»   »  '1 నెనొక్కడినే' లో ఇంటర్వెల్ ట్విస్ట్ అదా..?

'1 నెనొక్కడినే' లో ఇంటర్వెల్ ట్విస్ట్ అదా..?

By Srikanya
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్ : మహేష్ బాబు '1 నెనొక్కడినే' సినిమా సంక్రాంతికే ప్రేక్షకుల ముందుకు రానుంది. 'దూకుడు' చిత్రం తరువాత మహేష్ బాబు హీరోగా 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రై.లి. సంస్థ సుకుమార్ దర్శకత్వంలో నిర్మిస్తున్న '1' నేనొక్కడినే.. చిత్రం జనవరి 10న విడుదల కానుంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం స్టోరీ పై రకరకాల కథలు ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతున్నాయి. ముఖ్యంగా ఈ చిత్రంలో ట్విస్ట్ సినిమాకు ప్రాణమై నిలుస్తుందని చెప్పుకుంటున్నారు అదేమిటంటే...

  ఈ చిత్రంలో మహేష్ బాబు...ఫస్టాఫ్ అంతా ఇద్దరిగా కనపడతాడు. ఒకటి పాప్ సింగర్ గా...మరొకటి..రివేంజ్ తీర్చుకునే కుర్రాడిగా... ఇంటర్వెల్ దగ్గరకి వచ్చేసరికి వీళ్లద్దరూ వేరు వేరు కాదు...ఒకరే అని తెలుస్తుంది. అదే ఈ సినిమాలో మేజర్ ట్విస్ట్ అని చెప్పుకుంటున్నారు. హూ ఆర్ యూ అనే పాట కూడా ఈ ట్విస్ట్ ని బేస్ చేసుకున్న పాటే అంటున్నారు. ఈ ట్విస్ట్ ..పాటని దృష్టిలో పెట్టుకుని అల్లేసిన కహానీనా లేక నిజమా అని తేలాలంటే సినిమా రిలీజ్ అయ్యేదాకా వేచి ఉండాల్సిందే.

  మహేష్ బాబు మాట్లాడుతూ... '' ఈసారీ పండగ '1'తో మొదలవబోతోంది. అభిమానులు సిద్ధంగా ఉండండి. థియేటర్ల దగ్గర పండగ చేసుకొందాం. 2013ని మర్చిపోలేను. గత రెండేళ్ల నుంచీ సంక్రాంతికి నా సినిమాలొస్తున్నాయి. 'బిజినెస్‌మేన్‌', 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమాల్ని ప్రేక్షకులు ఆదరించారు.2014లో కనీసం రెండు సినిమాలైనా సిద్ధం చేయాలన్నది నా ఆలోచన. కొత్త యేడాది సంబరాలు ఇంటి దగ్గరే చేసుకొంటా'' అన్నారు .

  రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సినిమా గురించి వారు వివరిస్తూ - 'ప్రేక్షకుల్లో, అభిమానుల్లో మా సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ముందు ప్రకటించిన విధంగానే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి జనవరి 10న విడుదల చేస్తాం' అన్నారు. 'ఆడియో పెద్ద హిట్ అయింది.

  దేవిశ్రీప్రసాద్ ఇచ్చిన సంగీతం ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటోంది. మహేశ్ తనయుడు గౌతమ్ చిన్నప్పటి మహేశ్‌గా నటించడం ఈ చిత్రానికి ఒక హైలైట్ పాయింట్. మా బేనర్‌లో ఇది మరో బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందనే నమ్మకం ఉంది' వారన్నారు. బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్, ఫొటోగ్రఫీ: ఆర్.రత్నవేలు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కోటి పరుచూరి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సుకుమార్.

  English summary
  Mahesh Babu has been generous in his praise for 1 Nenokkadine movie which has been under filming for well over a year. "Had there been any other producer I and director Sukumar would have been in big trouble. It is very special film and I consider it to be my best film till date. It is a novel concept that has never been tried in Telugu cinema and I'm hopeful that it will be loved by the audience," said Mahesh Babu.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more