»   » "సర్దార్" తో హర్ట్ అయ్యింది...అందుకే ఈ ట్వీట్స్

"సర్దార్" తో హర్ట్ అయ్యింది...అందుకే ఈ ట్వీట్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పెట్టుకున్న అంచనాలు ఒక్కసారిగా కొట్టుకుపోతే ఎవరికైనా నిరాశే కదా. ఇప్పుడు లక్ష్మీ రాయ్ ది అదే పరిస్దితి. ఈ వారం రిలీజైన పవన్ తాజా చిత్రం సర్దార్ గబ్బర్ సింగ్ పై హాట్ బ్యూటీ రాయ్ లక్ష్మీ అందరి కన్నా కాస్త ఎక్కువ ఎక్సపెక్టేషన్సే పెట్టుకుందని మొదటి నుంచి ఆమె ఈ సినిమాపై చూపిస్తున్న ఇంట్రెస్ట్ , మీడియాతో ఇంట్రాక్షన్, ట్వీట్స్ చెప్పకనే చెప్తూనే వస్తున్నాయి. అయితే ఇవి పూర్తిగా నీరుగారిపోయాయి.

Lakshmi Rai hurt with "Sardaar" result?

ఈ విషయమై ఆమె చాలా దిగులుగా ఉందని చెప్తున్నారు. ఎంతో ఎక్సపెక్ట్ చేసిన ఈ సినిమా భాక్సాఫీస్ వద్ద దెబ్బ తినటంతో ఆమె హర్ట్ అయ్యిందని చెప్తున్నారు. అయితే కొంతలో కొంత ఆమె పాటకు ధియేటర్ లో వస్తున్న పాజిటివ్ రెస్పాన్స్ అని చెప్తున్నారు. అయితే నిరాశగా ఉన్నట్లు ఆమె రీసెంట్ గా చేసిన ట్వీట్ స్పష్టం చేస్తోందని మీడియా అంటోంది.అసలు ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత తెలుగులో పూర్తి బిజీ అవుతానని ఆమె భావించిందట. అంతేకాదు తన సన్నిహితులతో పదే పదే సర్దార్ విషయమై డిస్కస్ చేసేదట. పెద్ద హీరోలందరి సినిమాల్లో తనకు వేషాలు వస్తాయని ఆమె నమ్మిందట. అందుకే ఆమె తన రెమ్యునేషన్ ని కూడా తగ్గించుకుని ఈ సినిమాకు పనిచేసిందని చెప్తున్నారు.సినిమా రిలీజ్ కు ముందు... ఈ సినిమాకు సంభందించి..ఎప్పటికప్పుడు...సరి కొత్త పిక్స్ ని రిలీజ్ చేసి మరి కొన్ని విశేషాలను అభిమానులతో పంచుకుంది. ఐటమ్ సాంగ్ షూట్ చేసే సమయంలో కొన్ని సెల్ఫీలు..కొన్ని స్టిల్స్ విడుదల చేసి హల్ చల్ సృష్టించింది.అంతే కాదు సర్దార్ షూటింగ్ లో తాను చాలా బాగా ఎంజాయ్ చేశానని..టీమ్ సభ్యులు మంచి జోష్ మీదే ఉండేవారిన చాలా ఫన్నీగా సాగిపోయిందని చెప్పింది...ఇక పవన్ కళ్యాన్ 'నైసెస్ట్ పర్సన్' అని కితాబిచ్చింది. ఇప్పుడు ఇవన్నీ ఏమైపోయాయి.


English summary
And a recent tweet made by Lakshmi Rai, proves that she's hurt, but still she is ready to accept the verdict of sardaar gabbar singh.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu