For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  'ఆగడు' నిర్మాతలు ఏ ఛాన్స్ వదలటం లేదుగా

  By Srikanya
  |

  హైదరాబాద్ : భాక్సాఫీస్ దగ్గర మహేష్‌బాబు 'దూకుడు' తెలిసిందే. 'పోకిరి', 'దూకుడు', 'సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు' ఇవన్నీ బాక్సాఫీసుకు కొత్త రికార్డుల రుచి చూపించాయి. ఓవర్సీస్‌లో మహేష్‌కి తిరుగులేదు. వరస విజయాలతో తిరుగులేని స్థానం సంపాదించుకొన్న మహేష్‌ 'ఆగడు' తో మరోసారి ప్రేక్షకుల్ని పలకరించబోతున్నాడు. దాంతో అక్కడ మన తెలుగు వారినే కాకుండా మిగతావారిని కూడా ఆకట్టుకునేందుకు ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ వస్తున్నాడు. ఈ మేరకు వర్క్ జరుగుతోందని తెలుస్తోంది. దాంతో ఖచ్చితంగా అక్కడ రెవిన్యూలు మరింతగా పెరుగుతాయని భావిస్తున్నారు.

  ఇక ఈ సినిమా సెట్స్‌పై ఉండగానే బిజినెస్‌ పూర్తయింది. శాటిలైట్‌ రూపంలో దాదాపు రూ.12 కోట్లు అందుకొన్నట్టు అంచనా. 'ఆగడు'పై అభిమానుల్లోనూ భారీ అంచనాలున్నాయి. ప్రచార చిత్రాలు మరిన్ని ఆశలు పెంచుతున్నాయి. శ్రీను వైట్ల బాక్సాఫీస్‌ ఫార్ములా సత్ఫలితాన్నిస్తే ఈ సినిమా మరో భారీ విజయాన్ని అందుకుంటుందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి.

  ఇక మహేశ్‌ జోడీగా తొలిసారి తమన్నా నటిస్తుండటం, శ్రుతిహాసన్‌ ఓ పాటలో మహేశ్‌తో స్టెప్పులేయడం అదనపు ఆకర్షణలు. ‘1.. నేనొక్కడినే' సినిమాతో నటునిగా అందరి ప్రశంసలు పొందినా, వాణిజ్యపరంగా చేదు అనుభవాన్ని చూసిన మహేశ్‌ ఈ సినిమాతో తన బాక్సాఫీస్‌ స్టామినాని నిరూపించుకోవాలనే పట్టుదలతో ఉన్నాడు.

  Mahesh babu Aagadu Movie with English Subtitles

  మహేష్‌బాబు మాట్లాడుతూ... ''నా సినీ ప్రయాణాన్ని మలుపు తిప్పిన చిత్రం 'దూకుడు'. ఆ సెట్‌లో ఉన్నప్పుడే 'ఆగడు' పేరుతో మరొక సినిమా చేయాలనుకొన్నాం. ఇందులో నేను కనిపించే విధానం, సంభాషణలు చెప్పే తీరు కొత్తగా ఉంటాయి. నటుడిగా నాకు మరో కీలకమైన మలుపు అవుతుంది'' అన్నారు

  ''మహేష్‌ని 'దూకుడు'లో పదిశాతం మాత్రమే చూశారు. ఇందులో వందశాతం చూస్తారు. అభిమానులు కూడా ఆశ్చర్యపోయేలా ఆయన తెరపై కనిపించబోతున్నాడు'' అన్నారు శ్రీనువైట్ల. మహేశ్‌ చెప్పిన ‘డిక్కీ బలిసిన కోడి చికెన్‌ షాప్‌ ముందుకొచ్చి తొడకొట్టిందంట', ‘అయినా నువ్వు డైలాగ్‌ వేస్తే కౌంటర్‌ వెయ్యడానికి నేను రైటర్‌ని కాదు ఫైటర్‌ని, అయ్యబాబోయ్‌ నాకు సినిమా డైలాగులు వొచ్చేస్తన్నాయేంటి' డైలాగులకు అభిమానుల నుంచి విపరీతమైన స్పందన వస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు.

  ఈ కొత్త టీజర్‌తో ‘ఆగడు' సినిమా ఎలా ఉండబోతోందో డైరెక్టర్‌ శ్రీను వైట్ల ఒక ‘ఫీలర్‌' వదిలారని వారంటున్నారు. ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్టుగా మహేశ్‌ నటిస్తున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌ 19 న విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. 'ఆగడు' సినిమా కోసం శ్రుతి హాసన్ ఓ ప్రత్యేక గీతంలో ఆడిపాడుతోంది. ''తమన్‌ అందించిన మాస్‌ మసాలా గీతమిది. ఇందులో మహేష్‌, శ్రుతిహాసన్‌ స్టెప్పులు ప్రేక్షకులకు కిక్‌ ఇస్తాయి'' అంటోంది చిత్రబృందం.

  డా.రాజేంద్రప్రసాద్, ప్రకాష్‌రాజ్, బ్రహ్మానందం, నెపోలియన్ ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి రచన: అనీల్ రావిపూడి, ఉపేంద్ర మాధవ్, రచనా సహకారం: ప్రవీణ్ వర్మ, సంగీతం: ఎస్.ఎస్.థమన్, సినిమాటోగ్రఫీ: కె.వి.గుహన్, ఆర్ట్: ఎఎస్ ప్రకాష్, ఎడిటింగ్: ఎం.ఆర్.వర్మ, కో-డైరెక్టర్: చలసాని రామారావు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: కోటి పరుచూరి, నిర్మాతలు: రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనీల్ సుంకర, కథ-స్ర్కీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: శ్రీను వైట్ల.

  English summary
  Mahesh babu's latest Aagadu Movie will release in US with English Subtitles.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X