twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Chiranjeevi బృందంలో మహేష్, అల్లు అర్జున్.. జగన్ తో భేటీ కోసం పెద్ద ప్లాన్..అందుకేనా?

    |

    ఇప్పుడు టాలీవుడ్ మొత్తం మీద ఏదైనా హాట్ టాపిక్ నడుస్తుంది అంటే అది టాలీవుడ్ డ్రగ్స్ కేసు అలాగే వైయస్ జగన్మోహన్ రెడ్డితో చిరంజీవి జరపబోయే సమావేశం. అయితే టాలీవుడ్ డ్రగ్స్ కేసు గురించి ఇప్పటికే పూరి జగన్నాథ్ రంగంలోకి దిగి ఈడీ విచారణకు హాజరు కాగా మరో కొద్ది రోజుల్లో చిరంజీవి ఒక బృందంతో కలిసి వెళ్లి వైయస్ జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ భేటీ కోసం ఒక పెద్ద ప్లానే సిద్ధం చేసినట్లు చెబుతున్నారు. ఆ వివరాల్లోకి వెళితే

    MP Balashowry Vallabhaneni son Engagement.. చిరంజీవితోపాటు సినీ, రాజకీయ ప్రముఖులు ఎవరు హాజరయ్యారంటే!MP Balashowry Vallabhaneni son Engagement.. చిరంజీవితోపాటు సినీ, రాజకీయ ప్రముఖులు ఎవరు హాజరయ్యారంటే!

    దూరం పెరిగి

    దూరం పెరిగి

    టాలీవుడ్ అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్య వకీల్ సాబ్ సినిమా విషయంలో కాస్త దూరం పెరిగిన సంగతి అందరికీ తెలిసిందే.. వకీల్ సాబ్ సినిమాను భారీ ఎత్తున రిలీజ్ చేసిన దిల్ రాజు సినిమా రేట్లను కూడా ఇష్టారీతిన చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయంలో రంగంలోకి దిగిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టికెట్ రేట్లను తగ్గిస్తూ ఒక జీవో జారీ చేసింది.

    సినిమా విడుదలై థియేటర్ల నుంచి వెళ్లి పోయాక కూడా మరో జీవో జారీ చేసి టికెట్ల విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గే అవకాశం లేదన్నట్లుగా క్లారిటీ ఇచ్చింది. కానీ ఇప్పుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి టాలీవుడ్ పెద్దలతో భేటీ కాబోతున్నారు. నిజానికి ఈ నెలాఖరులో సమావేశం ఉంటుందని అనుకున్నా వైయస్ జగన్మోహన్ రెడ్డి సిమ్లా పర్యటన నేపథ్యంలో అది కుదరలేదు.

    Sridevi Soda Center యూనిట్‌కు మహేష్ బాబు, నమ్రత అభినందనలు.. సుధీర్ బాబు కెరీర్ బెస్ట్ అంటూ!Sridevi Soda Center యూనిట్‌కు మహేష్ బాబు, నమ్రత అభినందనలు.. సుధీర్ బాబు కెరీర్ బెస్ట్ అంటూ!

    నాలుగో తారీఖు

    నాలుగో తారీఖు

    దీంతో సెప్టెంబర్ నెల మొదటి వారంలో వారికి సీఎం జగన్ అపాయింట్ మెంట్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. నాలుగో తేదీన తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ కి రావాల్సిందిగా టాలీవుడ్ బృందానికి పిలుపు అందినట్లు తెలుస్తోంది. నిజానికి ఇప్పటికే టాలీవుడ్‌ తో సమాన్వయం చేసుకునే బాధ్యతల్ని సమాచార మంత్రి పేర్ని నాని తీసుకున్నారు.

    ఆయన చిరంజీవికి ఫోన్ చేయడంతో చిరంజీవి కూడా టాలీవుడ్‌లోని వివిధ రకాల వ్యాపార వర్గాల ప్రముఖులతో ఓ సారి సమావేశం అయ్యారు. సీఎం జగన్‌తో ఏ ఏ అంశాలపై చర్చించాలన్న దానిపై క్లారిటీ తీసుకున్నారు. నిజానికి ఇతర చిన్నా చితకా సమస్యలు ఉన్నా సినీ పరిశ్రమకు మొత్తం మీద చూస్తే ఒకే ఒక్క పెద్ద సమస్య ఏదైనా ఉంది అంటే అది టికెట్ రేట్లు మాత్రమే. అది కూడా ఏపీ ప్రభుత్వం సృష్టించిన సమస్యే.

    Jacqueline Fernandez ED విచారణ పూర్తి, స్టేట్మెంట్ రికార్డు.. అసలు ఏమైందంటే?Jacqueline Fernandez ED విచారణ పూర్తి, స్టేట్మెంట్ రికార్డు.. అసలు ఏమైందంటే?

