కల్కి 2, సలార్ 2, స్పిరిట్, ఫౌజీ సినిమాలతో భారీ లైనప్ ఉంది. ఇవి కాకుండా మరికొన్ని ప్రాజెక్ట్‌లు చర్చల దశలో ఉన్నాయి. వీటిలో ప్రభాస్‌ ముందుగా ఏ సినిమాకు కమిట్ అవుతారో తెలియాల్సి ఉంది. ఇవన్నీ కూడా భారీ బడ్జెట్ సినిమాలు కాగా.. ఒక్కొక్కటీ అవలీలగా 1000 కోట్ల పైనే కలెక్షన్స్ రాబడతాయని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు.

Koratala Siva to ready mythological script for Prabhas

కొరటాలతో ప్రభాస్ మూవీ?
తాజాగా ప్రభాస్ గురించి మరో క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతోంది. వరుస ఫ్లాపుల్లో ఉన్న ప్రభాస్‌కు మిర్చితో ఘన విజయాన్ని అందించి, తిరిగి ట్రాక్‌లోకి తీసుకొచ్చారు కొరటాల శివ. అందుకే ఆయనంటే డార్లింగ్‌కు ప్రత్యేక అభిమానం. ఆయనతో ఓ సినిమా చేసేందుకు ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా చిత్రసీమలో గాసిప్స్ వినిపిస్తున్నాయి. కమర్షియల్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న కొరటాల.. ప్రభాస్ మూవీని డిఫరెంట్‌గా ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది. పౌరాణికాలు, దేవుళ్ల కాన్సెప్ట్‌తో వస్తున్న సినిమాలకు ఇప్పుడు బాగా డిమాండ్ ఉన్న నేపథ్యంలో అదే తరహాలో సినిమాలు చేసేందుకు దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.

ప్రభాస్ కోసం మైథాలజికల్ స్క్రిప్ట్
ఈ క్రమంలోనే కొరటాల శివ కూడా ప్రభాస్ కోసం మైథాలజీ వైపు అడుగులు వేస్తున్నారట. దీనిలో భాగంగా భారతీయుల ఇతిహాసం.. మహాభారతం బ్యాక్‌డ్రాప్‌లో ప్రభాస్‌తో సినిమా తెరకెక్కించాలని కొరటాల ప్లాన్ చేస్తున్నారట. మహాభారతంలోని ప్రధాన పాత్రలలో ఒకరైన భీముడి పాత్రను ప్రభాస్ పోషిస్తారని ఫిలింనగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రభాస్ లుక్ కోసం ఇప్పటికే ఓ ప్రత్యేక బృందం పని ప్రారంభించినట్లుగా వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండగా.. ప్రభాస్ పర్సనాలిటీ భీముడి గెటప్‌కు సరిగ్గా సరిపోతుందని ఆయన అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. ఇది నిజమైతే ఇప్పటికే ఆదిపురుష్‌లో రాముడిగా, కల్కి 2898 ఏడీలో కర్ణుడిగా కనిపించి వసూళ్ల వర్షం కురిపించిన ప్రభాస్‌కు మరో పౌరాణిక పాత్ర దొరికినట్లే.

కొరటాల చేతిలో సినిమాలు
ఒకవేళ కొరటాల శివకు డార్లింగ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా.. ప్రభాస్‌ డైరీ ప్రస్తుతం ఫుల్‌గా ఉంది. ఆయన చేతిలో ఉన్న సలార్ 2, కల్కి 2, ఫౌజీ, స్పిరిట్ సినిమాలు పూర్తవ్వడానికి కనీసం మూడు నాలుగేళ్లు ఈజీగా పడుతుంది. ఆ తర్వాతే ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్తుంది. అటు కొరటాల శివ కూడా ఎన్టీఆర్‌తో దేవర 2 తీసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇది కాకుండా అక్కినేని నాగచైతన్య, అల్లు అర్జున్‌లతో కొరటాల శివ సినిమాలు చేస్తారనే గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. మరి సోషల్ మీడియాలో చెబుతున్నట్లుగా కొరటాల శివ- ప్రభాస్ మూవీ ఉంటుందా? ఇది గాలి వార్తేనా? అన్నది తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.

More from Filmibeat

Read more about: koratala siva prabhas
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X