విజయ్ ని తీసేసి మహేష్ తో చిత్రం ఖరారు?
దాంతో ఇక మహేష్,గౌతమ్ మీనన్ చిత్రం లేనట్లే అని అంతా అనుకున్నారు. అయితే ఆయన తను విజయ్ తో ప్లాన్ చేసిన చిత్రానికి మహేష్ అయితే కరెక్టుగా సరిపోతాడని బావించి మహేష్ ని ఎప్రోచ్ అవుతున్నాడని కోలివుడ్ వర్గాలు అంటున్నాయి. విజయ్ కు నేరేట్ చేసిన యోహాన్ అధ్యాయం ఒండ్రు కథ నచ్చలేదని,పూర్తిగా హాలీవుడ్ స్టైల్లో ఉందని,తన అబిమానులు కనెక్టు కారని మార్పులు కోరాడట. అయితే గౌతమ్ కి హీరో మార్పులు చెప్పటం నచ్చలేదు. దాంతో మహేష్ తో తమిళ,తెలుగు భాషల్లో చేసి అక్కడి వారికి బుద్ది చెప్పాలనే ఆలోచనలో ఉన్నట్లు తమిళ మీడియా అంటోంది.
ప్రస్తుతం మహేష్ వరస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. దిల్ రాజు బ్యానర్ లో చేస్తున్న సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రం షూటింగ్ పూర్తి కావచ్చొంది. సుకుమార్ దర్శకత్వంలోనూ ఓ చిత్రం విడుదల అవుతోంది. 14 రీల్స్ సంస్థ ఈ చిత్రం నిర్మిస్తోంది. ఇందులో ఆయన ఆధునిక శైలిలో కనిపించబోతున్నట్లు సమాచారం. మారుతున్న ఫ్యాషన్స్‌కి అద్దంపట్టేలా మహేష్ రూపురేఖలు ఉంటాయని తెలిసింది. ఇప్పటి వరకూ ఆయన్ని చూడని కోణంలో కనిపిస్తారని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఈ విషయంలో చిత్ర కథానాయకుడితోపాటు, దర్శకుడు సుకుమార్ కూడా ప్రత్యేక దృష్టిపెట్టారు.
మరో ప్రక్క పవన్ తో చేసిన 'గబ్బర్ సింగ్' చేసిన బండ్ల గణేష్ తన పరమేశ్వర ఆర్ట్స్ బ్యానర్ పై మహేష్ తో చిత్రం చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ తో రీసెంట్ గా ఆయన చిత్రం కమిటయ్యారని సమాచారం. పూరీ జగన్నాధ్ ఈ చిత్రాన్ని డైరక్ట్ చేయనున్నారు. ప్రస్తుతం ఆయన ఈ చిత్రం స్క్రిప్టు రెడీ చేసే పనిలో బిజీగా ఉన్నారు. 2013 వేసవి లో ఈ చిత్రం ప్రారంభం కానుందని తెలుస్తోంది. ఈ చిత్రం రేసీ ఎంటర్టైనర్ గా రూపొందించనున్నారని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications












