twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇంకో బాలీవుడ్ రీమేక్ కు సై అన్నాడు

    By Srikanya
    |

    హైదరాబాద్ : తెలుగులో రీమేక్ లు మీద ఆధారపడి సక్సెస్ లు వెతుక్కునే హీరోలు ఎక్కవ అవుతున్నారనే చెప్పాలి. ముఖ్యంగా ప్రొడక్షన్ పెరిగిపోతూండటంతో సేప్టీ రిటర్న్ కోసం రిలీజ్ కు ముందే జరిగే ప్రీ రిలీజ్ క్రేజ్ కోసం రీమేక్ లను ఆశ్రయిస్తున్నారు. ఇలాంటి రీమేక్ స్పెషలిస్టులలో ఈ మధ్య చేరి దూసుకుపోతున్న హీరో మంచు విష్ణు. రీసెంట్ గా తమిళ రీమేక్ చిత్ర ఎర్రబస్సులో నటిస్తున్న విష్ణు మరో రీమేక్ కమిటయ్యారని సమాచారం. ఆ చిత్రం మరేదో కాదు బాలీవుడ్ లో మంచి విజయం సాధించిన నేషనల్ అవార్డు విన్నింగ్ హిందీ చిత్రం ‘ స్పెషల్ ఛబ్బీస్ 26′. ‘ స్పెషల్ ఛబ్బీస్ 26′ రీమేక్ రైట్స్ ని నటుడు, దర్శకుడు అయిన త్యాగరాజన్ పొందారు. ఆయనే డైరక్ట్ చేయనున్నారు.

    గతంలో మంచు విష్ణు చేసిన గేమ్, అస్త్రం, పాండవులు పాండవులు తుమ్మెద చిత్రాలు బాలీవుడ్ రీమేక్ లే కావటం విశేషం. ఇక ఈ చిత్రంలో కనిపించే నకిలీ సీబీఐ ఆఫీసర్ పాత్రకు మంచు విష్ణు అయితే సరిపోతాడరని రీమేక్ రైట్స్ పొందన త్యాగరాజన్ భావించారట. ఆయన మంచు విష్ణు రీసెంట్ గా చేసిన అనుక్షణం చిత్రం చూసి ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. మంచు విష్ణు సైతం ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. తమిళ వెర్షన్ కు త్యాగరాజన్ కుమారుడు ప్రశాంత్(జీన్స్ ఫేమ్) హీరోగా చేయనున్నారు.

    త్యాగరాజన్ మాట్లాడుతూ... " నేను హిందీలో విజయవంతమైన స్పెషల్ 26 రైట్స్ తీసుకున్నాను. ఆ గోల్డన్ ఆపర్చునిటీ నాకే దక్కింది. సౌత్ లోని నాలుగు భాషల రైట్స్ నా దగ్గరే ఉన్నాయి. నేనే ఈ చిత్రాన్ని స్వయంగా డైరక్ట్ చేస్తాను ". అన్నారు. ఇక త్యాగరాజన్ గతంలో కంగన రనత్ హీరోయిన్ గా వచ్చిన క్వీన్ చిత్రం రీమేక్ రైట్స్ సైతం తీసుకుని ఇప్పటివరకూ మొదలుపెట్టని సంగతి తెలిసిందే.

    Manchu Vishnu in one more Bollywood Remake

    గతంలో ‘స్పెషల్ ఛబ్బీస్' చిత్రానికి సంబంధించిన రీమేక్ రైట్స్ దర్శకుడు ఎన్.లింగుస్వామి స్వంతం చేసుకున్నారనే వార్తలు వచ్చాయి. అంతేకాకుండా తానే నిర్మాతగా స్వీయ దర్శకత్వంలో కమల్‌హాసన్‌తో ఈ చిత్రాన్ని రీమేక్ చేయడానికి సంకల్పించారు. విశ్వరూపం సీక్వెల్ పూర్తయిన తరువాత ఈ చిత్రంలో కమల్ నటించనున్నారని అన్నారు అయితే ఇది క్రియారూపం దాల్చలేదు. ఈ లోగా ఏం జరిగిందో ఏమో త్యాగరాజన్ ఈ రైట్స్ ని సొంతం చేసుకున్నాడు. లింగు స్వామి నుంచి తీసుకుని ఉండవచ్చు అంటన్నారు.

