హీరోగా లోకేష్ కనగరాజ్ తొలి చిత్రం.. హీరోయిన్ ఎవరో తెలుసా?

దక్షిణాదిన సెన్సేషనల్ డైరెక్టర్ గా గుర్తింపు పొందారు దర్శకుడు లోకేష్ కనగరాజ్. ఆయన దర్శక ప్రతిభతో ఇండియాలో ప్రముఖ దర్శకుడిగా క్రేజ్ దక్కించుకున్నారు. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఉత్తమ దర్శకుల్లో ఒకరిగా నిలిచారు. ఈ సందర్భంగా లోకేష్ కనగరాజ్ చిత్రాల గురించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందుతూనే ఉంటాయి. ఈక్రమంలో తాజాగా లోకేష్ కగనరాజ్ గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి ఫిల్మ్ సర్కిల్స్ లో వైరల్ గా మారింది. లోకేష్ కనగరాజ్ ఇప్పటి వరకు డైరెక్టర్ గా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఇక లోకేష్ కనగరాజ్ హీరోగా తొలి చిత్రం రాబోతుందని ప్రచారం జరుగుతోంది.

ప్రస్తుతం డైరెక్టర్ గా లోకేష్ కనగరాజ్ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ లను లైనప్ లో పెట్టి ఉంచారు. ఈ సందర్భంగా అగ్ర హీరోలతో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. రీసెంట్ గానే సూపర్ స్టార్ రజనీకాంత్ తో గ్యాంగ్ స్టర్ యాక్షన్ ఫిల్మ్ కూలి గ్రాండ్ గా విడుదలలైన సంగతి తెలిసిందే. ఆగస్టు 14న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంలో అక్కినేని నాగార్జున తొలిసారిగా విలన్ పాత్రను పోషించారు. ఇక భారీ తారాగణం నటించిన ఈ చిత్రం కథ పరంగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. అయినా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లనే అందుకుంది.

Lokesh Kanagaraj First Debut Film as Hero

ఇక లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో మున్ముందు మరిన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇదిలా ఉంటే.. లోకేష్ కనగరాజ్ కేవలం దర్శకుడిగానే ఉండిపోవడం లేదు. ఇప్పటికే నిర్మాతగా కూడా G Squad అనే ప్రొడక్షన్ బ్యానర్ లో పలు చిత్రాలను నిర్మిస్తున్నారు. కోలీవుడ్ స్టార్ రాఘవా లారెన్స్ తో బెంజ్, మిస్టర్ భారత్ అనే మరో చిత్రాన్ని కూడా నిర్మిస్తున్నారు. ఇక మరోవైపు ఇప్పటికే స్టార్ హీరోయిన్ శృతి హాసన్ తో కలిసి ఇనిమెల్ అనే మ్యూజిక్ వీడియోలో కూడా నటించి ఆకట్టుకున్నారు. సపోర్టింగ్ రోల్స్ లో లోకేష్ కనగరాజ్ మాస్టర్, సింగపూర్ సెలూన్ వంటి చిత్రాల్లో నటించడం విశేషం.

అయితే, మొదటి సారిగా లోకేష్ కనగరాజ్ హీరోగా అలరించబోతున్నారని తెలుస్తుంది. కోలీవుడ్ ప్రముఖ దర్శకుడు అరుణ్ మతీశ్వరన్ దర్శకత్వంలో లోకేష్ కనగరాజ్ హీరోగా ఒక యాక్షన్ ఫిల్మ్ రాబోతుందని అంటున్నారు. దేవదాస్ అని చిత్రం టైటిల్ గా కోలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే అరుణ్ మతీశ్వరన్ కెప్టెన్ మిల్లర్, రాఖీ అనే చిత్రంలో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇక ఇప్పుడు వీరిద్దరి కలయిక ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ రాబోతుందనడం ఆసక్తికరంగా మారింది.

లోకేష్ కనగరాజ్ హీరోగా రాబోతున్న చిత్రంలో హీరోయిన్ గా తమిళ నటి రచితా రామ్ నటించబోతున్నారని తెలుస్తోంది. లోకేష్ కనగరాజ్ భార్యగా రచితా రామ్ నటిస్తుందని అంటున్నారు. ఈమె రీసెంట్ గా కూలి చిత్రంలో లేడీ విలన్ గా నటించి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. ఇక ఈ చిత్రంపై ఇంకా స్పష్టమైన అప్డేట్స్ రావాల్సి ఉంది. మరోవైపు లోకేష్ కనగరాజ్ ఖైదీ 2, విక్రమ్ 2 చిత్రాలను డైరెక్ట్ చేయాల్సి ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X