Don't Miss!
- News
union budget: మరికొద్ది గంటల్లో పార్లమెంటులో కేంద్ర బడ్జెట్, ఆశలు, అంచనాలు
- Finance
gst: రికార్డు స్థాయిలో GST వసూళ్లు.. ఇప్పటివరకు ఇదే రెండవ అత్యధికం
- Sports
WPL 2023 వల్ల భారత మహిళా క్రికెట్ దశ మారుతోంది: హర్మన్‌ప్రీత్ కౌర్
- Lifestyle
'ఆ' సమయంలో ఈ ప్రదేశాల్లో మీ భర్త & భార్యను టచ్ చేయండి...ఆ ఆనందం మరోస్థాయిలో ఉంటుంది!
- Technology
ఆపిల్ నుంచి ఫోల్డబుల్ ఐఫోన్ లాంచ్ వివరాలు! కొత్త ఫీచర్లు!
- Automobiles
అమరేంద్ర బాహుబలి ప్రభాస్ కాస్ట్లీ కారులో కనిపించిన డైరెక్టర్ మారుతి.. వీడియో వైరల్
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
మహేష్ పోషించనున్న వైఎస్ జగన్ పాత్ర.. సోషల్ మీడియాలో వైరల్ న్యూస్
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కథాంశంతో డైరెక్టర్ మహి వీ రాఘవ్ యాత్ర 2 సినిమా తెరకెక్కించబోతున్నానని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రంలో వైఎస్ జగన్ పాత్ర ఎవరు పోషిస్తే బాగా సెట్ అవుతుందని ఆలోచించిన ఆ డైరెక్టర్ మహేష్ బాబు పేరును పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. ఇందుకు సంబందించిన వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ విశేషాలు చూద్దామా..

మహేష్ బాబు అబ్బుర పరిచే నటన
ఇటీవలే భరత్ అనే నేను సినిమాలో యంగ్ పొలిటిషన్‌గా, యువ ముఖ్యమంత్రిగా మహేష్ బాబు అబ్బుర పరిచే నటన కనబరచడంతో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాత్రలో మహేష్ బాగా సూట్ అవుతాడనే టాక్ విస్ఫోటనంలా మారింది. యాత్ర మొదటి భాగంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డిగా మమ్ముట్టి పెర్ఫెక్ట్ సెలక్షన్ కావడంతో వైఎస్ జగన్‌గా మహేష్ బాబు అంతకంటే పర్ఫెక్ట్ సెలక్షన్ అవుతుందని చెప్పుకుంటున్నారు జనం.

జనాల్లో ఆసక్తి రేపిన జగన్ ప్రకటన
వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన జగన్ మోహన్ రెడ్డి.. అతి తక్కువ కాలంలోనే ప్రజా నాయకుడు అనే పేరు తెచ్చుకున్నారు. పదేళ్ల పాటు ప్రతిపక్షంలో ఉండి ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా ఇటీవలి ఎన్నికల్లో తానేంటో, తన బలమెంతో చూపించి ప్రత్యర్థి వర్గాలకు చుక్కలు చూపించారు జగన్. తనను నమ్మి ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టినందుకు గాను దానికి కృతజ్ఞతగా కేవలం ఆరు నెలల్లోనే తన నాయకత్వ తీరేంటో చూపిస్తానని జగన్ ప్రకటించారు.

యాత్ర 2 అంటూ
ఈ నేపథ్యంలో ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో జగన్ క్రేజ్ అమాంతం పెరిగింది. ఇది గమనించిన డైరెక్టర్ మహి వీ రాఘవ వెంటనే యాత్ర సీక్వల్‌గా యాత్ర 2 ప్రకటించేశారు. ఆ ప్రకటనతోనే ప్రేక్షకుల్లో అమితమైన ఆసక్తి చోటు చేసుకుంది. దీంతో జగన్ పాత్ర ఎవరిది అనే దానిపై చర్చలు ఊపందుకున్నాయి.

ఇంతలో తెరపైకి మహేష్ బాబు పేరు
తాజాగా ఈ సినిమాలో మహేష్ బాబు లీడ్ రోల్ పోషిస్తున్నాడని వార్తలు రావడం ప్రేక్షకులకు ఊపిరాడనంత ఉత్సాహాన్ని ఇస్తున్నాయి. ఇదే నిజమైతే యాత్ర 2 అనేది తెలుగు సినిమా చరిత్రలో గొప్ప సినిమాగా మిగిలిపోవడం ఖాయమే కదా! అయితే మహేష్ ఇప్పటికే 26 సినిమా అనిల్ రావిపూడితో కమిట్ అయ్యారు. మరి ఈ సినిమా కూడా చేస్తారా? లేదా? అనే సందేహాలు కూడా వస్తున్నాయి.