For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  మహేష్ కు శృతిహాసన్ ట్విస్ట్

  By Srikanya
  |

  హైదరాబాద్ : సాధారణంగా హీరో కాల్ షీట్ల సమస్య మిగతా వాళ్లమీద ఎఫెక్టు పడుతూంటుంది. అయితే ఇక్కడ శృతిహాసన్ కాల్ షీట్ల సమస్య మహేష్ మీద పడబోతోందని సమాచారం. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం షూటింగ్ శృతి హాసన్ డేట్స్ సమస్య వలన లేటయ్యేటట్లు ఉందని తెలుస్తోంది.

  వివరాల్లోకి వెళితే...కొద్ది రోజుల క్రితం ఆరు రోజుల పాటు పూనే లో శృతి,మహేష్ ల మీద సీన్స్ తీసారు దర్శకుడు. మూడు రోజుల పాటు టాకి, దాదాపు 65% ఓ పాటను తీసారు. అయితే ఆ షెడ్యూల్ ని కంటిన్యూ చెయ్యాలని ఉన్నా...శృతి హాసన్...విజయ్ ఫాంటసీ చిత్రానికి డేట్స్ ఇవ్వటంతో అటెళ్లిపోయిందని సమాచారం. దాంతో డిసెంబర్ మొదటి వారం దాకా మహేష్ సినిమాకు ఆమె డేట్స్ కేటాయించలేని పరిస్ధితి నెలకొంది.

  'ఆగడు' పూర్తయ్యాక మహేష్‌ సెట్‌కు వెళుతోంది ఇప్పుడే. దాంతో అందరి దృష్టీ ఈ చిత్రంపై ఉంది. కథపై పూర్తి కసరత్తు చేసి మరీ కొరటాల శివ కసిగా రంగంలోకి దిగాండున్నారు. హిట్ ఖాయం అనే మాట ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తోంది.

  Mahesh Babu facing Call Sheets issue

  ''భారీ హంగులతో తెరకెక్కుతున్న చిత్రమిది. మహేష్‌ శైలికి తగ్గట్టుగా మాస్‌ అంశాల్ని మేళవించి కథను సిద్ధం చేశారు దర్శకుడు. అందరికీ నచ్చే ఓ మంచి సినిమా అవుతుంది''అని చెబుతున్నారు నిర్మాతలు.

  గపతిబాబు, రాజేంద్రప్రసాద్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మహేష్‌బాబు శైలికి తగిన కథ ఇది. కుటుంబ బంధాలకూ చోటుంది. దేవిశ్రీ ప్రసాద్‌ అందించే బాణీలు ఆకట్టుకొంటాయని నిర్మాతలు చెప్తున్నారు.

  మహేష్ బాబు మాట్లాడుతూ....కొరటాల చెప్పిన కథ ఎంతో ఎక్సయిటింగ్ గా ఉంది. మా కాంబినేషన్ లో ఇది మంచి కమర్సియల్ ఫిలిం అవుతుంది. మైత్రి మూవీ మేకర్స్ బేనర్ లో ఈ సినిమా రూపొందుతోంది అన్నారు.

  దర్శకుడు మాట్లాడుతూ ''నా రెండో చిత్రమే మహేష్‌బాబుతో చేయబోతుండడం ఆనందంగా ఉంది. క్లాస్‌, మాస్‌ కలిపిన కథలో మహేష్‌ పాత్ర ఆకట్టుకొంటుంది. ఈ కథలో అన్ని రకాల వాణిజ్య హంగులూ ఉన్నాయి. మంచి అభిరుచి ఉన్న నిర్మాతలు దొరికారు.ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను నిర్మించడానికి ప్లాన్ చేశారు. యువతరం, కుటుంబం తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చుతుంది. మహేష్ బాబు అభిమానులు మెచ్చే చిత్రం అవుతుంది ''అన్నారు.

  నిర్మాలు మాట్లాడుతూ... మా మైత్రి మూవీ మేకర్స్ నిర్మించే తొలి చిత్రమే సూపర్ స్టార్ మహేష్ బాబు గారితో చెయ్యడం మా అదృష్టంగా భావిస్తున్నాము. మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఎంతో భారీ ఎత్తున ఈ చిత్రాన్ని నిర్మించడానికి ప్లాన్ చేసాము అన్నారు.

  మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శ్త్తకత్వంలో ఓ భారీ చిత్రం రూపొందుతోంది. ఓవర్సీస్ లో అత్తారింటికి దారేది వంటి భారీ సినిమాలు పంపిణీ చేసి ఎంతో మంచి పేరు తెచ్చుకున్న మైత్రి మూవీ మేకర్స్ అధినేతలు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి సంగీతం:దేవిశ్రీప్రసాద్,ఫోటోగ్రఫిః మది, ఫైట్స్: అరసు, ఎగ్జిక్యూటివ్ ప్రసాద్:అశోక్, నిర్మాతలుః ఎర్నేని నవీన్, యలమంచిలి రవిశంకర్, సివియమ్. ఛాయాగ్రహణం: ఆర్‌.మది, కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు.

  English summary
  Post the completion of 6 Days schedule, Shruti Haasan joined the shoot of Vijay's Fantasy Flick and can't allot dates for Mahesh's project till December first week.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X