»   »  మేనకోడలికి పాలు పడుతున్న మంచు విష్ణు (ఫోటోస్)

మేనకోడలికి పాలు పడుతున్న మంచు విష్ణు (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నటి మంచు లక్ష్మి నెల రోజుల క్రితం ఓ బిడ్డకు తల్లయిన సంగతి తెలిసిందే. తల్లయిన తర్వాత చాలా ఆనందంగా కనిపిస్తోంది లక్ష్మి. కూతురికి 'విద్యా నిర్వాణ మంచు ఆనంద్' అనే పేరు పెట్టింది. తాజాగా మంచు లక్ష్మి తన సోషల్ నెట్వర్కింగ్‌లో పోస్టు చేసిన ఫోటో ఒకటి ఆసక్తిని రేకెత్తిస్తుంది.

ఆ ఫోటోలో మంచు విష్ణు తన కోడలు విద్యా నిర్వాణకు పాలు పడుతున్నారు. 'ఇందుకే మాది బెస్ట్ ఫ్యామిలీ. నేను...నా భర్త పని మీద బయటకు వెళ్లాం. ఇంట్లో నా బంగారు తల్లిని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నారు' అంటూ ఆ ఫోటో కింద వ్యాఖ్యలు చేసింది మంచు లక్ష్మి.

మంచు లక్ష్మి ఇటీవలే ఓ బిడ్డకు సరోగసీ ద్వారా తల్లయింది. అంటే అద్దెగర్భం ద్వారా పిల్లలను కనడం అన్నమాట. మంచు లక్ష్మి, ఆమె భర్త ఆండీకి సహజ పద్దతిలో పిల్లలు పుట్ట లేదు. చాలా కాలం పిల్లల కోసం డాక్టర్ల చుట్టూ తిరిగారు. ఈ పరిణామ క్రమంలో చివరకు పిల్లలు వద్దనుకున్నారు. కానీ సరోగసీ ద్వారా పిల్లలు పుట్టే అవకాశం ఉండటంతో ఆ విధంగా తల్లిదండ్రులయ్యారు.

పాలు పడుతున్న విష్ణు

పాలు పడుతున్న విష్ణు


తన మేనకోడలికి పాలు పడుతున్న మంచు విష్ణు.

జూన్ 15న జన్మించింది

జూన్ 15న జన్మించింది


మంచు లక్ష్మి కూతురు విద్యా నిర్వాణ మంచు ఆనంద్ జూన్ 15వ తేదీన జన్మించినట్లు తెలుస్తోంది.

నెలలు నిండక ముందే

నెలలు నిండక ముందే


మంచు లక్ష్మి కూతురు వాస్తవానికి రెండు వారాల ముందు జన్మించాలి. కానీ మెడచుట్టూ బొడ్డతాడు చుట్టుకోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ముందు సిజేరియన్ చేయాల్సి వచ్చిందట.

అరియానా, వివియానా

అరియానా, వివియానా


ఒకానొక సమయంలో పిల్లలను వద్దనుకున్న మంచు లక్ష్మి, ఆండీ దంపతులు....విష్ణు కూతుర్లయిన అరియానా, వివియానా అల్లరి చూసిన తర్వాత తమకూ బిడ్డ ఉంటే బాగుండనే ఆలోచనకు వచ్చారు.

English summary
"This is why my family is the best. Andy & I are at work.Look how beautifully my baby sitters are taking care of Nivi" Manchu Lakshmi said.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu