For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఆయనతో కలిసి మహేశ్ సీక్రెట్ టూర్.. ఎప్పుడూ లేనిది ఇప్పుడెందుకు ఇలా చేస్తున్నాడు.!

  By Manoj
  |

  తెలుగు సినీ ఇండస్ట్రీలో ఉన్న హీరోల్లో సూపర్ స్టార్ మహేశ్ బాబు కొంచెం స్పెషల్ అన్న టాక్ ఉంది. సినిమా ఫలితాలతో సంబంధం లేకుండా వరుసగా ప్రాజెక్టులకు సైన్ చేస్తూ స్టార్ హీరోగా వెలుగొందుతున్నాడు. సినిమాలకు సినిమాలు.. మధ్య మధ్యలో వ్యాపార ప్రకటనలు చేస్తూ బిజీ బిజీగా గడుపుతున్నాడు. కేవలం యాక్టర్‌గానే కాదు.. ఈ మధ్య నిర్మాతగానూ మారాడు. ఈ క్రమంలోనే భారీగా అర్జిస్తున్నాడు. తాజాగా అతడు నటించిన సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో సూపర్ స్టార్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఇంతకీ ఏంటా న్యూస్..? పూర్తి వివరాల్లోకి వెళితే...

  హ్యాట్రిక్ కోసం సక్సెస్‌ఫుల్ డైరెక్టర్‌తో

  హ్యాట్రిక్ కోసం సక్సెస్‌ఫుల్ డైరెక్టర్‌తో

  ప్రస్తుతం మహేశ్ బాబు నటించిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు'. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో రష్మిక హీరోయిన్. అలాగే, విజయశాంతి, బండ్ల గణేష్, సంగీత ఈ సినిమా ద్వారా రీఎంట్రీ ఇస్తున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా వస్తున్న ఈ మూవీ కూడా హిట్ అయితే.. మహేశ్‌ ఖాతాలో హ్యాట్రిక్ నమోదవుతుంది.

  అవన్నీ అంచనాలు పెంచేస్తున్నాయి

  అవన్నీ అంచనాలు పెంచేస్తున్నాయి

  ‘సరిలేరు నీకెవ్వరు' సంక్రాంతి కానుకగా విడుదల కానున్న నేపథ్యంలో.. చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలు షురూ చేసేసింది. గతంలో చూడని విధంగా ఈ సినిమాలోని పాటలను ప్రతి సోమవారం విడుదల చేస్తున్నారు. వీటన్నింటిన్నింటితో పాటు కొద్ది రోజుల క్రితం విడుదలైన టీజర్‌కు భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. దీంతో సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి.

  ఇందులో సరికొత్త ప్రయోగాలు

  ఇందులో సరికొత్త ప్రయోగాలు

  సంక్రాంతి కానుకగా విడుదల కానున్న ‘సరిలేరు నీకెవ్వరు' కోసం మహేశ్ బాబు ఎన్నో సరికొత్త ప్రయోగాలు చేస్తున్నడని వార్తలు వస్తున్నాయి. ఇందులో అతడు గతంలో లేనంతగా డ్యాన్స్ చేశాడట. అలాగే, కర్నూలులో జరిగే ఎపిసోడ్ కోసం రాయలసీమ యాస ట్రై చేశాడని అంటున్నారు. వీటితో పాటు కామెడీ ఎపిసోడ్‌లో రెచ్చిపోయి నటించాడని సమాచారం.

  ఇది రిలీజ్ కాకముందే మరొకటి

  ఇది రిలీజ్ కాకముందే మరొకటి

  ‘సరిలేరు నీకెవ్వరు' షూటింగ్ జరుగుతుండగానే.. మహేశ్ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని ప్రచారం జరుగుతోంది. ‘మహర్షి' వంటి సూపర్ హిట్ చిత్రాన్ని అందించిన వంశీ పైడిపల్లితోనే ఆయన తర్వాతి సినిమాను చేయబోతున్నాడు. ఈ విషయాన్ని సదరు డైరెక్టర్ కూడా వెల్లడించిన విషయం తెలిసిందే. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.

  ఆ సినిమాను మించిపోయేలా

  ఆ సినిమాను మించిపోయేలా

  వంశీ పైడిపల్లితో చేసిన ‘మహర్షి'లో మహేశ్ డీసెంట్‌గా దర్శనమిచ్చాడు. అయితే, వీళ్లిద్దరి కాంబోలో రానున్న రెండో సినిమాలో మాత్రం అతడు గ్యాంగ్‌స్టర్‌గా నటించబోతున్నాడని అంటున్నారు. విశాఖ హార్బర్‌లో జరిగే దందాలకు సంబంధించిన కథాంశంతో ఈ మూవీ తెరకెక్కుతుందనే టాక్ వినిపిస్తోంది. ఇందులో ‘పోకిరి', ‘బిజినెస్‌మ్యాన్'ను మించేలా హీరోయిజం ఉంటుందని టాక్.

  మహేశ్ బాబు సీక్రెట్ టూర్

  మహేశ్ బాబు సీక్రెట్ టూర్

  ‘సరిలేరు నీకెవ్వరు' ప్రమోషన్స్ ముగిసిన తర్వాత మహేశ్ బాబు.. కుటుంబంతో కలిసి స్విడ్జర్లాండ్ వెలుతున్నాడని తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది. ఈ టూర్‌లో డైరెక్టర్ వంశీ పైడిపల్లి కూడా ఉంటాడని అంటున్నారు. వీళ్ల కాంబోలో రాబోతున్న సినిమా స్క్రిప్టుకు సంబంధించిన సిట్టింగ్స్‌లో పాల్గొనేందుకే దర్శకుడిని తీసుకెళ్తున్నాడని సమాచారం.

  English summary
  Mahesh Babu’s 25th film Maharshi released to fabulous response from critics and viewers. Helmed on budget of close to Rs 90 crore, the Vamshi Paidipally directorial has grossed over Rs 175 crore at the global box-office in its full run.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X