»   » 'లెజెండ్‌': వంద రోజుల వేడక ఎక్కడో తెలుసా

'లెజెండ్‌': వంద రోజుల వేడక ఎక్కడో తెలుసా

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: "గన్ తో బెదిరిస్తే ,బెదిరిపోవడానికి వోటర్ ని కాదు బే, షూటర్ ని " వంటి డైలాగులతో భాక్సాఫీస్ వద్ద హంగామా చేసి వంద రోజులకు దగ్గరపడుతున్న చిత్రం లెజండ్. నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీనుల కాంబినేషన్ లో రూపొందిన చిత్రం "లెజెండ్'' వంద రోజుల వేడుకలు ఘనంగా చేయాలని నిర్మాతలు 14 రీల్స్ వారు ప్లాన్ చేస్తున్నారు. జూలై 3న హిందూపూర్ లో ఈ వేడుకలు జరపనున్నట్లు సమాచారం. అక్కడ బాలకృష్ణ ఎమ్.ఎల్.ఎ విజయం సాధించటంతో అక్కడ ఆయన ఈ చిత్రం వేడుకలు జరుపుకోనున్నారని తెలుస్తోంది. తన నియోజక వర్గ ప్రజల సాక్షిగా ఈ వేడుకలు జరుపుకుని అక్కడ వారిలో ఆనందం పంచాలని బాలయ్య భావిస్తున్నారు.

నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీనుల కాంబినేషన్ లో రూపొందిన "లెజెండ్'' చిత్రం మాస్ తో పాటు క్లాస్ ఫ్యామిలీ అడియెన్స్ ను కూడా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి యాభై కోట్లు వచ్చాయని, ఈరేర్ ఫీట్ తాజా చిత్రం "లెజెండ్'' ద్వారా సాధించారని స్వయంగా ఆ చిత్ర నిర్మాతలు ఒక ప్రకటనలో తెలిపారు.

Legend 100 days function at Hindupur

ఆ ప్రకటనలో ... బాలకృష్ణ హీరోగా రూపొందిన లెజెంబ్ సినిమా మార్చి 28 న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై యావత్ సినీ అభిమానుల్ని ఆకట్టుకుని ఘన విజయం సాధించింది. తొలి వారంలోనే 33 కోట్ల రూపాయలు కలెక్షన్లు సాధించి రికార్డ్ ను సృష్టించింది. ఈ సినిమా 50 కోట్ల కలెక్షన్స్ రాబట్టడం ఖాయం అన్న సినిమా విశ్లేషకుల అంచానాలను నిజం చేస్తూ 50 కోట్ల పై చిలుకు వసూళ్ళు సాధించిన లెజెండ్ చిత్రం 2014వ సంవత్సరంలో తెలుగు చిత్ర పరిశ్రమకు ఊపిరి పోసింది.

నందమూరి బాలకృష్ణ అభినయం, ఆయన పలికిన సంభాషణల తీరు,భోయపాటి శ్రీను దర్శకత్వ ప్రతిభ, వారాహి చలన చిత్రం మరియు 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ప్ నిర్మాణ విలువలు, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఈ చిత్రం సాధిస్తున్న సంగీతం ఈ చిత్రం సాధిస్తున్న సంచలన విజయంలో కీలక పాత్ర పోషించాయి. ముఖ్యంగా బోయపాటి శ్రీను తన 5వ చిత్రంతోనే 50 కోట్ల క్లబ్ లో స్థానం సంపాదించుకోవడం విశేషం. త్వరలోనే లెజెండ్ చిత్రం తెలుగు చిత్ర పరిశ్రమలో నెలకొని ఉన్న రికార్డులను తిరగరాస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. లెజెండ్ విజయానందంలో ఉన్న నందమూరి అభిమానులకు బాలకృష్ణ రాజకీయ రంగ ప్రవేశం నూతనోత్సహాన్నిచ్చింది అన్నారు.

English summary
Balakrishna has shifted his ‘Legend’ 100 days celebrations from Hyderabad to his own constituency Hindupur.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu