»   » మనోజ్ తో పబ్ ల వెంట తిరుగుతున్న హీరోయిన్

మనోజ్ తో పబ్ ల వెంట తిరుగుతున్న హీరోయిన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఝుమ్మంది నాదం చిత్రంలో హీరోయిన్ గా పరిచయం అవుతున్న తాప్సి లేటెస్ట్ హైదరాబాద్ లో ఓ పేరొందిన పబ్ లో హీరో మనోజ్ తో కలిసి చిందులేస్తూ కనపడి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఒక్క సినిమా అన్నా పూర్తి కాకుండానే ఆమె ఇలా తిరగటం కొత్త ఆఫర్స్ పట్టడానకేనంటున్నారు. మనోజ్ తన సర్కిల్స్ లో ఉన్న నిర్మాతలకు, హీరోలకు పరిచయం చేస్తాడనే ఆశతో ఈ డిల్లీ ముద్దుగుమ్మ ఇలా తిరిగుతోందంటున్నారు. ఇక సీనియర్ దర్శకులు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ ఝుమ్మంది నాదం చిత్రంలో మోహన్ ‌బాబు ఓ విభిన్నమైన పాత్రలో కనిపించునున్నారు. మ్యూజికల్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని మోహన్ బాబు కుమార్తె లక్ష్మీ ప్రసన్న నిర్మిస్తోంది. ఓ పాట, కొద్దిపాటి సన్నివేశాలు మినహా చిత్రీకరణ పూర్తయింది. నిర్మాత ఈ చిత్రంలో సుమన్‌, తనికెళ్ల భరణి, బ్రహ్మానందం, ఎమ్మెస్‌ నారాయణ, ధర్మవరపు, అలీ, రఘుబాబు, ఐశ్వర్య, ప్రగతి, సుధ, శైలజ నటిస్తున్నారు. మూల కథ: భూపతిరాజా, కథ-స్క్రీన్‌ప్లే: గోపీ మోహన్‌, రవి బీవీఎస్‌, మాటలు: శశి రాజసింహ, ఛాయాగ్రహణం: ఎస్‌.గోపాల్‌ రెడ్డి, సంగీతం: కీరవాణి, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: అశోక్‌ కుమార్‌ రాజు.ఎమ్‌.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu