»   » ఇంత చెత్త పోస్టరా ...తిడుతున్నారు

ఇంత చెత్త పోస్టరా ...తిడుతున్నారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : క్రియేటివిటీ వెర్రి తలలు వేస్తే ఎలా ఉంటుందో అలా ఉందీ పోస్టర్ అని అంతటా విమర్శలు వినిపిస్తున్నాయి. మంత్ర, మంగళ అంటూ ఛార్మితో చిత్రాలు రూపొందించిన ఓషో తులుసి రామ్ తాజాగా క్రిమినల్స్ అంటూ ఓ చిత్రం మొదలెట్టారు. ఈ చిత్రానికి సంభందించిన పోస్టర్ ని విడుదల చేసారు. ఈ పోస్టర్ ని చూసిన వారంతా షాక్ అవుతున్నారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఓ అమ్మాయిని కామాంధులు అత్యాచారం చేసి చీకట్లోకి తోసేసారా..అన్నట్లుగా ఇలా బట్టలు చించేసి మరీ పోస్టర్ వదిలాడు. ఇలా చూపించంటం ఎంత వరకూ సబబు అంటున్నారు. ఇలాంటివి జనాలుకు చూపించటంలో దర్సకుడు ఉద్దేశ్యం ఏమి ఉన్నా...సమాజంపై నెగిటివ్ ప్రభావం చూపటం ఖాయం అంటున్నారు.

అంతేకాదు ఇలాంటి వాటి ద్వారా...స్త్రీకి బయిట స్వేఛ్చ శూన్యం అనే భావనను ప్రచారం చేస్తున్నట్లు ఉంది అంటున్నారు. దర్శకుడు మనుస్సులో ఏమి ఉన్నా కాస్త పోస్టర్స్ ద్వారా కేవలం పబ్లిసిటీ నే కాకుండా మిగతావి కూడా ఆలోచించాలి అని చెప్తున్నారు.

Mantra director Tulasiram's new movie first look

చిత్రం విషయానికి వస్తే...

'మంత్ర' దర్శకుడు ఓషో తులసీరామ్ దర్శకత్వంలో మంత్ర ఎంటర్టెన్మెంట్స్ పతాకంపై 'మంగళ' చిత్రాన్ని రూపొందించిన నిర్మాత సి.హెచ్.వి.శర్మ తాజాగా ఓషోతులసీరామ్ దర్శకత్వంలో మరో చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'క్రిమినల్స్' పేరుతో రూపొందుతున్న ఈచిత్రంలో నిషా కొఠారి ప్రధాన పాత్ర పోషిస్తోంది.

ఓషో తులసీరామ్ మాట్లాడుతూ...'సైబర్ క్రైమ్ నేపథ్యంలో సాగే కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాము. సెప్టెంబర్ రెండో వారంలో ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తున్నాం. హైదరాబాద్, తలకోన, బ్యాంకాక్ తదితర ప్రాంతాల్లో షూటింగ్ జరుగుతుంది' అన్నారు.

హీరోయిన్ నిషా కొఠారి మాట్లాడుతూ 'తులసీరామ్ గారు చెప్పిన కథ బాగా నచ్చింది. డిఫరెంట్ కాన్సెప్టుతో అందరినీ థ్రిల్ చేసే విధంగా ఉంటుంది. నాకు అన్ని విధాలా నచ్చిన క్యారెక్టర్ కావడంతో ఈ సినిమా చేస్తున్నారు. ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుందని భావిస్తున్నాను' అన్నారు.

ఈ చిత్రంలో నిషా కొఠారి ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఇతర నటీనటుల వివరాలు తెలియాల్సి ఉంది. మంత్ర చిత్రానికి సంగీతం అందించిన ఆనంద్ ఈచిత్రానికి కూడా బానీలు సమకూర్చనున్నాడు. నిర్మాత : సి.హెచ్.వి.శర్మ, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం : ఓషో తులసీరామ్.

English summary
Here comes one such poster from talented director Tulasiram who has earlier made worthy movies like Mantra and Mangala that won critical acclaim.Titled 'Criminals', this film's poster showcases a girl, probably in her mid 20s, with teared up clothes.
Please Wait while comments are loading...