ఆ హీరోయిన్‌తో హర్డిక్ పాండ్యా డేటింగ్? హోటల్‌లో దొరికిపోయిన క్రికెటర్
టీమిండియా క్రికెటర్ హార్ధిక్ పాండ్యా.. క్రికెట్, గ్రౌండ్, రికార్డుల కంటే ఎఫైర్లు, వ్యక్తిగత విషయాల కన్నా ఎఫైర్లు, ప్రేమాయణాలతో వార్తల్లో నిలుస్తుంటాడు. ఇప్పటికే పలువురు హీరోయిన్‌లతో ప్రేమాయణం సాగించిన ఈ స్టార్ క్రికెటర్ తాజాగా మరో నటితో ఎఫైర్ నడుపుతున్నట్లుగా పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. ఏకంగా హోటల్ గదిలోనే ఇతను దొరికిపోయినట్లుగా కథనాలు వస్తున్నాయి. ఈ వివరాల్లోకి వెళితే..
పలువురు హీరోయిన్లతో హార్డిక్ డేటింగ్
కెరీర్ ప్రారంభ నుంచి నేటి వరకు హార్డిక్ పాండ్యా పలువురు హీరోయిన్లతో డేటింగ్ చేశారు. ఈ లిస్ట్‌లో లిషా శర్మ, ఇల్లి అవ్వరం, పరిణితి చోప్రా, ఊర్వశి రౌటేలా, ఈషా గుప్తా, నటాషా స్టాంకోవిక్‌లు ఉన్నారు. వీరిలో నటాషాతో సుదీర్ఘకాలం డేటింగ్ చేసిన ఆయన.. 2020లో ఆమెను పెళ్లాడారు. ఈ దంపతులకు అగస్త్య అనే నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు. సెర్బియాకు చెందిన నటాషా.. మోడలింగ్‌తో పాటు పలు సినిమాలలో నటించారు. ఈ క్రమంలోనే హార్డిక్‌తో పరిచయం, ప్రేమగా మారి పెళ్లికి దారి తీసింది. వీరిద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో ఇద్దరూ పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు.

నటాషాతో విడాకులు
నటాషాతో విడాకుల తర్వాత హార్డిక్ తన ప్రేమాయణాలను తిరిగి ట్రాక్‌లో పెట్టారని క్రీడా వర్గాల్లో పుకార్లు వినిపించాయి. బాలీవుడ్ నటి ఈషా గుప్తాతోనూ ఆయన డేటింగ్ చేశారని వార్తలు వచ్చాయి. అయితే దీనిపై ఈషా గుప్తా స్పందించారు. హార్దిక్‌తో డీప్ రిలేషన్‌లోకి వెళ్లేలోగా తమ దారులు వేరయ్యాయని ఆమె స్పష్టం చేశారు. ఆయనను రెండు, మూడు సార్లు కలిశామని అలా కొద్దినెలల పాటు మా బంధం సాగిందని కానీ ఆ తర్వాత దానికి ఎండ్ కార్డ్ పడిందని ఈమె వెల్లడించారు. ఆ తర్వాత హార్డిక్ ఓ కొత్త గర్ల్ ఫ్రెండ్‌తో తిరుగుతున్నట్లుగా ఇటీవల ఇంటర్నెట్‌లో ఫోటోలు చక్కర్లు కొట్టాయి.
జాస్మిన్ వాలియాతో బ్రేకప్
దుబాయ్‌లో జరిగిన ఐసీసీ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో జాస్మిన్ వాలియా అనే భారత సంతతికి చెందిన బ్రిటీష్ సింగర్, టెలివిజన్ నటితో పాండ్యా చెట్టాపట్టాలేసుకుని తిరిగినట్లుగా కథనాలు వచ్చాయి. బ్రిటీష్ రియాలిటీ షో ద ఓన్లీ వే ఈజ్ ఎస్‌ఎక్స్ షోతో ఆమె పాపులర్ అయ్యారు. జాక్ నైట్‌తో 2017లో చేసిన బామ్ డిగ్గి సాంగ్‌కు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. బిగ్‌బాస్ 13 ఫైనలిస్ట్ అసిమ్ రియాతో కలిసి జాస్మిన్ పలు మ్యూజిక్ వీడియోలు చేశారు. వీరిద్దరూ తర్వాత విడిపోగా.. ఇప్పుడు హార్డిక్ మరో కొత్త నటితో తిరుగుతున్నాడట.
హోటల్‌లో నటితో పాండ్యా
ప్రముఖ మోడల్, నటి మహికా శర్మతో ఆయన ప్రేమాయణం సాగిస్తున్నట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. మహికా శర్మ పోస్ట్ చేసిన ఓ సెల్ఫీ వీడియో ఈ ఊహాగానాలకు కారణం. సదరు వీడియోలో ఓ హోటల్‌లోని మిర్రర్ ముందు నిలబడి మహికా వీడియో తీసుకుంటున్నారు. అందులో ఆమె వెనుక బ్యాక్‌గ్రౌండ్‌లో బ్లర్‌గా కనిపిస్తోన్న ఓ పురుషుడి రూపం అచ్చు గుద్ధినట్లు హార్డిక్ పాండ్యా మాదిరే ఉండటంతో నెటిజన్లు వీరిద్దరూ రిలేషన్‌లో ఉన్నట్లు ఓ ఐడియాకు వచ్చేశారు. అయితే దీనిపై హార్దిక్, మహికా స్పందించాల్సి ఉంది. ఇకపోతే.. చదువు తర్వాత మోడలింగ్, నటనలోకి దిగిన మహికా.. పలు టాప్ బ్రాండ్లకు చెందిన వాణిజ్య ప్రకటనల్లో కనిపించారు. 2024లో జరిగిన ఇండియన్ ఫ్యాషన్ అవార్డుల్లో మోడల్ ఆఫ్ ది ఇయర్ పురస్కారాన్ని మహికా అందుకున్నారు.


Click it and Unblock the Notifications











