»   » పరదేశీ మామ ఎక్కడున్నాడు?, పవన్ కళ్యాణ్ మామ కోసం గాలింపు

పరదేశీ మామ ఎక్కడున్నాడు?, పవన్ కళ్యాణ్ మామ కోసం గాలింపు

Posted By:
Subscribe to Filmibeat Telugu

త్రివిక్రమ్ మరోసారి అత్తారింటికి దారేది లాంటి మేజికల్ బాక్స్ ఆఫీస్ క్రియేట్ చేయడానికి అన్ని విధాలుగా కష్టపడుతున్నాడు. అత్తారింటికి దారేది సినిమాలో ప్రేక్షకులను ఆకట్టుకున్న అంశాలన్నింటినీ అంతకంటే ఎఫెక్టివ్‌గా ఇప్పుడు చేస్తున్న సినిమాలో కూడా ప్రజెంట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు త్రివిక్రమ్. పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్లో ప్రస్తుతం ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే....

పరదేశి

పరదేశి

ముందుగా అనుకున్న 'దేవుడే దిగివస్తే' 'ఇంజినీరు బాబు' టైటిల్స్ మారిపోయి పవన్ పరదేశి గా మారిపోతున్నాడు. ఈ టైటిల్ పూర్తిగా త్రివిక్రమ్ కు నచ్చడంతో ఈ టైటిల్ ను ఫైనల్ చేసి పవన్ అంగీకారం కోసం ఎదురు చూస్తున్నట్లు టాక్. తెలుస్తున్న సమాచారం మేరకు ఏమైనా ఆఖరి నిముషంలో మార్పులు జరిగితే తప్ప 99 శాతం ఈ టైటిల్ ఫిక్స్ అని అంటున్నారు. అయితే ఈ టైటిల్ సంగతి పక్కన పెడితే ఇప్పుడు ఈ సినిమాకి ఇంకో కొత్త ఇబ్బంది వచ్చి పడింది.

మామ కోసం గాలింపు చర్యలు

మామ కోసం గాలింపు చర్యలు

పవన్ కళ్యాణ్ ఓ మామ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అతను ఎక్కడ ఉన్నారోనని ముమ్మరంగా గాలిస్తున్నారు. ఇంతకీ ఈ మామ వ్యవహారం ఏంటనే కదా మీ సందేహం. పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో ఓ చిత్రం తెరకెక్కుతోందన్న సంగతి తెలిసిందే కదా.

మామ పాత్రధారి కోసం

మామ పాత్రధారి కోసం

ఈ చిత్రంలో మామ పాత్రధారి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. హైదరాబాద్‌తో పాటు చెన్నై, ముంబై, కొచ్చిలకు మనుషుల్ని పంపించి మామ కోసం గాలిస్తున్నారు. ఈ సినిమాలో హీరోకు మామ వరసయ్యే ఆ పాత్రకు ఎవరు సూటవుతారోనని త్రివిక్రమ్‌ అండ్‌ కో తెగ వెతుకుతున్నారట.ఇటీవలే వచ్చిన 'అత్తారింటికి దారేది' సినిమాలో అత్త..మామ..ఇలా కొన్ని పాత్రలు అలరించిన సంగతి తెలిసిందే.

'పవన్' ఇంజినీర్ గా

'పవన్' ఇంజినీర్ గా

ప్రస్తుతం టైటిల్ నిర్ణయించని ఈ సినిమా షూటింగ్ కొనసాగుతోంది. ఇందులో 'పవన్' ఇంజినీర్ గా నటిస్తున్నాడని టాక్. ఇక ప్రధాన పాత్రలో 'ఖుష్బూ' నటిస్తున్నారు. ఇందులో ఆమె పాత్ర అత్త అని తెలుస్తోంది. ఇక మామ పాత్రకు ఎవరు నటిస్తే బాగుంటుందనే విషయంలో చిత్ర యూనిట్ తర్జనభర్జనలు పడుతోంది.

మమ్ముట్టి అయితే బాగుంటుందని

మమ్ముట్టి అయితే బాగుంటుందని

తెలుగు, తమిళ, హిందీ, మలయాళ నటుల పేర్లను త్రివిక్రమ్‌కు కాస్టింగ్‌ డైరెక్టర్స్‌ చెబుతున్నారట. ఆయన మనసులో మాత్రం మమ్ముట్టి అయితే బాగుంటుందని అనుకుంటున్నారని సమాచారం. కాగా, ఈ చిత్రంలో పవన్‌కు ఖూష్బూ అత్తగా నటిస్తున్నారనే విషయం తెలిసిందే. అత్త భర్తే ఈ మామ.

English summary
reportedly The team Pawan - Trivikram Movie have approached mammootty.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu