»   » పవన్ కి కౌంటర్ గానే మహేష్ ఆ ట్వీట్

పవన్ కి కౌంటర్ గానే మహేష్ ఆ ట్వీట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

'నేను ఇటీవల చూసిన వినూత్న సినిమాల్లో లవ్ ఫెయిల్యూర్ ఒకటి. సిద్ధార్థ మరియు మొత్తం సినిమా టీంకు కంగ్రాట్స్' అంటూ రీసెంట్ గా మహేష్ బాబు సిద్దార్ద నటించిన లవ్ ఫెయిల్యూర్ చిత్రాన్ని మెచ్చుకుంటూ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. ఎప్పుడూ ఏ సినిమా గురించి నోరు విప్పని మహేష్ హఠాత్తుగా ఇలా మరో సినిమాని ఉద్దేశించి ట్వీట్ చేయటమేంటని అంతటా చర్చ మొదలైంది. అయితే దీనికి కొందరు కంక్లూజన్ ఇస్తున్నారు.

పవన్ కళ్యాణ్ రీసెంట్ గా విడుదలైన ఇష్క్ చిత్రానికి మోరల్ సపోర్టు ఇచ్చారు. అది సూపర్ హిట్టైంది. లవ్ ఫెయిల్యూర్ చిత్రానికి పోటీగా వచ్చిన ఆ చిత్రం మంచి కలెక్షన్స్ వసూలు చేస్తోంది. ఈ నేపధ్యంలో లవ్ ఫెయిల్యూర్ కి మధ్దతు ఇవ్వటం ద్వారా మహేష్ తానేంటో చెప్పదలుచుకున్నాడని అంటున్నారు. రెండు పోటాపోటీ లవ్ స్టోరీలు కావటం, మహేష్, పవన్ ఇద్దరూ పోటాపోటీ హీరోలు కావటమే ఈ ట్వీట్ కి అస్సలు కారణం అని చెప్తున్నారు. ఇది నిజమే అయ్యుండవచ్చు అని కొందరు అంటున్నారు. అవన్నీ ప్రక్కన పెడితే పెద్ద హీరోలు తమ బ్రాండింగ్ వ్యాల్యూతో ఇలా చిన్న హీరోల సినిమాలుకు సపోర్టు ఇవ్వటం మంచిదే అంటున్నారు.

English summary
Mahesh Babu's surprise praises on the 'Love Failure' gained importance in the wake of Pawan Kalyan endorsed Ishq movie.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu