అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం నాపేరు సూర్య. ఈ చిత్రంలో బన్నీ ఆర్మీ అధికారిగా నటిస్తున్నాడు. రచయిత వక్కంతం వంశి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అల్లు అర్జున్ ఆర్మీ అధికారిగా వేషధారణ, సరికొత్త లుక్ అభిమానులని తెగ ఆకట్టుకుంటోంది. ఈ చిత్రం మే 4 న విడుదలకు సిద్ధం అవుతుండడం విశేషం. భారీ యాక్షన్ చిత్రంగా న పేరు సూర్య రూపొందుతోంది.
తన చిత్రాల విషయంలో ఎప్పుడూ దూకుడు ప్రదర్శించే బన్నీ ఈ సారి మాత్రం సైలెంట్ గా ఉండిపోయాడు. నా పేరు సూర్య చిత్రం తరువాత బన్నీ నటించబోయే చిత్రం గురించి ఇంత వరకు క్లారిటీ రాలేదు. తాజగా ఆదిశగా కదలిక పార్రంభం అయినట్లు తెలుస్తోంది. ఓ యువ దర్శకుడితో బన్నీ నెక్స్ట్ మూవీ చేసే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వస్తున్నాయి.
క్షణం వంటి సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రంతో హిట్ అందుకున్న దర్శకుడు రవికాంత్.. బన్నీతో సినిమా చేయడానికి ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ఈ దర్శకుడు బన్నీతో సంప్రదింపులు ప్రారంభించాడట. కథా చర్చలు పూర్తయితే ఈ కాంబినేషన్ ఖరారవుతుందని వార్తలు వస్తున్నాయి.
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి | Subscribe to Telugu Filmibeat.