»   » ఇబ్బందే: భయపెడుతున్న మహేష్ ‘శ్రీమంతుడు’ ?

ఇబ్బందే: భయపెడుతున్న మహేష్ ‘శ్రీమంతుడు’ ?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మహేష్‌బాబు హీరోగా నటిస్తున్న చిత్రం'శ్రీమంతుడు'. శ్రుతి హాసన్‌ హీరోయిన్. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌ (సీవీఎమ్‌) నిర్మిస్తున్నారు. ఈ చిత్రంపై ఎక్సపెక్టేషన్స్ రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న ఈ నేపధ్యంలో...బిజినెస్ ఇంకా పూర్తి కాలేదని సమాచారం. నైజాం తప్పించి ముఖ్యంగా వెస్ట్ , ఓవర్ సీస్ బిజినెస్ అసలు కదలటం లేదని ట్రేడ్ వర్గాల ద్వారా తెలుస్తోంది.

దానికి కారణం...మహేష్ గత చిత్రాలు...ఆగడు, 1 నేనొక్కడినే చిత్రాలు భాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ కావటంమే అంటున్నారు. దాంతో తక్కువ రేట్లుకు బయ్యర్లు అడగటం జరుగుతోంది. అయితే నిర్మాతలు మాత్రం తగ్గించటానికి ససేమిరా ఒప్పుకోవటం లేదు. ఈ నేపధ్యంలో బిజినెస్ ఎక్కడ వేసిన గొంగలే అక్కడే ఉందని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. రేట్లు తగ్గిస్తే బిజినెస్ అవుతుందని అంటున్నారు.


ఇక ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ని,టీజర్ ని ఇప్పటికే విడుదల చేశారు. ఫస్ట్ లుక్ లో సైకిల్‌పై స్త్టెలిష్‌గా కనిపిస్తున్న మహేష్‌ లుక్‌ కి మంచి స్పందన వచ్చింది. ఇప్పటికే షూటింగ్ పూర్తికావోచ్చిన ఈ చిత్రం ఆడియో ని ఈ నెల 27న హైదరాబాద్ లో విడుదల చేయడానికి నిర్మాతలు ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. ఈ మేరకు అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.


ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


Mahesh's Srimanthudu giving scares?

మరో ప్రక్క ఈ చిత్రంలో మహేష్ వాడే సైకిల్ ఖరీదు ఎంత ఉండవచ్చు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అందుతున్న సమచారం ప్రకారం ఈ సైకిల్ ఖరీదు... మూడున్నర లక్షలు అని తెలుస్తోంది. ఈ సైకిల్... Canondale కంపెనీవారి Scalpel 29 మోడల్ లో త్రీ ఫ్రేమ్ కార్బన్ అని తెలుస్తోంది. ఇది విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నది. ఈ సైకిల్ ఖరీదు... అక్కడ 5500$ అంటున్నారు. మహేష్ ఓ మిలియనీర్ అని ఈ సైకిల్ తో దర్శకుడు చెప్పాడంటున్నారు.


ఇక ఈ చిత్రంతో మహేష్‌బాబు నిర్మాతగా మారారు. జి.మహేష్‌బాబు ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరుతో సొంతంగా నిర్మాణ సంస్థను ప్రారంభించారు. 'శ్రీమంతుడు' సినిమాతోనే మహేష్‌ చిత్ర నిర్మాణంలోకి అడుగు పెట్టారు. 'శ్రీమంతుడు' పోస్టర్‌లో మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మాణ సంస్థతో పాటు, మహేష్‌బాబు నిర్మాణ సంస్థ లోగో కూడా ముద్రించారు.


'శ్రీమంతుడు' చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి... ఎందుకంటే ఈ సినిమా దర్శకుడు కొరటాల శివ ఇంతకు ముందు ప్రభాస్ కు 'మిర్చి'తో అదిరిపోయే విజయాన్ని అందించాడు... ఆ దిశగా ఆలోచిస్తే- మహేశ్ బాబుకు అంతకంటే మిన్నయైన విజయాన్ని కొరటాల శివ అందిస్తాడని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.


Mahesh's Srimanthudu giving scares?

మైత్రీ క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న 'శ్రీమంతుడు' చిత్రం సకుటుంబ సపరివార సమేతంగా చూడతగ్గ చిత్రమని యూనిట్ సభ్యులు చెబుతున్నారు... దీంతో ఈ సినిమాపై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి.


మహేష్‌బాబు అప్‌కమింగ్‌ మూవీ శ్రీమంతుడు టీజర్‌ ను ఆదివారం రిలీజ్‌ చేశారు. హీరో కృష్ణ బర్త్‌డే సందర్భంగా ఈ టీజర్‌ను రిలీజ్‌ చేశారు. శ్రీమంతుడు మూవీపై మహేష్‌ అభిమానుల్లో భారీ అంచనాలు వున్నాయి. ఈ చిత్రానికి సంబంధించి పోస్టర్ ను శుక్రవారం విడుదల చేసిన సంగతి తెలిసిందే.


మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై మిత్రులు నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, మోహన్‌లు సమష్టిగా 'మిర్చి' ఫేమ్ కొరటాల శివ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. 'ఆగడు' తర్వాత చాలాకాలంగా తెరపై కనిపించని మహేశ్ ఫస్ట్‌లుక్‌కు సహజంగానే అభిమానుల నుంచి విశేషస్పందన లభించింది. ఇప్పుడు టీజర్ ను కూడా రిలీజ్ చేయడం అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచింది.

English summary
Mahesh Babu, Shruti Hasan's Srimanthudu makers are planning to release the film next month, they are experiencing scares. Except for Nizam, West, Overseas business is not completed elsewhere.
Please Wait while comments are loading...