    టిక్కెట్ రేట్లను పూర్తిగా తగ్గిస్తూ

    టిక్కెట్ రేట్లను పూర్తిగా తగ్గిస్తూ

    వకీల్ సాబ్ సినిమా సమయంలో ప్రేక్షకుల్ని దోచుకుంటున్నారని ఆరోపణలతో ప్రభుత్వం టిక్కెట్ రేట్లను పూర్తిగా తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ రేట్లకు ధియేటర్లకు గిట్టుబాటు కాదు ఇటు నిర్మాతలకు ఉపయోగం ఉండదనేది బహిరంగ రహస్యం. అందుకే పెద్ద సినిమాలు సినిమాల విడుదల విషయంలో తర్జనభర్జనలు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

    ముఖ్యంగా ఇదే సమస్యను జగన్ పరిష్కరించాల్సిన పరిస్థితి. ఇది మాత్రమే కాకుండా జగన్ ప్రకటించిన ప్యాకేజీ కూడా ఇంతవరకు అందలేదు. దీనిపైనా చిరు బృందం చర్చించే అవకాశం ఉంది. ఎందుకంటే అక్టోబరులో కొన్ని పెద్ద సినిమాల విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. కనీసం దసరాకి మూడు నాలుగు పెద్ద సినిమాలు బరిలో ఉండేలా నిర్మాతలు ప్లాన్ చేసుకుంటున్నారు.. ఈ లోపు చర్చలు పూర్తి చేసి 100 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లను రెడీగా ఉంచాలనే యోచనలో సినీ పెద్దలు ఉన్నారు.

    RRR ఒలివియా మారిస్ హాట్ & క్యూట్ ఫొటోస్.. ఎన్టీఆర్ పాట్నర్ మామూలుగా లేదుగా..RRR ఒలివియా మారిస్ హాట్ & క్యూట్ ఫొటోస్.. ఎన్టీఆర్ పాట్నర్ మామూలుగా లేదుగా..

    మహేష్ బాబు, అల్లు అర్జున్ ఇద్దరితో

    మహేష్ బాబు, అల్లు అర్జున్ ఇద్దరితో

    సీఎం జగన్ సమస్యల పరిష్కారానికి చూపే స్పందనను బట్టి ఏపీలో పూర్తి స్థాయిలో థియేటర్లు ప్రారంభమయ్యే అవకాశం ఉందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అయితే ముందు నుంచి కూడా చిరంజీవి ఎక్కువగా నాగార్జున, సురేష్ బాబు, దామోదర్ ప్రసాద్ లాంటి పెద్దలతో భేటీలు నిర్వహిస్తూ వస్తున్నారు.. ఈ విషయంలో చిరంజీవి విమర్శల పాలు కావాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.

    ఇండస్ట్రీ అంటే మీరే నా మరెవరినీ పట్టించుకోరు అనే విమర్శలు వినిపిస్తున్న నేపథ్యంలో మధ్యేమార్గంగా మహేష్ బాబు, అల్లు అర్జున్ ఇద్దరిని కూడా ఈ భేటీకి తీసుకువెళ్ళే ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఇలాంటి విమర్శలు నుంచి కాస్త ఉపశమనం పొందడమే కాక వారిని కూడా తీసుకు వెళితే ప్రభుత్వం ఎలాంటి ఉద్దేశంతో ఉంది అనే విషయాన్ని వాళ్లకు అర్థమయ్యేటట్లు చెప్పినట్టు అవుతుందని అంటున్నారు.

    Recommended Video

    Vijay Sethupathi తెలుగు బ్రాండ్ వాల్యూ పీక్స్.. | NBK పక్కన విలన్ గా నిజమే!! || Filmibeat Telugu
    అందుకోసమే

    అందుకోసమే

    తద్వారా తాము టాలీవుడ్ ఉన్నతి కోసమే కష్టపడుతున్నా అనే సంకేతాలను పంపినట్లు అవుతుందనే భావనలో ఉన్నారని అంటున్నారు. అయితే ప్రస్తుతానికి ఇది ప్రచారమే కాగా ఇందులో నిజాలు ఏ మేరకు ఉన్నాయి అనేది తెలియాల్సి ఉంది. నిజానికి అక్టోబరు నెలలో చిరంజీవి ఆచార్య, బాలకృష్ణ అఖండతో పాటు పలు చిన్న సినిమాలు రిలీజ్ కి దగ్గరలో ఉన్నాయి.

    అక్టోబర్ నెలలో కనుక సినిమాల రిజల్ట్ బాగుంటే అప్పుడు మిగతా సినిమాలు కూడా నవంబర్, డిసెంబర్ నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చే ప్రయత్నం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే అందుకు ప్రభుత్వం 100% ఆక్యుపెన్సీ తో పాటు టికెట్ రేట్లు పెంచే దానిని బట్టి ఈ సినిమాల రిలీజ్ విషయంలో ఆధారపడి ఉంటుంది. అందుకే సినీ పరిశ్రమ ఈ భేటీ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తోంది.

    English summary
    MaheshBabu and AlluArjun to meet CM Jagan along with Chiranjeevi on September 4th to discuss about ticket rates issue.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X