రిలీజ్ విషయంలో మహేష్ నయా ఐడియా.. ఫ్యాన్స్ కోసం ఎక్కడా తగ్గట్లేదుగా!

మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమా వచ్చి దాదాపు ఏడాది గడుస్తోంది. ఆయన నుంచి మరో సినిమా రావాలంటే ఖచ్చితంగా మళ్ళీ సంక్రాంతి దాకా ఎదురు చూడాల్సిందే అని అంటున్నారు.. ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట అనే సినిమా చేస్తున్న మహేష్ సినిమాల రిలీజ్ విషయంలో తాజాగా ఒక వార్త వెలుగులోకి వచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే

వంశీ పైడిపల్లితో సినిమా

వంశీ పైడిపల్లితో సినిమా

అనిల్ రావిపూడి దర్శకత్వంలో సరిలేరు నీకెవ్వరు అనే సినిమా చేసిన మహేష్ బాబు ఆ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత వంశీ పైడిపల్లితో సినిమా చేయొచ్చని ముందు ఊహాగానాలు వచ్చినా ఆయన అనూహ్యంగా గీత గోవిందం దర్శకుడు పరశురామ్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

ఎప్పుడు మొదలవుతుందో

ఎప్పుడు మొదలవుతుందో

మహేష్ బాబు పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట అనే సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే 40 శాతం షూటింగ్ కూడా పూర్తయిందని చెబుతున్నారు. నిజానికి ఈ సినిమా మొదటి షెడ్యూల్ దుబాయ్ లో షూటింగ్ జరిపారు. రెండో షెడ్యూల్ షూటింగ్ హైదరాబాద్ లో చేయాల్సి ఉండగా కరోనా సెకండ్ వేవ్ వచ్చి పడింది. ఈ నేపథ్యంలో మళ్లీ ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది.

త్రివిక్రమ్ దర్శకత్వంలో

త్రివిక్రమ్ దర్శకత్వంలో

ఈ సినిమా పూర్తయ్యాక మహేష్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. హారిక హాసిని క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో మహేష్ బాబు ఒక పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నాడు అని ప్రచారం జరుగుతోంది. ఆ సంగతి పక్కన పెడితే ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుంది అనే అంశం మీద తీవ్రంగా చర్చలు జరుగుతున్నాయి.

ఇప్పటికే 40 శాతం షూటింగ్

ఇప్పటికే 40 శాతం షూటింగ్

తాజాగా అందుతున్న సమాచారం మేరకు మహేష్ బాబు సర్కారు వారి పాట ఇప్పటికే 40 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇక మహేష్ ప్లాన్ ప్రకారం ఈ సినిమాను ఎట్టి పరిస్థితిలో ఈ ఏడాది అక్టోబర్ నెలలో పూర్తి చేయాలని భావిస్తున్నారు. అక్టోబర్ లో పూర్తి చేస్తే సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసుకుని సంక్రాంతికి రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

Recommended Video

Rajamouli గురించి తెలిసే Mahesh Babu ఇలా | Mahesh Babu Rajamouli Movie || Filmibeat Telugu
ఆరు నెలల గ్యాప్ తోనే

ఆరు నెలల గ్యాప్ తోనే

ఇక సర్కారు వారి పాట షూటింగ్ పూర్తయిన వెంటనే త్రివిక్రమ్ సినిమా పట్టాలెక్కించి వెంట వెంటనే షూటింగ్ చేయించాలని మహేష్ బాబు భావిస్తున్నారని సమాచారం. ఇప్పటికే దాదాపు ఏడాదిన్నర వేస్ట్ అయిన కారణంగా ఫ్యాన్స్ ని ఎక్కడ నిరాశ పరచకుండా రెండు సినిమాలు ఆరు నెలల గ్యాప్ తోనే రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X