»   » నోట్ల రద్దు వ్యవహారమే..రిలీజ్ కు ముందు వివాదానికి దారి, అసలేం జరిగింది?

నోట్ల రద్దు వ్యవహారమే..రిలీజ్ కు ముందు వివాదానికి దారి, అసలేం జరిగింది?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సాధారణంగా సినిమా రిలీజ్ ముందు చాలా నిర్మాత పరిస్దితులు టెన్షన్ గా ఉంటాయి. అప్పటిదాకా పెట్టిన పెట్టుబడిని వెనక్కి అడ్వాన్స్ లు రూపంలో తెచ్చుకోవాల్సిన సమయం. అలాగే నిర్మాత ఏమన్నా బకాయిలు ఉంటే ఆ ఫైనాన్సియర్స్ వచ్చి క్లియర్ చేయమని కూర్చుంటారు. సాధారణంగా చిన్న సినిమాలు చాలా వాటికి లాస్ట్ మినిట్ లో డబ్బు క్లియర్ చేయక రిలీజ్ కు ఆగిపోతూంటాయి. కానీ నిఖిల్ హీరోగా రూపొందిన 'ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా' ది ఓ విభిన్నమైన పరిస్దితి.

'ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా' చిత్రం ఈ రోజు విడుదల అవుతోంది. అయితే రిలీజ్ కు లాస్ట్ మినిట్ లో నిర్మాత కార్యాలయంలో పెద్ద వివాదం జరిగినట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. అయితే ఆ గొడవ...సినిమా వేరే విషయాల గురించి కాదు...ఇప్పటికే రద్దైన నోట్ల తో సినిమా తీసుకోటానికి వచ్చిన బయ్యర్లుతో.


Last Minute tensions for Nikhil’s Ekkadaki Pothaavu Chinnavada

సినిమా రిలీజ్ కు ముందు సాధారణంగా బయ్యర్లు డబ్బుని ఎడ్జెస్ట్ చేస్తూంటారు. ఈ సినిమాకు అలాగే బయ్యర్లు వచ్చి డబ్బు పట్టుకొచ్చారు. అయితే.. ట్విస్ట్ ఇక్క‌డే పడింది. అందుకు కారణం 'పెద్ద నోట్ల ర‌ద్దు' . 'ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా' సినిమా కొన్న బ‌య్య‌ర్లు ఇప్పుడు తమ దగ్గర ఉన్న 'పాత‌' ఐదు వందలు, వెయ్యి రూపాయల నోట్లు తీసుకొచ్చి లెక్క స‌ర్ద‌డానికి చూసారట‌.


అది చూసిన నిర్మాత నాకు ఆ పాత నోట్లు వద్దు. కొత్తవే కావాలి అని అడిగారట. దాంతో అటు బ‌య్య‌ర్ల‌కూ, ఇటు ప్రొడ్యూస‌ర్‌కీ పెద్ద వివాదం మొదలైందిట. బయ్యర్లు ..మేం ఈ టైమ్ లో లక్షల్లో కొత్త (వైటే) నోట్లు తెమ్మంటే ఎక్కడ తెస్తాం, బ్యాంక్ ల్లో రోజు కు ఎంత ఇస్తున్నారో మీకు తెలియదా... అని నిలదీస్తున్నారట. వారు చెప్పిన దాంట్లో నిజం ఉండటంతో నిర్మాత ఏం చేయాలా అని తల పట్టుకున్నారట. మరి చివరకు ఏం నిర్ణయానికి వచ్చారో తెలియాల్సి ఉంది.నిఖిల్ హీరోగా, హెబ్బా పటేల్, నందిత శ్వేత హీరోయిన్స్ గా ఐవీ ఆనంద్ దర్శకత్వంలో మేఘన ఆర్ట్స్ పతాకంపై రూపొందిన చిత్రం 'ఎక్కడికి పోతావు చిన్నవాడా'. శేఖర్‌చంద్ర సంగీతం అందించిన ఈ చిత్రం టీజర్ ఇప్పటికే విడుదలై మంచి క్రేజ్ తెచ్చుకుంది. రేపు సినిమా విడుదల అవుతున్న నేపధ్యంలో సినిమాపై మంచి ఎక్సపెక్టేషన్స్ పెరిగే స్దాయిలో ట్రైలర్ కట్ చేసి వదిలారు. మరి ఈ ట్రైలర్ ఓపినింగ్స్ ఏ మేరకు తెస్తుందో చూడాలి. ఆ ట్రైలర్ ని మీరు ఇక్కడ చూడవచ్చు.

English summary
Nikhil's latest film Ekkadaki Pothaavu Chinnavada is gearing up for release today and is said to be a thriller. Most of the buyers came up with the old Rs 500 and Rs 1000 notes which left the producer in shock.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu