»   » ఆడియో ఫంక్షన్ కు మహేష్ ఛీఫ్ గెస్ట్ గా ఖరారు

ఆడియో ఫంక్షన్ కు మహేష్ ఛీఫ్ గెస్ట్ గా ఖరారు

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్‌: మహేష్ బాబు తన సినిమా కాకుండా మరో సినిమాకు గెస్ట్ గా ఆడియో ఫంక్షన్ కి వెళ్లి ఆడియో విడుదల చేయనున్నారు. ఆ చిత్రం మరేదో కాదు.. 'ఆడు మగాడురా బుజ్జీ‌' . తన సోదరి భర్త...బావ అయిన ఎస్‌ఎమ్‌ఎస్‌ ఫేం సుధీర్‌బాబు, అస్మితా సూద్ జంటగా... 'ఆడు మగాడురా బుజ్జీ‌' రూపొందింది. ఈ చిత్రం ఆడియో శిల్ప కళా వేదికలో ఈ 30న జరగనుంది. మహేష్ బాబు రానుండటంతో ఈ సినిమాకు ట్రేడ్ సర్కిల్స్ లోనూ మంచి క్రేజ్ వచ్చి బిజినెస్ జరుగుతుందని భావిస్తున్నారు.

సుధీర్‌బాబు హీరోగా కలర్స్ అండ్ క్లాప్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ 'ఆడు మగాడ్రా బుజ్జీ' చిత్రాన్ని నిర్మిస్తోంది. పూనమ్ కౌర్, అస్మితాసూద్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంతో కృష్ణారెడ్డి గంగదాసు దర్శకునిగా పరిచయమవుతున్నారు. సుబ్బారెడ్డి, ఎస్‌.ఎన్‌.రెడ్డి నిర్మాతలు. ఈ చిత్రం పూర్తి ఎంటర్టైన్మెంట్ తో నడవనుందని తెలుస్తోంది. కొద్దిపాటి యాక్షన్, పూర్తి స్ధాయి ఫన్, రొమాన్స్ తో చిత్రం జనరంజకంగా దర్శకుడు తీర్చిదిద్దుతున్నారు.

సినిమాలో హీరో సుధీర్ బాబు పాత్ర చాలా సరదాగా ఉంటుందని, తండ్రి,కొడుకుల మద్య రిలేషన్ సీన్స్, ఎమోషన్స్ హైలెట్ గా నిలుస్తాయని చెప్తున్నారు. ప్రతీ ఒక్కరూ ఆ సీన్స్ కు కనెక్టు అవుతారని చెప్తున్నారు. సుధీర్‌బాబును కొత్త కోణంలో ఆవిష్కరించే సినిమా ఇది. టాకీపార్ట్‌ మొత్తం పూర్తయింది.

నవంబర్ లో విడుదలకు సిద్దమవుతున్న ఈచిత్రంలో సుధీర్ బాబు సొంతగా స్టంట్స్ పెర్ఫార్మ్ చేస్తున్నారట. నిర్మాత సుబ్బారెడ్డి మాట్లాడుతూ...'ఈ చిత్రంలో సుధీర్ బాబు ఒళ్లు గగుర్బొడిచే యాక్షన్ సన్నివేశాల్లో ఎలాంటి డూప్ లేకుండా సొంతగా చేస్తున్నారు. ఎంతో ప్రొఫెషనల్‌గా వాటిని చేసారాయన. రియలిస్టిక్‌గా సీన్ రావాలనే ఆకాంక్షతోనే ఆయన సొంతగా స్టంట్స్ చేస్తున్నారు. ఆ సన్నివేశాలు సినిమాకే హైలెట్‌గా నిలుస్తాయి' అని తెలిపారు.


సుమన్, నరేష్, సంధ్యా జనక్, లక్ష్మి, రణ్‌ధీర్, సాయి, కృష్ణభగవాన్, పృథ్విరాజ్, సుమన్‌శెట్టి తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: శ్రీ, కథ: కృష్ణాడ్డి గంగదాసు, లంకపల్లి శ్రీనివాస్, కెమెరా: శాంటోనియో ట్రిజియో, పాటలు: పద్మశ్రీ, నక్కా రామకృష్ణ, పాటలు: అనంతశ్రీరామ్, కృష్ణచైతన్య, చిర్రావూరి విజయ్‌కుమార్, నిర్మాతలు:సుబ్బారెడ్డి, ఎస్.ఎన్.రెడ్డి, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కృష్ణారెడ్డి గంగదాస్.

English summary
The audio launch of ‘Aadu Magadu Ra Bujji’ movie is going to take place at Shilpa Kala Vedika on the 30th of this month. Mahesh Babu will be the Chief Guest of the function and he will be launching the audio. ‘Aadu Magadu Ra Bujji’is expected to be an action entertainer with a good dose of comedy.The movie is expected to release in November.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu