»   » ఇంగ్లీష్ ముద్దులతో గాడితప్పుతోన్న మెగాహీరోల సినిమాలు..!?

ఇంగ్లీష్ ముద్దులతో గాడితప్పుతోన్న మెగాహీరోల సినిమాలు..!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఇంగ్లీష్ ముద్దు..లిప్ లాక్..ఎలా పిలిస్తే అలా ఓకే కానీ కవులు మాత్రం మధురంగా వర్ణించే అధరచుంబనం మెగా హీరోలకి మాత్రం కలిసి రావట్లేదు. తెలుగు సినిమా ప్రేక్షకులు ఇంకా అలవాటు పడని ఈ లిప్ లాక్ కల్చర్ ని సీరియస్ గా ఫాలో అవుతున్న వారిలో అల్లు అర్జున్ ముందుంటాడు. ఆర్య2, వరుడు, వేదంలో అతను లిప్ కిస్ లు లాగించేశాడు. అలాగే ఇన్నాళ్లూ రాముడు మంచి బాలుడు అన్నట్టుండే పవన్ కూడా బలవంతంగా తీన్ మార్ లో లిప్ లాక్ సీన్ చేశాడు. ఈ నాలుగు సినిమాలు అంచనాలని అందుకోలేక బోల్తా కొట్టాయి. కారణం ముద్దేనని అనలేం కానీ సెంటిమెంట్ ని బట్టి ఇంగ్లీష్ ముద్దు మెగా హీరోలకి కలిసి రానట్టుంది. అందుకే ఇక మీదట ఎంత అవసరమైనా కానీ వాటికి వారు దూరంగా ఉంటే మంచిది. రొమాంటిక్ హీరో అనిపించుకోవాలని చూస్తున్న అల్లు అర్జున్ కెరీర్ గాడి తప్పింది. సరిగ్గా ఈ వేషాలు మొదలు పెట్టాకే కాబట్టి ఇకనైనా అతను తన పెదాల్ని కెమెరా ముందు మాత్రం కట్టి పెట్టి తీరాలి.

English summary
Yes, Lip-Lock Scenes are not working out for Mega Family Heroes. Telugu Film Audiences are not habituated to Lip-Lock culture and they are rejecting those scenes. Allu Arjun is strictly following Lip-Lock scenes in all his recent films like 'Arya 2', 'Varudu' and 'Vedam'. Even Pawan Kalyan, who looked decent till now has acted in lip-lock for first time in 'Teen Maar'.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu