»   » ఏం... పిచ్చి పిచ్చిగా ఉందా? క్లాస్ పీకడంతో ట్వీట్ డిలీట్ చేసిన మంచు మనోజ్?

ఏం... పిచ్చి పిచ్చిగా ఉందా? క్లాస్ పీకడంతో ట్వీట్ డిలీట్ చేసిన మంచు మనోజ్?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: టాలీవుడ్ యంగ్ హీరో మంచు మనోజ్ ఈ రోజు ఉదయం చేసిన ట్వీట్ చూసి అంతా షాకయ్యారు. ప్రస్తుతం తాను చేస్తున్న 'ఒక్కడు మిగిలాడు' మరియు నా నెక్ట్స్ మూవీ నటుడిగా నా చివరి సినిమా.....థాంక్యూ ఆల్ అంటూ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.

నటుడిగా తన కెరీర్‌కు పులిస్టాప్ పెడుతున్నాను..... అని అర్థం వచ్చేలా ఉన్న ఆ ట్వీట్ మంచు అభిమానులను డిసప్పాయింట్ చేసింది. అయితే ఆ ట్వీట్‌ను గంట వ్యవధిలోనే మనోజ్ డిలీట్ చేశాడు. కానీ అప్పటికే ఆ న్యూస్ వైరల్ అయింది.


క్లాస్ పీకిన్ మోహన్ బాబు? ట్వీట్ డిలీట్

క్లాస్ పీకిన్ మోహన్ బాబు? ట్వీట్ డిలీట్

మనోజ్ ఈ ట్వీట్ చేసిన విషయం వెంటనే వైరల్ అవ్వడం.... మోహన్ బాబుతో పాటు మంచు విష్ణ, మంచు లక్ష్మికి చేవిన పడటంతో.... వెంటనే మనోజ్‌ను పిలిపించి క్లాస్ పీకారని, వారి బలవంతంతోనే ట్వీట్ డిలీట్ చేశారని తెలుస్తోంది.


మనోజ్ సమాధానం ఇది..?

మనోజ్ సమాధానం ఇది..?

తనకు దర్శకత్వంపై ఆసక్తి ఉందని.... నిర్మాతగా, దర్శకుడిగా తన సత్తా నిరూపించుకోవాలనే ఉద్దేశ్యంతోనే ఆ ట్వీట్ చేసినట్లు వారికి మనోజ్ సమాధానం చెప్పినట్లు తెలుస్తోంది.


దర్శకత్వం ఓకే... కానీ ఇలా వద్దు

దర్శకత్వం ఓకే... కానీ ఇలా వద్దు

దర్శకత్వం చేయాలనిపిస్తే.... చేయ్, కానీ నటుడిగా ఇదే నా చివరి సినిమా అంటూ పిచ్చి పిచ్చి ట్వీట్స్ చేయొద్దు. రేపు ఏదైనా మంచి కథ వస్తే.... మళ్లీ నటుడిగా మారాల్సి వస్తే ఏం చేస్తావు? అంటూ మంచు కుటుంబ సభ్యులు గట్టిగా మందలించినట్లు సమాచారం.


అభిమానులు కూడా...

అభిమానులు కూడా...

మంచు మనోజ్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఆయన అభిమానులకు కూడా నచ్చడం లేదు. ఇంత చిన్న వయసులో మనోజ్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఏమిటి....ఆయనకు ఇంకా చాలా భవిష్యత్ ఉంది, దర్శకత్వం చేయాలనకుంటే చేయాలి కానీ.... నటనకు దూరం అవ్వడం లాంటి నిర్ణయాలు తీసుకోవద్దు అని కోరుతున్నారు.


పబ్లిసిటీ స్టంట్

పబ్లిసిటీ స్టంట్

అయితే కొందరు మాత్రం ఇదంతా మంచు మనోజ్ తన సినిమా ‘ఒక్కడు మిగిలాడు' కోసం చేసిన పబ్లిసిటీ స్టంట్ అంటూ.....విమర్శిస్తున్నారు. ఈ రోజు ఈ మూవీ టీజర్ రిలీజ్ ఉన్న నేపథ్యంలో కావాలనే ఇలాంటి ట్వీట్ చేసి ఉంటాడని అంటున్నారు.ఒక్కడు మిగిలాడు

ఒక్కడు మిగిలాడు

ఒక్క‌డు మిగిలాడు ఒక విభిన్నమైన థీమ్ తో తెరకెక్కుతున్న చిత్రం. కమర్షియల్ యాంగిల్ నుంచి కాకుండా.. ఓ రియల్ స్టోరీని సినిమాగా తీస్తున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన ఫ‌స్ట్ లుక్ ఈ మూవీపై భారీ అంచ‌నాలు పెంచింది. శ్రీలంకలో తమిళుల హక్కుల కోసం ప్రభుత్వంపై పోరాటం చేసిన ఎల్టీటీఈ థీమ్ తో ఈ స్టోరీ ఉండనుండగా.. మనోజ్ పాత్ర ఎల్టీటీఈ కమాండర్ న‌టిస్తున్నాడు.


మంచు మనోజ్ వివరణ

మంచు మనోజ్ వివరణ

తన ట్వీట్ పై పెద్ద దుమారం రేగడంతో మంచు మనోజ్ వివరణ ఇచ్చారు. తాను చేయబోయే కొత్త సినిమా ప్రకటించడానికే ఇలా వినూత్నంగా ఆలోచించి, ఆ ట్వీట్ చేశాన‌ని తెలిపారు. చాలా మంది త‌న‌ పోస్ట్‌ను రకరకాలుగా అర్థం చేసుకున్నారని, కానీ అది ఇలా అవుతుందని అనుకోలేదని చెప్పాడు.English summary
Hours after announcing to quit acting, Manchu Manoj has deleted his tweet. The Current Theega actor, who earlier posted that Okkadu Migiladu and his next film, would be his last films, has deleted his post on his Twitter page.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu