»   »  మహేష్, పవన్ ఫ్యాన్స్ కు పండుగ ఉందా?

మహేష్, పవన్ ఫ్యాన్స్ కు పండుగ ఉందా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : 2016 సంక్రాంతి జోరు మెదలై తెలుగు సినిమాకు ఆ శోభ వచ్చేసింది. అయితే ఈ లోగా మరో సినిమా పండుగ వస్తోంది. అదే జనవరి 1. జనవరి 1 కానుకగా అంటే రేపు సుమారు 7 సినిమాలు విడుదలవుతున్నాయి. ఇందులో రామ్ హీరోగా నేను శైలజ అందరికన్నా ప్రమోషన్స్ తో ముందు ఉన్నాడు. అయితే ఈ ఏడు చిత్రాల కన్నా సిని అభిమానులు మరో రెండిటి కోసం ఎదురుచూస్తున్నారు. అదే ...మహేష్, పవన్ సినిమాల టీజర్స్, ట్రైలర్స్, ఫస్ట్ లుక్ కోసం.

మరో ప్రక్క బన్ని కూడా ఈ పొంగల్ కి తనదైన స్టైల్లో సరైనోడు ఫస్ట్ లుక్ తో రావడానికి ట్రై చేస్తున్నాడు. కాని అభిమానులు మాత్రం పవన్ సర్థార్ గబ్బర్ సింగ్ టీసర్ కోసం , మహేష్ బ్రహ్మోత్సవం ఫస్ట్ లుక్ కోసం ఎంతో ఆత్రంగా ఈ సంక్రాంతికి వస్తారని ఎదురుచూస్తున్నారు.

Mahesh, Pawan fans waiting for NY gifts


ఈ సంక్రాంతి ని పురస్కరించుకుని పెద్ద సినిమాలే వరస పెడుతున్నాయి. ఎన్టీఆర్, బాలకృష్ణ, నాగార్జునా ఇలా స్టార్ హీరోలతో పండుగ మోతిక్కపోనుంది. అయితే మహేష్ మరియు పవన్ లు ఇంకా ముందుకు కదులుతున్నట్టు లేరు. ఇంచుమించు షూటింగ్స్ కంప్లీట్ చేసుకుంటున్న దశలో ఉన్నా సర్థార్, బ్రహ్మోత్సవాలు సినిమాలు వాటి వివరాలు ఇంకా తెలుపడం లేదు దర్శక నిర్మాతలు. కాస్త స్పీడు అయితే ఫ్యాన్స్ పండుగ చేసుకుంటారుకదా.

English summary
The fans of Pawan Kalyan and Mahesh Babu are still anxiously looking for the New Year presents.
Please Wait while comments are loading...