»   » పట్టు వదలని విక్రమార్కుడులా మహేష్ చుట్టూ...

పట్టు వదలని విక్రమార్కుడులా మహేష్ చుట్టూ...

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్: మహేష్ కి ప్రముఖ దర్శకుడు లింగు స్వామి మరోసారి కథ వినిపించారని సమాచారం. గతంలో నాలుగైదు కథలు వినిపించినా మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. అయినా పట్టు వదలని విక్రమార్కుడులా మహేష్ చుట్టూనే తిరుగుతున్నాడు. ఈ సారి ఆయన చెప్పిన కథ ఇంప్రిసెవ్ గా ఉందని మహేష్ చెప్పాడని సమాచారం. వాస్తవానికి లింగులు స్వామి ఇటీవల తమిళంలో రూపొందించిన హిట్ మూవీ 'వెట్టై' చిత్రాన్ని మహేష్ బాబు హీరోగా తెలుగులో రీమేక్ చేయాలని భావించాడట. అయితే మహేష్ బాబు పెద్దగా ఆసక్తి చూపక పోవడంతో అది ఆచరణకు నోచుకోలేదు.

రన్, పందెం కోడి, ఆవారా చిత్రాల ద్వారా తెలుగు పరిచయమైన లింగు స్వామి...మహేష్ కాంబినేషన్ దాదాపు ఓకే అయినట్లు చెప్తున్నారు. అయితే మహేష్ ప్రస్తుతం ఒప్పుకున్న ప్రాజెక్టుల అనంతరమే ఈ సినిమా ఉండే అవకాసం ఉందని తెలుస్తోంది..ఆయన రీసెంట్ గా మహేష్ ని కలిసి ఓ కథని నేరేట్ చేసారు. కథ విన్న వెంటనే మహేష్..సినిమా చేయటానికి పచ్చ జెండా ఊపారు.


ఇక లింగు స్వామికి మొదటి నుంచి కూడా మహేష్ అంటే అభిమానం. గతంలో లింగు స్వామి మాట్లాడుతూ...దాదాపు ఏడు సంవత్సరాలనుంచి మహేష్‌తో చిత్రం చేయాలనుకుంటున్నానని అది ఇప్పటికి నెరవేరుతోందని తెలిపారు. త్వరలో వీరి ప్రాజెక్టుపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

ప్రస్తుతం మహేష్‌బాబు హీరోగా రూపొందుతున్న చిత్రం '1'. నేనొక్కడినే అనేది ట్యాగ్ లైన్. కృతి సనన్‌ హీరోయిన్. సుకుమార్‌ దర్శకుడు. 14రీల్స్‌ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనిల్‌ సుంకర నిర్మాతలు. ప్రస్తుతం బ్యాంకాక్‌లోని క్రాబీలో ఈ సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు దర్శకుడు సుకుమార్. ఈ చిత్రంలో మహేష్ పాత్ర ఎవరూ ఊహించలేని విధంగాగా, చాలా డిఫెరెంట్ గా ఉంటుందని తెలుస్తోంది.

మరో ప్రక్క 'దూకుడు' సినిమాతో ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచిన హీరో మహేష్ బాబు, దర్శకుడు శ్రీను వైట్ల మరోసారి జతకట్టబోతున్న సంగతి తెలిసిందే. వీరి కాంబినేషన్లో రూపొందనున్న మరో చిత్రం 'ఆగడు' ప్రారంభానికి అక్టోబర్ 16న ముహూర్తం పెట్టినట్లు తెలుస్తోంది. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే ఈచిత్రాన్ని సింగిల్ షెడ్యూల్‌లో పూర్తి చేయడానికి దర్శకుడు శ్రీను వైట్ల ప్లాన్ చేసాడట. అంటే షూటింగ్ ఒక్కసారి మొదలైతే పూర్తయ్యే వరకు గ్యాప్ లేకుండా కొనసాగుతూనే ఉంటుందన్నమాట. ఈ చిత్రంలో హీరోయిన్ త్వరలో ఫైనల్ కానుంది.

English summary

 Tamil director Lingusamy expressed his strong desire to collaborate with the Tollywood heartthrob. Apparently the director had initially approached Mahesh Babu with a proposal to remake his Tamil flick, Vettai in Telugu. But the project did not materialize, however Lingusamy is hopeful that something will work out. "Well, I am huge fan Mahesh Babu, he is a powerhouse of a performer. It is my dream to work with him one day. I have met him quite a few times, would love to do a Telugu movie with him," he said.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu