For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  తప్పుకున్న మహేష్ బాబు, ఆ స్థానంలో రవితేజ?

  By Bojja Kumar
  |

  హైదరాబాద్: గుణశేఖర్ దర్శకత్వంలో అనుష్క టైటిల్ రోల్‌లో తెరకెక్కుతున్న చిత్రం 'రుద్రమదేవి'. ఈచిత్రంలో సూపర్ స్టార్ మహేష్ బాబు గెస్ట్ రోల్ చేయబోతున్నట్లు గత కొంత కాలంగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం....ఆగడు చిత్రం బిజీ షెడ్యూల్ వల్ల మహేష్ బాబు తప్పుకున్నాడని, ఆయన స్థానంలో రవితేజ నటిస్తున్నారని తెలుస్తోంది.

  ఈ చిత్రంలో రవితేజ 'గోన గన్నారెడ్డి' పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. గుణశేఖర్, రవితేజ మధ్య మంచి స్నేహం ఉంది. ఈ నేపథ్యంలో గుణశేఖర్ స్వయంగా రవితేజను కలిసి ఈ పాత్ర చేయడానికి ఒప్పించినట్లు తెలుస్తోంది. అయితే ప్రొడక్షన్ హౌస్ నుంచి మాత్రం ఈ విషయమై ఎలాంటి అధికారిక సమాచారం లేదు.

  సినిమా షూటింగ్ వివరాల్లోకి వెళితే...చిత్రానికి సంబంధించి నాలుగో షెడ్యూల్ ప్రారంభమైంది. భారతదేశంలో తొలి హిస్టారికల్ స్టీరియో స్కోపిక్ 3డి చిత్రంగా రూపొందిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన నాలుగో షెడ్యూల్ షూటింగ్ ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియో ఏడెకరాల్లో జరుగుతుంది.

  డిసెంబర్ వరకు జరిగే ఐదు షెడ్యూల్స్‌లో చిత్ర నిర్మాణం పూర్తవుతుంది. హీరో శ్రీకాంత్ కుమారుడు రోషన్, కుమార్తె మేథ బాలనటులుగా వెండి తెరకు పరిచయం అవుతున్నారు. ఈ చిత్రంలో శ్రీకాంత్ కుమారుడు రోషన్ 14 ఏళ్ల ప్రాయంలో ఉన్న చాళుక్య వీరభద్రుడి పాత్రలో చిన్ననాటి రానాగా నటిస్తుండగా, శ్రీకాంత్ కూతురు మేథ 9 ఏళ్ల ప్రాయంలో ఉన్న రుద్రమదేవిగా నటిస్తున్నారు.

  ఈ చిత్రంలో రాణీ రుద్రమగా అనుష్క, చాళుక్య వీరభద్రునిగా రానా, గణపతిదేవునిగా కృష్ణంరాజు, శివదేవయ్యగా ప్రకాష్‌రాజ్, హరిహరదేవునిగా సుమన్, మురారిదేవునిగా ఆదిత్యమీనన్, కన్నాంబికగా నటాలియాకౌర్, ముమ్మడమ్మగా 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' ఫేం జరాషా, మదనికగా హంసానందిని, అంబదేవునిగా జయప్రకాష్‌రెడ్డి, గణపాంబగా అదితి చంగప్ప, కోటారెడ్డిగా ఆహుతి ప్రసాద్, టిట్టిబిగా వేణుమాధవ్,ప్రసాదాదిత్యగా అజయ్ కనిపించనున్నారు.

  తెలుగుజాతి గర్వించే కాకతీయ వైభవాన్ని కళ్లకు కట్టే సినిమా ఇది. దేశ చలనచిత్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే రీతిలో 'రుద్రమదేవి'ని తెరకెక్కించాలన్నదే నా లక్ష్యం. అందుకే ఏ విషయంలోనూ రాజీపడకుండా అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం అంటున్నారు గుణశేఖర్.

  ఈ చిత్రానికి సంగీతం : ఇళయరాజా, ఆర్ట్: తోట తరణి, ఫోటోగ్రపీ : అజయ్ విన్సెంట్, కాస్టూమ్స్ : నీతా లుల్లా(జోధా అక్భర్ ఫేం), ఎడిటింగ్ : శ్రీకర్ ప్రసాద్, విఎఫ్ ఎక్స్ : కమల్ కణ్ణన్, మాటలు : పరుచూరి బ్రదర్స్, పాటలు : సిరివెన్నెల, మేకప్ : రాంబాబు, నిర్మాత-కథ-స్ర్కీన్ ప్లే-దర్శకత్వం : గుణ శేఖర్.

  English summary
  Everyone knows that actress Anushka Shetty is playing the title role in director Gunasekhar's upcoming period film Rudramadevi, which is all about a prominent queen of the Kakatiya dynasty. It was rumoured earlier that superstar Mahesh Babu would essay the role of Gona Ganna Reddy in it.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more