రాజమౌళిని రిజెక్ట్ చేసి తండ్రికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పవన్ కళ్యాణ్.. టాలీవుడ్ చరిత్రలోనే బిగ్గెస్ట్ కాంబో!
టాలీవుడ్ ఇండస్ట్రీలో కాంబినేషన్స్ అనేవి ఒక్కసారిగా అంచనాలను మార్చేస్తాయి. అలాంటి సినిమాలు సెట్స్ పైకి రాగానే ఈజీగా బిజినెస్ వాల్యూ కూడా పెరుగుతుంది. ఇక చూస్తుంటే రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ ద్వారా కూడా బిగ్గెస్ట్ కాంబినేషన్స్ సెట్టయ్యేలా ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో రాజమౌళిని రిజెక్ట్ చేసిన పవర్ స్టార్ ఈసారి ఆయన తండ్రికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా టాక్ వస్తోంది.

వకీల్ సాబ్ తో క్లారిటీ ఇచ్చేశాడు
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా కాలం తరువాత వరుస సినిమాలను లైన్ లో పెడుతున్న విషయం తెలిసిందే. అసలు పాలిటిక్స్ లోకి వెళ్లిన అనంతరం సినిమాలు చేస్తాడా లేదా అనే కన్ఫ్యూజన్ లో ఉన్న జనాలకు మొత్తానికి వకీల్ సాబ్ తో క్లారిటీ ఇచ్చేశాడు. పవర్ స్టార్ కెరీర్ లోనే మొదటిసారి వరుసగా నాలుగు సినిమాలను లైన్ లో పెట్టడు.

జనాలు ఎగబడి చూస్తారని
ఇక బాహుబలి రచయిత కె.విజయేంద్రప్రసాద్ చెప్పిన ఒక కథకు పవర్ స్టార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. పవన్ డైరెక్షన్ కంటే కూడా రైటింగ్ స్టైల్ చాలా ఇష్టమని చెప్పిన ఆయన పవన్ కోసం కథ రాయడానికి ఎప్పుడైనా సిద్ధమేనని వివరణ ఇచ్చారు. అలాగే ఆయన కోసం కొన్ని కమర్షియల్ సీన్స్ తో మంచి సందేశం ఉన్న సినిమా తీస్తే జనాలు ఎగబడి చూస్తారని కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.

రాజమౌళిని రిజెక్ట్ చేసిన పవన్
అయితే గతంలో పవన్ కళ్యాణ్ - రాజమౌళి కాంబినేషన్ లో ఒక సినిమా రావాల్సింది. విక్రమార్కుడు కథ చెప్పినప్పుడు పవన్ పాజిటివ్ గానే స్పందించినప్పటికి ఒప్పుకోలేదు. ఎందుకంటే వరుసగా సినిమాలు చేయడం వలన కొంచెం బ్రేక్ తీసుకోవాలనే ఆలోచనతో రిజెక్ట్ చేసాడు. అనంతరం రాజమౌళి మళ్ళీ పవన్ ను కలవలేదు.

డైరెక్టర్ ఎవరు?
కానీ రాజమౌళి తండ్రి కె.విజయేంద్రప్రసాద్ పవన్ కోసం కథను రాయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాడు. ఇక ఇన్నాళ్లకు సరైన కథ రాసిన ఆయన మెయిన్ లైన్ గురించి చెప్పి ఒప్పించారట. అయితే ఆ కథను ఎవరు తెరకెక్కిస్తారు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పవన్ తో సినిమా చేయడానికి స్టార్ దర్శకులు ఎవరైనా సరే సిద్ధంగా ఉంటారు. మరి పవన్ తో ఎలాంటి కాంబో సెట్టవుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











