Just In
- 16 min ago
మహేశ్‌కు మళ్లీ కథ చెప్పిన సక్సెస్ఫుల్ డైరెక్టర్: ఈ సారి మరో ప్రయోగం అంటూ రిప్లై
- 18 min ago
పొట్టి బట్టల్లో పిచ్చెక్కిస్తోంది.. నిహారికను ఎప్పుడూ ఇలా చూసి ఉండరు!
- 49 min ago
RRR నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్.. డేట్ కూడా ఫిక్స్?
- 1 hr ago
గతం గురించి ఆలోచించకు.. అదిరిపోయిన ప్లే బ్యాక్ ట్రైలర్
Don't Miss!
- Sports
రెండు రోజుల్లోనే 22 టెస్టులు పూర్తి.. ఇంగ్లండ్ జట్టుదే ఆధిపత్యం!! భారత్ ఎన్నిసార్లంటే?
- News
Same Sex marriage: మోడీ సర్కార్ నిర్ణయంపై భగ్గుమంటోన్న స్వలింగ సంపర్కులు: తొక్కేశారంటూ
- Finance
గుడ్‌న్యూస్, 30,000 మందికి క్యాప్‌జెమిని ఉద్యోగాలు! ఫ్రెషర్స్, ఎక్స్‌పీరియన్స్‌కు అవకాశం
- Lifestyle
ఈ 4 రాశుల వారికి లీడర్ షిప్ క్వాలిటీస్ ఉండవు... ఈ జాబితాలో మీ రాశి ఉందేమో చూసెయ్యండి...
- Automobiles
525 హార్స్ పవర్ వి8 ఇంజన్‌తో వస్తున్న మోస్ట్ పవర్ఫుల్ డిఫెండర్ వి8
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఫ్యామిలీతో కలిసి సీక్రెట్‌గా మెగా హీరో సినిమా చూసిన మహేశ్ బాబు.. దీనిపై స్పందిస్తాడా.!
వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు. ప్రస్తుతం టాలీవుడ్‌లో నెంబర్ పొజిషన్‌పై కన్నేసిన హీరోల్లో అతడి పేరు ముందుగా వినిపిస్తోంది. దీనికి కారణం మహేశ్ అందుకుంటున్న విజయాలతో పాటు అతడి ఫాలోయింగే. అందంతో పాటు యాక్టింగ్‌లోనూ రాణించే ఈ స్టార్ హీరోకు మార్కెట్ కూడా భారీగానే ఉంది. అందుకే ఆయన సినిమాలు మంచి ఓపెనింగ్స్ సాధిస్తుంటాయి. తాజాగా మహేశ్ బాబు గురించి ఓ న్యూస్ ఇండస్ట్రీలో వైలర్ అవుతోంది. ఇంతకీ ఏంటా న్యూస్..? ఆ వివరాలేంటే చూద్దాం.

జోనర్ మారింది కానీ, ఫలితం మాత్రం అదే
మహేశ్ బాబు వరుసగా ‘భరత్ అనే నేను', ‘మహర్షి' అనే సూపర్ హిట్ చిత్రాల్లో నటించాడు. ఇక, ఇటీవల ‘సరిలేరు నీకెవ్వరు' అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా కూడా భారీ విజయాన్ని అందుకుంది. ఫలితంగా మహేశ్ ఖాతాలో హ్యాట్రిక్ విజయాలు నమోదు అయ్యాయి. దీంతో అతడి ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

బడా సినిమాలను తట్టుకుని నిలబడ్డాడు
ఈ సంక్రాంతికి భారీ సినిమాలతో వచ్చారు స్టార్ హీరోలు. అందరి కంటే ముందుగా సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘దర్బార్' ప్రేక్షకులను పలకరించింది. ఆ తర్వాత అల్లు అర్జున్ - త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో వచ్చిన ‘అల.. వైకుంఠపురములో' కూడా విడుదలైంది. అయినప్పటికీ.. మహేశ్ బాబు నటించిన ‘సరిలేరు నీకెవ్వరు' పోటీని తట్టుకుని నిలబడింది.

అప్పటి నుంచే మొదలు పెట్టేసిన సరిలేరు
సంక్రాంతికి పలు చిత్రాలు పోటీలో ఉన్నప్పటికీ సరిలేరు నీకెవ్వరు సూపర్ హిట్ అవడంతో పాటు కలెక్షన్ల పరంగానూ సత్తా చాటింది. ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ సహా మిగిలిన ప్రాంతాల్లో కలిపి రూ. 130 కోట్లు పైచిలుకు షేర్ సాధించింది. అలాగే, దాదాపు రూ. 200 కోట్లు పైచిలుకు గ్రాస్ కూడా రాబట్టింది. దీంతో మహేశ్ పలు రికార్డులను బద్దలు కొట్టాడు.

సత్తా చాటాడు.. సెలవు తీసుకుంటున్నాడు
దాదాపు నెల రోజుల పాటు సరిలేరు నీకెవ్వరు సినిమాపై ఫోకస్ పెట్టిన సూపర్ స్టార్ మహేశ్ బాబు.. అది విడుదలైన తర్వాత ఫ్యామిలీతో కలిసి ఫారెన్ చెక్కేశాడు. భార్య నమ్రత, ఇద్దరు పిల్లలతో కలిసి హాలిడే ట్రిప్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. వీటికి సంబంధించిన ఫొటోలను తరచూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు ఈ స్టార్ కపుల్. దీంతో ఆ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

మెగా హీరో సినిమా చూసిన మహేశ్ బాబు
ప్రస్తుతం అమెరికాలో ఉన్న మహేశ్ బాబుకు సంబంధించిన ఓ న్యూస్ హాట్ టాపిక్ అవుతోంది. దీని ప్రకారం.. న్యూయార్క్‌లోని ఓ థియేటర్‌లో మహేశ్ బాబు తన కుటుంబంతో కలిసి అల్లు అర్జున్ నటించిన ‘అల.. వైకుంఠపురములో' సినిమా చూశాడట. అయితే, ఇది సీక్రెట్‌గా జరిగిందని అంటున్నారు. అంతేకాదు, ఈ సినిమా గురించి ట్వీట్ చేస్తాడని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.