వర్మ తో మంచు ఫ్యామిలీ మరో చిత్రం...డిటేల్స్

అయితే ఈ సారి ఈ కాంబినేషన్ లో రూపొందే చిత్రం వర్మ రెగ్యులర్ గా చేసే థ్రిల్లరా,హ్రర్రరా,లేక యాక్షన్ ఎంటర్టైనరా అనేది తెలియాల్సి ఉంది. ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైందని ఫిల్మ్ నగర్ వర్గాల భోగట్టా. అయితే ఎప్పుడు ఈ చిత్రం ఓపినింగ్ జరుపుతారు..ఎప్పుడు రౌడి రిలీజ్ చేస్తారు వంటివి ప్రెస్ మీట్ ద్వారా ఒకేసారి తెలియచేస్తారని అంటున్నారు. అలాగే రౌడీ చిత్రం ఆడియోని సైతం ఘనంగా చేయాలని మోహన్ బాబు భావిస్తున్నట్లు సమాచారం.
ఇక మోహన్ బాబు - మంచు విష్ణు ప్రధాన పాత్రల్లో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ 'రౌడీ'. ఈ సినిమా ఫస్ట్ లుక్ ని విడుదల చేసారు. మోహన్ బాబుకి జోడీగా జయసుధ నటించనున్న ఈ సినిమాలో మంచు విష్ణు సరసన శాన్వి హీరోయిన్ గా కనిపించనుంది.
ఏవి పిక్చర్స్ బేనర్లో పార్థ సారథి, గజేంద్ర, విజయ్ కుమార్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి ఫోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమాని రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో పవర్ఫుల్ యాక్షన్ అండ్ పొలిటికల్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిస్తున్నారు. ఎమోషన్ సీన్లతో పాటు హై ఓల్టేజ్ సన్నివేశాలు ఇందులో ఉంటాయని తెలుస్తోంది.
సినిమాలో మోహన్ బాబు పెద్ద కుమారుడుగా కన్నడ కిషోర్, రెండవ కుమారుడుగా మంచు విష్ణు నటిస్తున్నట్లు సమాచారం. వర్మ కు అత్యంత ఇష్టమైన గాడ్ ఫాధర్ పోలికలతోనే ఈ చిత్రం తెరకెక్కుతోందని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. రిలీజైన ఫస్ట్ లుక్ ఫోటోలు చిత్రంపై క్రేజ్ ని క్రియేట్ చేస్తున్నాయి.


Click it and Unblock the Notifications











