»   » చేయనంటూ చేతులు ఎత్తేసిన మహేష్ బాబు!?

చేయనంటూ చేతులు ఎత్తేసిన మహేష్ బాబు!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

మహేష్, శంకర్ కాంబినేషన్ లో త్రీ ఇడియట్స్ చిత్రం రీమేక్ త్వరలో ప్రారంభం అవుతుందంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే మహేష్ ఈ ప్రాజెక్టునుండి తప్పుకున్నట్లు తెలుస్తోంది. తమిళ, తెలుగు భాషల్లో రూపొందే ఈ చిత్రంలో తమిళ నటులును ఎక్కువ మంది ఉండటంతో వారితో పనిచేయాల్సి రావంట మహేష్ కు ఇష్టం లేదని అందుకే తప్పుకున్నాడని చెప్తున్నారు. అయితే శ్రీను వైట్ల కాంబినేషన్ లో రూపొందుతున్న దూకుడుకి డేట్స్ ప్రాబ్లం వస్తుందని ఈ రీమేక్ ని రిజెక్టు చేసాడని సన్నిహితులు చెప్తున్నారు. ఇవేమీ కాదని మహేష్ కి మొదటి నుంచి రీమేక్ లు ఇష్టం లేదని, చేయలేదని ఇఫ్పుడు శంకర్ దర్శకుడు అని ఒప్పుకున్నా స్ట్రయిట్ ప్రాజెక్టు అయితే బెటర్ ఆయన భావించే ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంటున్నాడనది కూడా ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. ఇక ఇదిలా ఉంటే తమిళ హీరో విజయ్ కూడా ఈ చిత్రంలో చేయటానికి ఆసక్తి చూపక తప్పుకున్నాడు. దానికి కారణం..శంకర్ ఈ చిత్రం కోసం గెటప్ చేంజ్ చేయమన్నాడని, అలా చేస్తే తాను చేయబోయే మరో రెండు చిత్రాలు షూటింగ్ లుకు ఇబ్బంది కలుగుతుంది కాబట్టి చేయలేనని చెప్పేసాడు. అటు విజయ్, ఇటు మహేష్ తప్పుకోవటంతో దర్శకుడు శంకర్ డైలమోలో పడ్డారు. ఈ ప్రాజెక్టు ఉంటుందా లేదా అన్నది సందేహంలో పడింది. దాంతో పాటు హీరోయిన్ గా కమిటై హ్యాపీగా ఉన్న ఇలియానా కూడా ఈ హఠాత్తు పరిణామానికి ఎలా స్పందిస్తుందో చూడాలి.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu