»   » 25 కోట్లు పోసి మరీ మహేష్ బాబు కొన్నాడు

25 కోట్లు పోసి మరీ మహేష్ బాబు కొన్నాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: శ్రీమంతుడు చిత్రం సక్సెస్ తర్వాత మహేష్ బాబు రేంజే మారిపోయింది. ఆయన ఉత్సాహంలో దర్శకుడు కొరటాల శివకు బిఎమ్ డబ్లూ కారు ఇచ్చారు. అలాగే తనకు రేంజి రోవర్ కారు కొనుక్కున్నారు. ఇప్పుడు ఆయన ఓ పోష్ లొకాలిటీలో ప్లాట్ కొన్నట్లు సమాచారం.

అందుతున్న సమాచారం ప్రకారం ఆ ప్లాట్ కొన్నది ముంబై సబర్బన్  ఏరియాలో. ఆ ప్లాట్ ఖరీదు 25 కోట్లు అని తెలుస్తోంది. సల్మాన్ ఖాన్ అతని స్నేహితులు వేసిన వెంచర్ లోదే ఈ ప్లాట్. మహేష్, నమ్రత రీసెంట్ గా ముంబై వెళ్ళి ఈ ప్లాట్ కు సంభందించిన పేపర్ వర్క్ పూర్తి చేసుకువచ్చారు.

అలాగే ఈ 25 కోట్లును తను తర్వాత చేయబోయే చిత్రం కోసం ఇద్దరు ప్రొడ్యూసర్స్ వద్ద అడ్వాన్స్ గా తీసుకున్న మొత్తం అని తెలుస్తోంది. ముంబై వెళ్లినప్పుడు ఈ ప్లాట్ ని ఉపయోగిస్తారు. అలాగే తమ కుటుంబ సభ్యులు ఎవరైనా ముంబై వెళితే హోటల్ లో దిగకుండా ఈ ప్లాట్ లో దిగవచ్చు అని ప్లాన్ చేసి తీసుకున్నారని సమాచారం.

మహేష్ తాజా చిత్రాల విషయానికి వస్తే... సూపర్ హిట్ 'శ్రీమంతుడు' చిత్రం తర్వాత మహేష్‌ బాబు చేస్తున్న సినిమా 'బ్రహ్మోత్సవం' . పి.వి.పి. సినిమా పతాకంపై ఈ చిత్రం రూపొందుతున్న ఈ చిత్రానికి శ్రీకాంత్‌ అడ్డాల దర్శకుడు. రీసెంట్ గా ఈ చిత్రం షూటింగ్ షెడ్యూల్ వివరాలను మీడియాకు తెలియచేసింది. రామోజీ ఫిల్మ్ సిటీ, ఊటీలలో ఈ చిత్రం కంటిన్యూ షెడ్యూలు షూటింగ్ జరపనున్నట్లు ప్రకటించింది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

 Mahesh Babu purchase Flat @Mumbai?


దర్శకుడు శ్రీకాంత్‌ అడ్డాల మాట్లాడుతూ ''ఇప్పటి వరకు రెండు షెడ్యూల్స్‌ జరిగాయి. ఈనెల 28 నుంచి మూడో షెడ్యూల్‌ను రామోజీ ఫిల్మ్‌ సిటీలో ప్రారంభిస్తున్నాం. డిసెంబర్‌ 9 వరకు హైదరాబాద్‌లో షూట్‌ చేసి ఊటీ షిఫ్ట్‌ అవుతాం. డిసెంబర్‌ 10 నుంచి నెలాఖరు వరకు ఊటీలో షెడ్యూల్‌ చేస్తాం. ఊటీలో చిత్రంలోని నటీనటులందరూ పాల్గొనే ముఖ్యమైన సన్నివేశాలు చిత్రీకరిస్తాం. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' వంటి సూపర్‌హిట్‌ తర్వాత మహేష్‌తో మళ్ళీ ఓ మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది'' అని చెప్పారు.

మహేష్ బాబు సరసన సమంత, కాజల్, ప్రణీత హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో సత్యరాజ్, జయసుధ, రేవతి, నరేష్, రావు రమేష్, తనికెళ్ల భరణి, శుభలేఖ సుధాకర్, తులసి, ఈశ్వరీరావు, షాయాజీ షిండే, కృష్ణభగవాన్, రజిత, కాదంబరి కిరణ్, చాందిని చౌదరి తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. పి.వి.పి. సినిమా అధినేత ప్రసాద్‌ వి.పొట్లూరి మాట్లాడుతూ వేసవిలో విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తున్నామని అన్నారు.

ఈ చిత్రానికి డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ : ఆర్.రత్నవేలు, సంగీతం : మిక్కీ జె. మేయర్, డాన్స్ : రాజు సుందరం, ప్రొడక్షన్ డిజైనర్ : తోట తరణి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : సందీప్ గుణ్ణం, నిర్మాతలు : పెరల్ వి.పొట్లూరి, పరమ్ వి.పొట్లూరి, కథ,స్ర్కీన్‌ప్లే, దర్శకత్వం : శ్రీకాంత్ అడ్డాల.

English summary
Mahesh Babu has spent a whooping Rs 25 crore to own a flat in Mumbai suburb.
Please Wait while comments are loading...