    ఈ సినిమా హిందీలో కమర్షియల్ గా సక్సెస్ కావడమే కాకుండా బాక్స్ ఆఫీస్ దగ్గర 50 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఈ సినిమా 80లలో కొంతమంది నకిలీ సి.బి.ఐ ఆఫీసర్లుగా బొంబాయిలోని ఒక నగల షాపుని దోచుకున్న యాదార్త సంఘటనల ఆధారంగా రూపొందింది.

    మార్చి 19, 1987లో ఒక అజ్ఞాత వ్యక్తి తాను సీబీఐ అధికారినని నమ్మబలికి 26 మంది ఆదాయపు పన్నుశాఖ అధికారుల బృందంతో ఒపెరా హౌజ్‌లోని త్రిభువన్‌దాస్‌ జవేరీ నగల దుకాణంలో లక్షలాది విలువైన బంగారు ఆభరణాలను దోచుకెళ్లిన సంఘటనను తెరకెక్కించారు. నకిలీ ఐటీ అధికారుల పేరుతో ఇటీవలి సంఘటనల ఆధారంగా దర్శకుడు నీరజ్‌ పాండే ఈ సినిమాను తీసారు. రియా చౌహాన్‌ అనే ఒక ఉపాధ్యాయిని పాత్రలో కాజల్ కనిపించింది.

    కథగా చెప్పాలంటే...ఇది 1987 నాటి కథాంశం. అక్షయ్‌ కుమార్‌ మోసం చేయటంలో నెంబర్‌ వన్‌. అతడి గ్యాంగ్‌లో మరోముగ్గురు. వీరి టార్గెట్‌ రాజకీయ నాయ కులు, బ్లాక్‌మనీ అధికారులు, వ్యాపారవేత్తలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎవరీ వద్ద బ్లాక్‌మనీ ఉంటే నకిలీ సిబిఐ అధికారులుగా అక్కడ వాలుతారు. నిలువు దోపిడీ చేస్తారు. వీరికి ఇన్‌స్పెక్టర్‌ తోడ్పడతాడు. అసలైన సిబిఐ ఆఫీసర్‌ మనోజ్‌ బాజ్‌పాయ్‌ వీళ్లను పట్టడానికి ప్లాన్‌ మీద ప్లాన్లు వేస్తాడు.

    వీరి ఆఖరి టార్గెట్‌ బొంబాయిలోని జ్యూయెలరీ షాప్‌. సిబిఐ ఆఫీసర్‌ పక్కా ప్లాన్‌ చేస్తాడు ఈసారి ఎలాగైనా అక్షయ్‌ని పట్టుకోవాలని. చివరికి నేరస్తుడు దొరికాడా? లేదా? అన్నదే క్లైమాక్స్‌. ఈ సినిమాకు సంగీత దర్శకులు చందన్‌ శర్మ, హిమేష్‌ రేష్‌మ్మియా, ఎం.ఎం. కీరవాణి. క్రైం కథని సీరియస్‌గా నడిపించాడు. అక్షయ్‌కుమార్‌, అనుపమ్‌ఖేర్‌, కాజల్‌ బాగా చేశారు.

    English summary
    Actor-cum-Director Thiagarajan acquired all the Southern language remake rights of Bollywood hit 'Special 26' which stars Akshay Kumar, Kajal Agarwal and Anupam Kher. While Prasanth (Jeans fame) plays the lead in Tamil version, Manchu Vishnu is expected to play the lead in Telugu version.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X