»   » 1000 కోట్ల మహాభారతంలో...... మన మహేష్ బాబు కూడా?

1000 కోట్ల మహాభారతంలో...... మన మహేష్ బాబు కూడా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మోహన్ లాల్ ప్రధాన పాత్రలో రూ. 1000 కోట్ల బడ్జెట్ తో 'మహాభారతం' మూవీ త్వరలో తెరకెక్కబోతుండగా.... పలు ఆసక్తికర కథనాలు ప్రచారంలోకి వస్తున్నాయి. ఈ చిత్రంలో ఇతర పాత్రలకు ఇండియన్ సినీ రంగంలోకి ప్రముఖులను ఎంపిక చేయబోతున్నారు.

ప్రముఖ రచయిత ఎంటీ వాసుదేవన్ నాయర్ రాసిన రాండామూజమ్ నవల ఆధారంగా ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నారు. మహాభారతంలో భీముని పాత్ర కోణంలో, పాండవుల కథ నేపథ్యంగా ఈ సినిమాను తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మళలయాల నటుడు మోహన్ లాల్ ఇందులో ప్రధానమైన భీముడి పాత్రలో కనిపించబోతున్నారు. ఎన్నారై పారిశ్రామిక వేత్త బీఆర్ శెట్టి రూ. 1000 కోట్లతో ఈ సినిమా నిర్మించబోతున్నారు.

మహేష్ బాబు

మహేష్ బాబు

ఈ మహాభారతంలో శ్రీకృష్ణుడిగా మహేష్ బాబు పేరు వినిపిస్తోంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో నటించేందుకు మహేష్ బాబు కూడా ఎంతో ఆసక్తిగా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. అయితే ఈ పాత్రను చేయడానికి అమీర్ ఖాన్ కూడా ఆసక్తిగా ఉన్నారు. చివరకు ఎవరు ఫైనల్ అవుతారో చూడాలి.

అమితాబ్ లాంటి స్టార్స్ కూడా

అమితాబ్ లాంటి స్టార్స్ కూడా

ఈ సినిమాలో భీష్ముడి పాత్రకు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ అయితేనే పర్ఫెక్టుగా సూటవుతారని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు సమాచారం. భీష్ముడిగా అమితాబ్ .. అర్జునుడిగా హృతిక్ రోషన్ పేర్లు వినిపిస్తున్నాయి.

1000 కోట్ల బడ్జెట్ ఎందుకంటే

1000 కోట్ల బడ్జెట్ ఎందుకంటే

ఈ సినిమాకు వెయ్యి కోట్ల బడ్జెట్ కేటాయించడానికి కారణం..... ఈ సినిమాను హాలీవుడ్ స్టాండర్డ్స్ తో తెరకెక్కించడానికి ప్లాన్ చేయడమే. దీనికి తోడు భారీ తారాగణాన్ని తీసుకోవడం కూడా బాగా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కాబట్టి రూ. 1000 కోట్ల బడ్జెట్ లో సినిమాను ప్లాన్ చేస్తున్నారు.

మనీ వేస్ట్.... 1000 కోట్ల మహాభారతంపై.... సెటైర్!

మనీ వేస్ట్.... 1000 కోట్ల మహాభారతంపై.... సెటైర్!

మనీ వేస్ట్.... అంటూ 1000 కోట్ల మహాభారతం విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. అందుకు సంబంధించిన పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

English summary
According to the latest buzz, Superstar Mahesh babu is keen to play Lord Krishna in the magnum opus The Mahabharata is being directed by noted ad man and advertising filmmaker V A Shrikumar Menon.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu