»   » మహేష్ బాబు భార్య నమ్రత జోక్యం ఎక్కువైందంట!

మహేష్ బాబు భార్య నమ్రత జోక్యం ఎక్కువైందంట!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: కొరటాల శివ- మహేష్ బాబు కాంబినేషన్ తెరకెక్కుతున్న ‘శ్రీమంతుడు' సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ దశలో ఉంది. ఆగస్టు 7న సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

జి.మహేష్ బాబు ఎంటర్టెన్మెంట్స్ ప్రై.లి పేరుతో సొంతగా నిర్మాణ సంస్థను స్థాపించిన మహేష్ బాబు ఈ సినిమాకు స‌హ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ నిర్మాణ సంస్థకు సంబంధించిన వ్యవహారాలు ఆయన భార్య నమ్రత స్వయంగా చూసుకుంటోందట. దీంతో సినిమా విషయంలో ఆమె జోక్యం ఎక్కువైందని, ముఖ్యంగా సినిమా బిజినెస్ విషయంలో ఆమె తీరు ఇబ్బందిగా మారిందని, ఆమె చెప్పే ధరలు చూసి బయ్యర్లు సినిమాను కొనేందుకు భయపడుతున్నారని టాక్.


Mahesh Babu's wife intervention

ఆ సంగతి పక్కన పెడితే...
‘శ్రీమంతుడు' ఆడియో ఈ నెల 18న విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన పాటల వివరాలు బయటకు వచ్చాయి. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమా కోసం మొత్తం 6 పాటలు కంపోజ్ చేసారు. ఈ ఆడియో వేడుకను హైదరాబాద్ లోని శిల్పకళా వేదిక లో చేయాలని దర్శక,నిర్మాతలు నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం. సినిమాను ఆగస్టు 7న విడుదల చేయబోతున్నారు. వాస్తవానికి జులై 17నే ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా ‘బాహుబలి' కోసం వాయిదా వేసుకున్నారు.


ఇక ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ని, టీజర్ ని ఇప్పటికే విడుదల చేశారు. ఫస్ట్ లుక్ లో సైకిల్‌పై స్త్టెలిష్‌గా కనిపిస్తున్న మహేష్‌ లుక్‌ కి మంచి స్పందన వచ్చింది. మహేష్ బాబు సరసన శృతి హాసన్‌ హీరోయిన్. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌ (సీవీఎమ్‌) నిర్మిస్తున్నారు.

English summary
Mahesh Babu's wife Namratha intervention in Srimanthudu movie business.
Please Wait while comments are loading...