»   » హాట్ న్యూస్ : మహేష్ 'ఆగడు' రిలీజ్ తేది

హాట్ న్యూస్ : మహేష్ 'ఆగడు' రిలీజ్ తేది

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : మహేష్ బాబు చిత్రం రిలీజ్ కోసం అభిమానులే కాకుండా సామాన్య సినీ జనం సైతం ఆసక్తిగా చూస్తారు. 'దూకుడు'తో మహేష్‌బాబుని పరర్ ఫుల్ పోలీసుగా చూపించిన శ్రీనువైట్ల ఇప్పుడు మరోసారి మహేష్‌తో ఖాకీ కట్టించారు. వీరిద్దరి కలయికలో 'ఆగడు' రూపుదిద్దుకుంటోంది. దాంతో ఈ చిత్రంపై ఓ రేంజిలో క్రేజ్ క్రియేట్ అవుతోంది. కృష్ణ జన్మదినం(మే 31) సందర్భంగా సినిమాను విడుదల చేసేందుకు నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారు.

''సినిమాలో అసలు సిసలు మాస్‌ మహేష్‌ని చూస్తారు. దర్శకుడు శ్రీనువైట్ల మహేష్‌ పాత్రను వైవిధ్యంగా తీర్చిదిద్దారు. ఈ నెల 4 వరకు తొలి షెడ్యూల్‌ జరుగుతుంది'' అని నిర్మాతలు తెలిపారు. సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. మహేష్‌బాబు, వెన్నెల కిషోర్‌, ఎమ్మెస్‌ నారాయణ తదితర ప్రధాన తారగణంపై హాస్య సన్నివేశాల్ని చిత్రిస్తున్నారు. మహేష్‌ సరసన తమన్నా హీరోయిన్ గా చేస్తోంది. 14రీల్స్‌ ఎంటర్‌టైన్మెంట్స్‌ పతాకంపై రామ్‌ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనిల్‌ సుంకర నిర్మిస్తున్నారు.

గతంలో పోకిరి,దూకుడు చిత్రాలలో పోలీస్ గా కనిపించిన మహేష్ బాబు మరోసారి పోలీస్ గా కనిపించనున్నాడని తెలుస్తోంది. శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందనున్న చిత్రం ఆగడు లో మహేష్ మరోసారి పోలీస్ గా తన విశ్వరూపం చూపించనున్నాడని సమాచారం. ఎంటర్టైన్మెంట్ తో పాటు ఈ సారి మరింత యాక్షన్ ని పెంచినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ తో చేసిన బాద్షా చిత్రం యావరేజ్ టాక్ తెచ్చుకోవటంతో ఈ సారి మరో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని శ్రీను వైట్ల ఫిక్సైనట్లు చెప్తున్నారు. అందుకు తగినట్లే మహేష్ క్యారెక్టర్ ని టఫ్ పోలీస్ గా రూపొందించినట్లు చెప్పుకుంటున్నారు.

అంతేకాదు మహేష్‌తో జత కట్టడం తమన్నాకి ఇదే తొలిసారి. దాంతో ఆమె ఎగిరి గంతేసి ఒప్పుకుందని,కంటిన్యూ డేట్స్ కేటాయించటానికి ముందుకువచ్చిందని సమాచారం. ఇప్పటికే ఓసారి మహేష్ బాబుతో సుకుమార్ సినిమాలో చేసే అవకాశం రాగా...డేట్స్ ప్రాబ్లం వల్ల చేజార్చుకున్న తమన్నా ఈ సారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అలా జరుగకుండా డేట్స్ విషయలో జాగ్రత్త పడుతోంది. దూకుడు సినిమాను మహేష్ బాబు ఇమేజ్‌కు తగిన విధంగా పూర్తి స్థాయి కమర్షియల్ అంశాలతో వినోదాత్మకంగా రూపొందించిన శ్రీను వైట్ల....'ఆగడు' స్క్రిప్టు తన గత సినిమాలకు వైవిధ్యంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.

తమన్‌ ఈ చిత్రానికి సంగీతం అందిస్తారు. వినోదం, యాక్షన్‌ కలగలిపిన చిత్రమిది. స్క్రిప్టు పనులు పూర్తయ్యాయి. ఖచ్చితంగా మరో హిట్ తో వస్తామని శ్రీను వైట్ల పూర్తి నమ్మకంగా ఉన్నారు. ఇంతకాలం శ్రీను వైట్లతో కలిసి పని చేసిన గోపీ మోహన్, కోన వెంకట్ సొంతగా దర్శకత్వం వైపు అడుగులు వేయడంతో.... 'ఆగడు' సినిమాకు సొంతగా స్క్రిప్టు రాసుకుని దిగారు శ్రీను వైట్ల. 14 రీల్స్ ఎంటర్‌టైన్మెంట్స్ బేనర్లో 'దూకుడు' సినిమా చేసిన మహేష్ బాబు.....అదే బానర్లో సుకుమార్ దర్శకత్వంలో సినిమాకు చేసారు. ఆ సినిమా వెంటనే మళ్లీ ఇదే బేనర్లో శ్రీను వైట్లతో 'ఆగడు' సినిమా చేయడానికి రెడీ కావడం గమనార్హం. సంగీతం: తమన్‌, ఛాయాగ్రహణం: కె.వి. గుహన్‌, కళ: ఎ.ఎస్‌.ప్రకాశ్‌, కూర్పు: ఎం.ఆర్‌.వర్మ, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: పరుచూరి కోటి.

English summary
As per the sources, Mahesh babu latest movie “Aagadu” is situated against Anantapur faction backdrop story. Mahesh is expected to deal with faction elements and at the same time play comedy. We all know that Srinu Vytla is filled with full of comedy and little bit story.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu