»   »  ‘కృష్ణగాడి వీరప్రేమగాథ’ ఇన్ సైడ్ టాక్

‘కృష్ణగాడి వీరప్రేమగాథ’ ఇన్ సైడ్ టాక్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ‘అందాల రాక్షసి' చిత్రంతో పరిచయమైన దర్శకుడు హను రాఘవపూడి. ఆయన ఆ చిత్రం తర్వాత గ్యాప్ తీసుకుని ఇప్పుడు ‘కృష్ణగాడి వీరప్రేమగాథ' అంటూ ఓ ప్రేమకథని ఆవిష్కరించబోతున్నాడు. ఈ శుక్రవారం ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

అందుతున్న సమాచారం ప్రకారం ... 2 గంటల ఇరవై రెండు నిముషాలు ఉండే ఈ చిత్రం ఫస్టాఫ్ హిలేరియస్ కామెడీతో నడుస్తుంది. నాని తనదైన మార్క్ హాస్యంతో నవిస్తారు. సెకండాఫ్ కు వచ్చేసరికి ఆ ఫన్ జోష్ ని కంటిన్యూ చేయలేదు కానీ యాక్షన్ ఎపిసోడ్స్ తో అదరకొట్టాడంటున్నారు.


ముఖ్యంగా సెకండాఫ్ లో ఛేజింగ్ సీక్వెన్స్ లు ఎక్కువగా ఉన్నాయని అవి కొంత బోర్ అనిపించినా, క్లైమాక్స్ 15 నిముషాలు మాత్రం సినిమాలో హైలెట్ గా నిలుస్తుందని చెప్తున్నారు. ఇందులో ఎంతవరకూ నిజం ఉందనేది మరికొద్ది సేపట్లో తేలనుంది.


దర్శకుడు మాట్లాడుతూ....పూర్తి వినోదాత్మక చిత్రం. పిల్లలు, ప్రేమ, ఓ ప్రయాణం.. చాలా సరదాగా ఉంటుంది. ఇరవై ఏళ్లుగా ఇలాంటి కథతో సినిమా ఎవరూ తీయలేదేమో అనిపిస్తోంది. నాని, మెహరీన్‌ నా పాత్రలకు ప్రాణం పోశారు. 14 రీల్స్‌ సంస్థ అండగా నిలవడంతోనే సినిమా ఇంత బాగా వచ్చింది అని అన్నారు.


Krishna Gaadi Veera Prema Gadha inside Talk!!!

హిందూపురం నియోజకవర్గం నేపథ్యంలో సాగే కథ ఇది. అక్కడ పదిమందిలో తొమ్మిదిమంది బాలకృష్ణ అభిమానులే. అలా.. కృష్ణగాడూ ఆయనకి అభిమాని అయిపోయాడన్నమాట. ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ' కథకీ, బాలయ్యకీ, నా చేతిపై వేసుకొన్న ‘జై బాలయ్య' అనే టాటూకీ ఓ సంబంధం ఉంటుంది. అదేంటన్నది తెరపై చూడాలి.


నాని క్యారక్టర్ గురించి చెప్తూ...ఫైటింగంటే పారిపోతాడు. కత్తి చూస్తే వణికిపోతాడు. పైకి మాత్రం చాలా గంభీరంగా ఉంటాడు. అలాంటి కృష్ణగాడు మహాలక్ష్మి అనే అందమైన అమ్మాయిని ప్రేమిస్తే ఎలా ఉంటుందన్నదే ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ' అని వివరించారు.

English summary
‘Krishna Gaadi Veera Prema Gadha’ first half is good with hilarious comedy, as usual Nani’s comedy timing will make the audiences laughter in theatres.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu