For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  పవన్ కళ్యాణ్ కోసం స్పెషల్ షో.. నమ్రత సలహతోనే మహేష్ ప్లాన్?

  |

  తెలుగు చిత్ర పరిశ్రమలో బయట ప్రపంచానికి కనిపించని కొన్ని స్నేహాలు కూడా అప్పుడప్పుడు ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి. ముఖ్యంగా అగ్రహీరోలు చాలా ఫ్రెండ్లీగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. అభిమానుల అనవసరపు గొడవలు కారణంగా వారు కూడా కొన్నిసార్లు స్వేచ్ఛగా తిరిగేందుకు ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇక ఎన్నో ఏళ్లుగా పవన్ కళ్యాణ్ మహేష్ బాబు మధ్యలో అయితే ఒక మంచి ర్యాపో ఉంది. వీరిద్దరూ ఎప్పుడు కలిసినా కూడా చాలా ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే ఇటీవల నమ్రత సలహా మేరకు మహేష్ బాబు పవన్ కళ్యాణ్ కోసం ఒక ప్రత్యేకమైన సినిమా ప్రీమియర్ షోను ప్రదర్శించబోతున్నట్లుగా..తెలుస్తోంది పూర్తి వివరాల్లోకి వెళితే..

  అప్పట్లో పవన్ సపోర్ట్

  అప్పట్లో పవన్ సపోర్ట్

  టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ఒకప్పుడు మంచి స్నేహభావంతో తిరిగిన వారు. బయటి ప్రపంచానికి తెలియదు కానీ పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో మహేష్ బాబుకు కూడా అండగా నిలిచాడు ముఖ్యంగా అర్జున్ సినిమా సమయంలో పైరసీపై మహేష్ యుద్ధం ప్రకటించినప్పుడు మొట్టమొదట అందరికంటే ముందు పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేశాడు.

  పవన్ భార్యతో నమ్రత బాండింగ్

  పవన్ భార్యతో నమ్రత బాండింగ్

  ఇక పవన్ కళ్యాణ్ మహేష్ బాబు మాత్రమే కాకుండా వారి కుటుంబ సభ్యుల మధ్యలో కూడా చాలా సాన్నిహిత్యం అయితే ఉంది. అన్నాలెజ్నోవా అలాగే నమ్రతా శిరోద్కర్ ఇద్దరు కూడా ఒకరికొకరు ఫెస్టివల్స్ సమయంలో గిఫ్ట్స్ కూడా షేర్ చేసుకుంటూ ఉంటారుమ్ క్రిస్మస్ సందర్భంగా అన్నాలెజ్నోవా చాలాసార్లు ఘట్టమనేని కుటుంబ సభ్యులకు కూడా కొన్ని కానుకలు కూడా పంపించింది. ఆ విషయంపై నమ్రత పలుసార్లు సోషల్ మీడియాలో కూడా వివరణ ఇచ్చింది.

  మల్టీస్టారర్ చేస్తే..

  మల్టీస్టారర్ చేస్తే..

  అయితే పవన్ కళ్యాణ్ మహేష్ బాబు కలిసి సినిమా చేస్తే చూడాలని ఎంతో మంది అభిమానులు కూడా కోరుకుంటున్నారు. గతంలో వీరి కలయికలో సినిమా రాబోతున్నట్లు అనేక రకాల రూమర్స్ వచ్చిన విషయం తెలిసిందే. కానీ అవి నిజంగా కాలేదు. కానీ మంచి సినిమా కాన్సెప్ట్ దొరికితే మాత్రం మహేష్ బాబు పవన్ కళ్యాణ్ సినిమా చేయడానికి సిద్ధంగా ఉంటారు అని చెప్పవచ్చు

   ఆ సినిమా కోసం..

  ఆ సినిమా కోసం..

  మహేష్, పవన్ కళ్యాణ్ జల్సా సినిమా కు ప్రత్యేకంగా వాయిస్ ఓవర్ ఇచ్చిన విషయం తెలిసిందే. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమాలో మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇచ్చిన విధానం సినిమాలోనే చాలా హైలెట్ గా నిలిచింది సినిమా మొదటి నుంచి చివరి వరకు మహేష్ బాబు పవన్ కళ్యాణ్ పాత్ర గురించి చెబుతూ వెళ్లే విధానం ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు.

   పవన్ కోసం స్పెషల్ షో

  పవన్ కోసం స్పెషల్ షో

  అయితే మొదటి సారి మహేష్ బాబు పవన్ కళ్యాణ్ కోసం సినిమాకు సంబంధించిన ప్రివ్యూ వేయాలని టీంతో కలిసి మాట్లాడినట్లుగా తెలుస్తోంది. ఆ సినిమా మరేదో కాదు మహేష్ బాబు సోని పిక్చర్స్ తో కలిసి నిర్మించిన మేజర్ సినిమా అని తెలుస్తోంది. మేజర్ సినిమాను మహేష్ బాబు జిఎంబి ప్రొడక్షన్స్ సహ నిర్మాతగా వ్యవహరించిన విషయం తెలిసిందే.

  Recommended Video

  F3 Movie Review కుంభస్థలం కొట్టిందా? గురి తప్పిందా? | Filmibeat Telugu
   నమ్రత సలహా

  నమ్రత సలహా

  ఇదివరకే అడవి శేష్ సోషల్ మీడియాలో కూడా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చాడు. తప్పకుండా అలాంటి ప్లాన్ ఉందని కూడా ఒక నెటిజన్ అడిగిన ప్రశ్నకు వివరణ ఇచ్చాడు. ఇక మేజర్ సినిమా ప్రత్యేకమైన షోలను సెలబ్రిటీల కోసం వేయాలి అని నమ్రత ఆలోచించినట్లుగా తెలుస్తోంది. మహేష్ బాబు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. కుదిరితే మహేష్ బాబు కొంత మంది సినీ ప్రముఖులతో కలిసి సినిమా చూసే అవకాశం అయితే ఉంది. ఇక ఆ లిస్టులో పవన్ కళ్యాణ్ ఉంటే అభిమానులకు పండగే అని చెప్పవచ్చు.

  English summary
  Mahesh babu planing special major movie preview for pawan kalyan
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X