»   » నవ్వడం ఆపుకోలేకపోతున్న మహేష్ ఫ్యాన్స్

నవ్వడం ఆపుకోలేకపోతున్న మహేష్ ఫ్యాన్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

మహేష్ బాబు ఫ్యాన్స్ నవ్వు ఆపుకోలేక పోతున్నారు. ఆర్ఆర్ మూవీ మేకర్స్ అధినేత వెంకట్ ఇచ్చిన స్టేట్‌మెంటే ఇందుకు కారణం. మహేష్ బాబు సినిమా సినిమాకు చాలా గ్యాప్ ఇస్తుంటాడు. ఖలేజా సినిమా దాదాపు మూడేళ్ల తర్వాత ప్రేక్షకుల ముందుకు వస్తే, ఖలేజా తర్వాత వస్తున్న 'దూకుడు" పది నెలల సమయం తీసుకుంది.

దూకుడు తర్వాత ఆర్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్ పై....' ది బిజినెస్ మ్యాన్" సినిమాలో నటిస్తున్నాడు మహేష్ బాబు. ఈ సినిమాను వచ్చే జనవరి వరకు, అంటే మరో నాలుగు నెలల్లో... ప్రేక్షకుల ముందుకు తెస్తామని ప్రకటించారు. అయితే వెంకట్ ప్రకటన అభిమానులకు నవ్వు తెప్పిస్తుంది. మహేష్ సినిమా ఏమిటి? ఇంత త్వరగా రావడం ఏమిటి? వెంకట్ కలగానీ కన్నాడా? అంటూ జోకులేకుసు కుంటున్నారు.

తన సినిమాపై మహష్ చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ప్రతి సీన్, ప్రతిపాట, ప్రతి సన్నివేశాన్ని దగ్గరుండి తనకు నచ్చే విధంగా డిజైన్ చేయించుకుంటాడు. ఇదంతా నాలుగు నెలల్లో ఎలా సాధ్యం అనేది వారి ప్రశ్న.మరి వెంకట్ అనుకున్న సమయంలోనే... మహేష్ బాబుతో సినిమా పూర్తి చేస్తాడా? లేక ఫేలయి నవ్వులపాలవుతాడా? వేచి చూడాల్సిందే.

English summary
It is known that Mahesh Babu films are popular for late and lethargic way of moving from first day of shoot to release date. 'Dookudu', that was intended to hit the screen 10 months ago, is yet to release. And 'Khaleja' took 3 years to release. But now a Press Note was released that RR Movies Venkat announced that 'The Businessman' will be released in coming January.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu