»   » ఫ్యాన్స్ కు పండుగే : యంగ్ ముఖ్యమంత్రి గా అదరకొట్టనున్న మహేష్..?

ఫ్యాన్స్ కు పండుగే : యంగ్ ముఖ్యమంత్రి గా అదరకొట్టనున్న మహేష్..?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : గతంలో ప్రముఖ తమిళ దర్సకుడు శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఒకే ఒక్కడు చిత్రంలో యాక్షన్ కింగ్ అర్జున్..ముఖ్యమంత్రిగా కనిపించి అలరించారు. తర్వాత స్టార్ హీరోలెవరూ అలాంటి పాత్రలో కనిపించటానికి ఉత్సాహం చూపించలేదు. కానీ తాజాగా యంగ్ ముఖ్యమంత్రి పాత్రలో మహేష్ కనిపించటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది.

పూర్తి వివరాల్లోకి వెళితే...ప్రస్తుతం మురగదాస్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా తరువాత తనకు శ్రీమంతుడు లాంటి భారీ హిట్ అందించిన కొరటాల శివ దర్శకత్వంలో మరో సినిమాకు ఓకె చెప్పిన సంగతి తెలిసిందే. రీసెంట్ గా జనతాగ్యారేజ్ వంటి భారీ బ్లాక్ బస్టర్ ఇచ్చిన కొరటాల...మరోసారి కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్ కాకుండా సోషల్ మెసేజ్ తో కథను రెడీ చేసారట. అయితే ఈ సారి , మహేష్ కోసం ఓ పొలిటికల్ థ్రిల్లర్ ను సిద్దం చేసి వినిపించాడట. ఈ సినిమాలో మహేష్ బాబు ముఖ్యమంత్రి కనిపించనున్నాడన్న సమాచారం.

Mahesh Babu as CM in Koratala's next ?

గతంలో దూకుడు సినిమాలో కొద్ది సేపు ఎమ్మెల్యేగా అలరించిన మహేష్ నెక్ట్స్ సినిమాలో సియంగా కనిపిస్తాడన్న వార్తతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. అయితే ఈ విషయంపై మహేష్ నుంచి గాని, దర్శకుడు కొరటాల శివ నుంచి గాని ఎలాంటి అధికారిక ప్రకటనా రాలేదు కానీ ఫిల్మ్ సర్కిల్స్ లో వెబ్ మీడియాలో ఎక్కడ చూసినా ఇదే వార్త కనిపిస్తోంది.

ప్రస్తుతం తమిళ స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్ సినిమాలో నటిస్తున్నాడు మహేష్. దాదాపు 90 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమాను 2017 సమ్మర్ లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.

English summary
Earlier in Dookudu Superstar Mahesh Babu was seen as an MLA and Now Block Buster director Koratala Siva is turning Mahesh Babu as CM Chief Minister.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu